అంకిత గుర్తుందా ? రస్నా ప్రకటన ద్వారా ఫేమస్ అయిన ఈ బ్యుటిని అంతా రస్నా బేబి అని పిలిచేవారు. వైవిఎస్ చౌదరి తీసిన లాహిరి లాహిరి లాహిరి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. తోలి చిత్రంలోనే తన అందాలతో అందరిని ఆకట్టుకున్న ఈ భామ ఎన్టీఆర్ సింహాద్రి తో మంచి డిమాండ్ సాధించింది. సింహాద్రి లో చీమ చీమ అనే సీన్, ఆ తరువాత వచ్చే పాట ఇప్పటికి కుర్రాళ్ళ మతి పోగోడుతూనే ఉంది.ఆ తరువాత బాలకృష్ణ సరసన్ విజయేంద్రవర్మలో మెరిసింది. ఎంత త్వరగా స్టార్ అయిందో , అంతే త్వరగా మెత్తబడింది అంకిత. కారణాలు తెలియకపోయినా, విజయేంద్రవర్మ తరువాత ఈ అమ్మడికి అవకాశాలు రాలేదు. ఎంతసేపు అందాల ఆరబోతే తప్ప నటిగా తనని తానూ నిరుపించుకోకపోవడమే అంకిత కెరీర్ ను పాడు చేసి ఉండొచ్చు. అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూ, మధ్యలో గోపీచంద్ రారాజు లో మెరిసినా, ఆ సినిమా ఆడకపోవడంతో ఇక అవకాశాలు లేక అమెరికా వెళ్ళిపోయింది అంకిత. అక్కడే సినిమా టెక్నాలజీలో శిక్షణ పొంది కొన్ని హాలివుడ్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసింది అంకిత. ఆ సమయలోనే పరిచయమైన న్యూజెర్సీకి చెందిన ఎన్నారై, జెపి మోర్గాన్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అయిన విశాల్ జగ్తాప్ ను త్వరలో పెళ్ళాడబోతోంది ఈ రస్నా బేబి. వీరిద్దరికీ పెద్దల సమక్షంలో ముంబైలో నిశ్చితార్థం జరిగింది. .

No comments:
Post a Comment