టాలీవుడ్ జక్కన్న సృష్టించిన అద్బుత సృష్టి ‘బాహుబలి’. మొదటి పార్ట్ వచ్చి చాలా నెలలు అవుతున్నా కూడా ఇప్పటికి కూడా ఆ పేరు మారు మ్రోగి పోతూనే ఉంది. ప్రస్తుతం రాజమౌళి రెండవ పార్ట్ కోసం స్క్రిప్ట్ వర్క్‌ను చేస్తున్నాడు. ముందుగా అనుకున్న ప్రకారం బాహుబలి మొదటి పార్ట్ విడుదల అయిన సమయంలోనే అంటే వచ్చే సంవత్సరం జులై లేదా అగస్టులో రెండవ పార్ట్‌ను విడుదల చేస్తాం అంటూ స్వయంగా రాజమౌళి ప్రకటించాడు.కాని కొన్ని కారణాల వల్ల రెండవ పార్ట్ షూటింగ్ ప్రారంభం ఆలస్యం అయ్యింది. దానికి తోడు మొదటి పార్ట్ భారీ విజయం రెండవ పార్ట్‌పై మరింతగా అంచనాలు పెంచింది. ఈ కారణాల వల్ల రెండవ పార్ట్ ఇప్పటికి కూడా షూటింగ్ ప్రారంభం అవ్వలేదు. సినీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం వచ్చే సంవత్సరం సంక్రాంతి తర్వాత ‘బాహుబలి’ రెండవ పార్ట్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. దాంతో ఈ చిత్రం విడుదల 2016లో ఉండక పోవచ్చని, 2017లోనే రెండవ పార్ట్ విడుదల అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలియాలి అంటే 2016 వరకు ఆగాలని చెప్పిన చిత్ర యూనిట్ సభ్యులు ఇకపై 2017 వరకు ఆగాల్సిందే అని చెబుతున్నారు. ఇంతకు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో. అది తెలియాలంటే 2017లో రాబోతున్న ‘బాహుబలి’ రెండవ పార్ట్ చూసి తెలుసుకోండి. .
Tuesday, 3 November 2015
2017లో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు

Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment