Monday, 28 September 2015

అభిమాన హీరోతో లావణ్య సరసాలు

మన చిన్ననాటి నుండి సినిమాల్లో చూసి ఇష్టపడే అభిమాన హీరోలను, హీరోయిన్లను జీవితంలో ఒక్కసారైనా నిజంగా చుస్తే చాలు అనుకుంటాం. అలాంటిది పెరిగి పెద్దయి, అభిమాన హీరో సరసన హీరోయిన్ గా నటించే అవకాశం ఎంతమందికి వస్తుంది . కొట్లలో కొంతమందికి ఆ కొంతమందిలో ఒకరు లావణ్య త్రిపాఠి అందాల రాక్షసిగా తెలుగు తెరకు పరిచయమై, మెప్పించి, ఇటివలే భలే భలే మొగాడివోయ్ తో మనల్ని కడుపుబ్బా నవ్వించింది లావణ్య. ఈ అమ్మడి అభిమాన హీరో నాగార్జున. మన మన్మధుడి అందానికి పడిపోయిన లిస్టులో టీనేజ్ లో ఉన్నప్పుడే చేరిందట లావణ్య. నిజానికి లావణ్య తెలుగు అమ్మాయి కాదు. ఉత్తరాఖండ్ లో పుట్టి పెరిగింది. తెలుగు అస్సలు రాదు . కాని హిందీలోకి డబ్ అయ్యి, హిందీ చానెళ్ళలో ప్రసారమయ్యే నాగార్జున సినిమాలు తెగ చేసేదట. ఆ రకంగా నాగార్జున అంటే అభిమానం పెరింగింది. ఇప్పుడు ఏకంగా కింగ్ సరసన " సోగ్గాడే చిన్ని నాయన " లో జతకట్టింది. నాగ్ తో రీల్ లైఫ్ లో రోమాన్స్ చేయడం ఇంకా నమ్మలేకపోతోందట. అదృష్టం కాకపొతే ఏంటి ఇది !

No comments:

Post a Comment