Wednesday, 30 September 2015

దేనికైనా రెడీ: ఐశ్వర్యారాయ్‌


తెరపై ఎలాంటి పాత్రల్లో నటించడానికైనా తాను పూర్తి సంసిద్ధంగా వున్నానని అంటోంది బాలీవుడ్‌ భామ, అందాల ఐశ్వర్యం.. ఐశ్వర్యారాయ్‌. ఆరాధ్యకు జన్మనిచ్చాక కొన్నాళ్ళపాటు సినిమాలకు దూరమైంది ఐశ్వర్యారాయ్‌. తిరిగి మేకప్‌ వేసుకుని, ఆమె నటించిన 'జజ్‌బా' సినిమా విడుదలకు సిద్ధమైంది. 
ప్రస్తుతం 'జజ్‌బా' సినిమా ప్రమోషన్‌లో బిజీగా వున్న ఐశ్వర్యారాయ్‌, ఓ తమిళ సినిమాకి కమిట్‌ అయ్యిందట కూడా. అయితే అది ప్రస్తుతానికి గాసిప్‌ మాత్రమే. రజనీకాంత్‌ నటిస్తోన్న 'కబలి' సినిమాలో ఐష్‌ నటించబోతుందన్నది ఆ గాసిప్‌ సారాంశం. అదలా వుంచితే, ఇక నుంచి గ్యాప్‌ తీసుకోకుండా వరుస సినిమాల్లో నటిస్తానని ఐశ్వర్యారాయ్‌ చెబుతోంది. 
తల్లిగా ఆరాధ్య బాధ్యతలు చూసుకోవడం తనకు కొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న ఐశ్వర్యారాయ్‌, ఆ అనుభవం 'జజ్‌బా' సినిమాలో నటించడానికి ఉపయోగపడిందని చెబుతోంది. యోగా చేయడం ద్వారా శరీరాన్ని మునుపటికంటే ఫిట్‌గా మార్చుకుందట ఐశ్వర్య. గ్లామరస్‌ పాత్రలు మళ్ళీ తెరపై చేస్తారా.? అనడిగితే, 'వై నాట్‌.. నేను దేనికైనా రెడీ..' అంటూ సమాధానమిచ్చింది. గ్లామర్‌ అంటే ఎక్స్‌పోజింగ్‌, వల్గారిటీ అనే ఎందుకు అనుకుంటారు.? అంటూ ఐశ్వర్య ఎదురు ప్రశ్నించింది. 
సినిమాల్లో రీ-ఎంట్రీ ఇవ్వడానికి ఫ్యామిలీ సపోర్ట్‌ చాలా వుందనీ, 'జజ్‌బా' ప్రేక్షకులకు మంచి థ్రిల్‌ ఇస్తుందనీ, ఆలోచింపజేస్తుందని ఐశ్వర్యారాయ్‌ చెప్పుకొచ్చింది. ఇకపై నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు, యాక్షన్‌ మూవీస్‌ ఎక్కువగా చేయాలనుకుంటోందట ఐశ్వర్యారాయ్‌.

