గడుసరి భామ ఇలియానా మరోసారి సంచలన వాఖ్యలు చేసింది. ఏకంగా నా శరీరం , నా ఇష్టం అనేసింది. ఇంతకి అలా ఎందుకు అనాల్సివచ్చిందో అని అనుకుంటూన్నారా? అయితే విషయం పూర్తిగా చదవండి ఇటివలే ఓ బాలివుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది ఇలియానా అందులో ఇతరుల అభిప్రాయం అనే టాపిక్ వచ్చింది. అప్పుడు ఇలియానా అందుకోని " మన గురించి ఒకరు ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని నేనస్సలు పట్టించుకోను. నా కెరీర్ తొలినాళ్ళలో నా శరీరంలో హీరోయిన్ లక్షణాలు లేవు అనేవారు. నా ఛాతి చాలా చిన్నదని,మరీ బక్కగా ఉన్నానని, హీరోయిన్ లా ఆకట్టుకోలేనని అనేవారు. తరువాత నా సన్నని నడుమే నాకు చాలా మంది అభిమానులను తెచ్చిపెట్టింది. వాళ్ళ మాటలను పట్టించుకోని నన్ను నేను తక్కువగా అంచనా వేసుకోని ఉండుంటే, ఈరోజు ఈ స్థాయికి చేరుకునేదాన్నే కాదు." అంటూ ఇతరుల అభిప్రాయాలపై తన అభిప్రాయాన్ని చెప్పింది ఈ నాజూకు నడుము సుందరి. మీరు కూడా ఇతరుల మాటలు పాట్టించుకోకుండా, ఇలియానా పథ్థతి పాటించండి..

No comments:
Post a Comment