Tuesday, 13 October 2015

నిహారిక ఎంట్రీపై చరణ్‌ షాకింగ్‌ కామెంట్స్‌



మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్‌గా నిహారిక ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే బుల్లి తెరపై యాంకర్‌గా తన సత్తా చాటిన ఈ మెగా అమ్మాయి త్వరలో వెండి తెరపై తళుక్కుమనేందుకు రెడీ అవుతోంది. మధుర శ్రీధర్‌ మరియు టీవీ9 సంయుక్తంగా నిర్మించనున్న చిత్రంలో నాగశౌర్యకు జోడీగా హీరోయిన్‌గా నటించనుంది ఇప్పటికే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చింది
కొన్ని రోజుల క్రితం టీవీ9లో నిహారిక సుదీర్ఘ ఇంటర్వ్యూ వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో స్వయంగా నిహారిక తాను సినీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించింది. ఇంత జరుగుతున్న ఈ సమయంలో తాజాగా రామ్‌ చరణ్‌ ఈ విషయంపై షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. నిహారిక ఎంట్రీ గురించి మీడియా మిత్రులు చరణ్‌ను ప్రశ్నించిన సమయంలో తనకు ఆ విషయం తెలియదు అని షాక్‌ ఇచ్చాడు. చరణ్‌ చేసిన ఈ కామెంట్స్‌ ప్రస్తుతం మెగా ఫ్యాన్స్‌లో చర్చనీయాంశం అవుతున్నాయి. నిహారిక స్వయంగా పెదనాన్న చిరంజీవితో పాటు అన్నయ్యలు చరణ్‌, వరుణ్‌లు కూడా తన ఎంట్రీకి ఓకే చెప్పారు అని చెప్పుకొచ్చింది. కాని చరణ్‌ ఈ కామెంట్స్‌తో ఏదో గందరగోళం తెర వెనుక జరుగుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. .

No comments:

Post a Comment