అయ్యో.. అనుష్కకు ఎంత కష్టం

టాలీవుడ్‌ క్వీన్‌ అనుష్కకు వింత చిక్కు వచ్చింది. ఈమె నటించిన రెండు చిత్రాలు ఒకే రోజున విడుదల అవ్వనుండటంతో ఎక్కడలేని కష్టాలు ఈమెకే వచ్చి పడ్డాయి. ఈ రెండు చిత్రాలు కూడా హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలే ఈ రెండు చిత్రాల ప్రమోషన్‌కు కూడా అనుష్క చాలా ముఖ్యం దాంతో ఈమె ఏ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొనాలో తెలియక తల పట్టుకుంది. ‘రుద్రమదేవి’ చిత్రం కోసం ఈమె వారం ముందు నుండి ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అగ్రిమెంట్‌ కుదుర్చుకుంది. అదే విధంగా ‘సైజ్‌ జీరో’ చిత్రానికి కూడా ప్రమోషన్‌ కార్యక్రమాలు నిర్వహిస్తాను అంటూ అగ్రిమెంట్‌లో పేర్కొంది. ‘రుద్రమదేవి’ మరియు ‘సైజ్‌ జీరో’ చిత్రాలు అనుకోని పరిస్థితుల్లో రెండు ఓకే రోజున విడుదల కాబోతున్నాయి. అక్టోబర్‌ 9కి ఈ రెండు సినిమాలు ఫిక్స్‌ అయ్యాయి. డేట్‌ దగ్గర పడుతున్నా కొద్ది అనుష్కకు టెంన్షన్‌ మరింతగా పెరిగి పోతుందట. నిన్న మొన్నటి వరకు ఏదో ఒక సినిమా వాయిదా పడే అవకాశాలున్నాయని భావించిందట. కాని తాజాగా అందుతున్న వార్తల ప్రకారం రెండు సినిమాలు కూడా అక్టోబర్‌ 9న విడుదల ఖాయం అంటున్నారు. అటు గుణశేఖర్‌ ఇటు ప్రకాష్‌ కోవెల మూడి ఇద్దరు కూడా తమ సినిమాల ప్రమోషన్‌ కోసం అనుష్కను బంతాట ఆడుకోవడం ఖాయం అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఒక్క సీన్ కోసం 34 టేకులు తీసుకున్న హీరోయిన్


సినిమాల్లో నటించినడం అనుకున్నంత సులభం కాదు . ఎండకి ఒర్చాలి, వానకి తడవాలి, నిద్రాహారాలు మానాలి . ఎంత పట్టుదల ఉంటె ఇది సాధ్యపడుతుంది అందుకే అందరు స్టార్స్ కాలేరు ముగ్గుగుమ్మ రెజినాది కుడా కష్టపడే వ్యక్తిత్వం . అందుకే వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇంకా ఇండస్ట్రీలో నెట్టుకొస్తోంది, మంచి ఆఫర్స్ పొందుతోంది . ఇటివలే రిలీజ్ అయిన సుబ్రహ్మణ్యం ఫర్ సెల్ లో చాలా కష్టపడి చేసిన సీన్ ఒకటి ఉందట . దాని గురించి రెజినా చెబుతూ . "న్యూజెర్సీలో అత్యంత చలిగా ఉండే ఓ నదీ ప్రాంతంలో ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలో షూటింగ్‌ చేశాం. ఆ స్పాట్‌లో తేజ్‌, బ్రహ్మానందం, నేనూ ఉన్నాం. అక్కడి చలికి నా గొంతు వణికిపోయింది. డైలాగ్‌ చెప్పలేని పరిస్థితి. చలి తట్టుకోలేక ఓ సందర్భంలో ఏడుపొచ్చేసింది. కంట్రోల్‌ చేసుకున్నాను. దాదాపు ఆ సన్నివేశం చిత్రీకరణకు 34 టేకులు తీసుకున్నాం. అప్పుడు అనిపించింది యాక్టింగ్‌ అంత ఈజీ కాదని. " ఇలా తన కష్టాన్ని మీడియాతో పంచుకుంది

