‘సైజ్ జీరో’ ఆడియో విడుదల సందర్బంగా అనుష్క తొడల గురించి అలీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం దుమారం లేపుతున్నాయి. మహిళా సంఘాల వారు ఆందోళనలు చేస్తున్నారు. అలీ గతంలో పలు ఇలాంటి కామెంట్స్ చేశాడు అని, ఆయన చేస్తున్న కామెంట్స్ ఆడవానికి అవమాన పర్చేవిగా ఉన్నాయి అంటూ మహిళ సంఘాల వారు విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలపై తాజాగా క్లారిటీ ఇచ్చేందుకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు అలీ.ఆ ఇంటర్వ్యూలో అలీ మాట్లాడుతూ. తాను ఆడియో ఫంక్షన్‌కు వచ్చిన ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌మెంట్ చేసేందుకు ఏదో మాట్లాడాను తప్ప, తప్పుడు ఉద్దేశ్యం ఏమీ లేదు అని, అనుష్క తొడల గురించి తాను మాట్లాడిన విషయాలు తప్పు అని తాను భావించడం లేదు అని అలీ క్లారిటీగా చెప్పాడు. గతంలో మహేష్‌బాబు ‘ఖలేజా’ చిత్రంలోనే అనుష్క తొడలు బాగా బలిసి ఉన్నాయి అంటూ డైలాగ్ చెప్పాడు. అప్పుడు ఇబ్బంది కుగలేదు కాని, తాను అనగానే ఇలా విమర్శలు చేయడం ఏంటని అలీ ఎదురు ప్రశ్నిస్తున్నాడు. అలీ అన్న దాంట్లో కూడా లాజిక్ ఉంది కదా ఆలోచించాలని అలీ సన్నిహితులు అంటున్నారు. మొత్తానికి అనుష్క తొడల వివాదంలో మహేష్‌బాబు కూడా వచ్చి చేరాడు. .

No comments:
Post a Comment