Sunday, 1 November 2015

ఇదే నా ఫస్ట్‌ కిస్.. బాగా పెట్టానా


ఇప్పటివరకు పోస్టర్స్‌తో అభిమానులను అలరించిన ‘కుమారి 21ఎఫ్’ ట్రైలర్ వచ్చేసింది. కేవలం నిమిషమున్నర ట్రైలర్‌లో హీరో రాజ్‌తరుణ్‌ని హేండ్సమ్‌గా చూపించాడు దర్శకుడు. హైదరాబాద్ శిల్పకళావేదికగా జరిగిన ఆడియో ఫంక్షన్‌కి గెస్ట్‌గా అల్లుఅర్జున్ వచ్చాడు. ఈ ట్రైలర్‌కు నెటిజన్స్ నుంచి మాంచి స్పందన వచ్చింది. ఇద్దరు అమ్మాయిలను చూపిస్తూ స్టోరీ మొదలవుతోంది. ట్రెండ్‌కు తగ్గట్టుగానే డైలాగ్స్ మరీ ఓవర్‌గా వున్నట్లు కనిపిస్తున్నాయి. లొకేషన్స్ బాగున్నాయి. స్టోరీ మొత్తం లవర్స్ మధ్యే తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. రాజ్‌తరుణ్ హీరోగా హేబాపటేల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్. ప్రజెంట్ క్యాంపెయిన్ షురూ చేసిన నిర్మాత, లెక్కల మాస్టార్ సుకుమార్, ఈనెల్లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట.

No comments:

Post a Comment