Monday, 28 September 2015

అభిమాన హీరోతో లావణ్య సరసాలు

మన చిన్ననాటి నుండి సినిమాల్లో చూసి ఇష్టపడే అభిమాన హీరోలను, హీరోయిన్లను జీవితంలో ఒక్కసారైనా నిజంగా చుస్తే చాలు అనుకుంటాం. అలాంటిది పెరిగి పెద్దయి, అభిమాన హీరో సరసన హీరోయిన్ గా నటించే అవకాశం ఎంతమందికి వస్తుంది . కొట్లలో కొంతమందికి ఆ కొంతమందిలో ఒకరు లావణ్య త్రిపాఠి అందాల రాక్షసిగా తెలుగు తెరకు పరిచయమై, మెప్పించి, ఇటివలే భలే భలే మొగాడివోయ్ తో మనల్ని కడుపుబ్బా నవ్వించింది లావణ్య. ఈ అమ్మడి అభిమాన హీరో నాగార్జున. మన మన్మధుడి అందానికి పడిపోయిన లిస్టులో టీనేజ్ లో ఉన్నప్పుడే చేరిందట లావణ్య. నిజానికి లావణ్య తెలుగు అమ్మాయి కాదు. ఉత్తరాఖండ్ లో పుట్టి పెరిగింది. తెలుగు అస్సలు రాదు . కాని హిందీలోకి డబ్ అయ్యి, హిందీ చానెళ్ళలో ప్రసారమయ్యే నాగార్జున సినిమాలు తెగ చేసేదట. ఆ రకంగా నాగార్జున అంటే అభిమానం పెరింగింది. ఇప్పుడు ఏకంగా కింగ్ సరసన " సోగ్గాడే చిన్ని నాయన " లో జతకట్టింది. నాగ్ తో రీల్ లైఫ్ లో రోమాన్స్ చేయడం ఇంకా నమ్మలేకపోతోందట. అదృష్టం కాకపొతే ఏంటి ఇది !

వామ్మో .. శృతి కుడా రేటు పెంచేసింది

                                                               
ఒక్క సినిమా హిట్ అయితే చాలు తారల డిమాండ్ నిజంగానే తారలను తాకుతుంది . పెద్ద తారాగణంతో సినిమా చేస్తే సినిమా సగం ఖర్చు వాళ్ళ పారితోషికానికి పోతుంది . తీసేది చిన్న సినిమా అన్న పట్టింపు కుడా లేదు శృతి హాసన్ అమాతంగా రేటు పెంచేసింది గబ్బర్ సింగ్ కి ముందు శృతిహాసన్ ని అంతా ఐరన్ లెగ్ అన్నారు . సినిమా బ్లాక్బస్టర్ అవడంతో ఒక్కసారిగా కోటి రూపాయలు డిమాండ్ చేయడం మొదలుపెట్టింది శృతి . ఇప్పుడు శ్రీమంతుడు ఘన విజయం తరువాత మళ్ళి రేట్ పెంచేసింది . అది కుడా అంతా ఇంతా కాదు . మారుతి కి ఆ బడ్జెట్ ఇస్తే ఓ సినిమా తీసి పెడతాడు ! నాగచైతన్య చేయబోతున్న ప్రేమం రీమేక్ లో శృతిని కథానాయికగా అనుకుంటున్న విషయం తెలిసిందే . ఈ సినిమా కోసం శృతి హాసన్ ఏకంగా రెండు కోట్లు డిమాండ్ చేసిందట . అవాక్కైన నిర్మాతలు సినిమాకి అంత గ్లామర్ రావాలంటే తప్పదు కదా అని సరే అన్నారట ! శృతి నటించిన పులి వచ్చే వారం విడుదల కాబోతోంది . అది కుడా హిట్ అయితే శృతి రేట్ ఇంకా ఎక్కడిదాకా పోతుందో !.

రూమర్స్ కొట్టిపడేసిన సమంత

తెలుగు, తమిళ భాషల్లో అందరు అగ్ర హీరోలను కవర్ చేస్తూ నిత్యం బిజీ బిజీగా ఉండే తార సమంత . ఇటు నటన మాత్రమె కాకుండా , పలు సేవా కార్యక్రమాల్లో కుడా పాల్గొంటూ క్షణం తీరిక లేకుండా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ . ఈ మధ్య సమంత మీద ఓ గాలివార్త ప్రచారంలోకి వచ్చింది అదేంటంటే తమిళ హీరో సూర్యతో దర్శకుడు విక్రమ్ కుమార్ రూపొందిస్తున్న 24 చిత్రం యొక్క తెలుగు హక్కులు సమంత తీసుకుంటున్నట్లు గాలి వార్తలు చక్కర్లు కొట్టాయి . హీరోయిన్ గా బాగానే సంపాదిస్తోంది కదా . మళ్ళి లేని పెంట ఎందుకు సమంత కు అని ముక్కున వేలేసుకున్నరంతా . అయితే ఇదంతా ఉత్తిదే, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని కొట్టిపడేసింది సమంత. తనకి షూటింగ్స్ తోనే టైం అంతా గడిచిపోతోందని, డేట్స్ అడ్జస్ట్ అవక, చాలా సినిమాలు వదిలేసుకుంటుంటే . టైం పాస్ కోసం మీడియా వారు రాసుకున్న గాలివార్తలే ఇవన్ని అని రుమార్స్ ని ఖండించింది సమంత. అయినా సినిమా వ్యాపారం చేసుకునేంత ఖాలిగా లేదుగా సమంత.

Wednesday, 23 September 2015

సన్నీ లియోన్ పడిచచ్చిన మగాడు ఎవరు ?


సన్నీలియోన్ అంటే దాదాపు మగజాతి మొత్తానికి ఇష్టం . కాని సన్నీ కి నచ్చిన మగాడు ఎవరో తెలుసా ? చిన్ననాటి నుంచి సన్నీ పడిచచ్చిన ఆ అందగాడు ఎవరో తెలుసా ? ఎవరు సన్నీ ని ఏడిపించారో తెలుసా ? తెలియకపోతే పూర్తిగా చదవండి . మిమల్ని ఆకర్షించిన మగాడు ఎవరు అని మీడియా అడిగిన ప్రశ్నకు సన్నీ సమాధానం చెబుతూ " యుక్తవయసులో మనం అందరం ఖచ్చితంగా ఎవరో ఒకరికి ఆకర్షితులం అవుతాం నేను కుడా అంతే నాకు చిన్ననాటి నుండి ఆమీర్ ఖాన్ అంటే పిచ్చి ఇష్టం . ఎంత పిచ్చి అంటే ఆమీర్ సినిమాలో ఏం చేస్తే అదే చేసేదాన్ని, చెబితే నవ్వుతారు కాని, ఆమీర్ ఖాన్ సెంటిమెంట్ సన్నివేశాల్లో ఏడుస్తుంటే నాకు కుడా ఎడుపోచ్చేది, తనతో పాటు నేను కుడా ఎడ్చేదాన్ని . అదేం పిచ్చి అని నన్ను అందరు తిట్టినా పట్టించుకునేదాన్ని కాదు . ఆమీర్ లేకపోతే , ఆమీర్ సినిమాలు లేకపోతే నా బాల్యం చాలా బోరింగ్ గా గడిచేదేమో " అంటూ అమీర్ మీద పిచ్చి అంత బయటకు చెప్పేసింది. ఎవరితో నటించాలని కలలు కంటుంటారు అనే మరో ప్రశ్నకు " అందరిలానే ఖాన్ త్రయంతో పని చేయాలని నాకు ఉంటుంది . కాని అందరిలోకి ఒక్కరిని ఎంపిక చేసుకొమ్మంటే మాత్రం . నేను ఆమీర్ ఖాన్ అంటాను " అంటూ కోరికను బయటపెట్టింది. .

Tuesday, 22 September 2015

జ్వరంతో బాధపడుతున్న ముద్దుగుమ్మ

సినిమా హీరోలకే సౌకర్యం . ఒకే సినిమా మీద ఉంటారు ఆ చిత్రం పూర్తీ అయ్యేవరకు . సరిపడా డబ్బులు, విశ్రాంతికి విశ్రాంతి హీరోయిన్ల పరిస్థితి ఇందుకు పూర్తీ భిన్నం కెరీర్ ఎక్కువ కాలం ఉండదు . కాస్త వయసు మీదపడినా జనాలు చూడటం మానేస్తారు. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి . వయసులో ఉన్నప్పుడే ఎన్ని వీలయితే అన్ని సినిమాలు చేసి నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలి. అంత బిజీ షెడ్యుల్ తో జీవితాన్ని గడపడం చాలా కష్టం . ఈ క్రమంలో ఎన్ని పాట్లు పడాలో ! ముద్దుగుమ్మ హన్సిక కి ఓ కష్టం వచ్చి పడింది . ఇటు తమిళ, ఇటు తెలుగు చిత్రాలతో నిత్యం బిజీ బిజీగా గడిపే హన్సికకు ఇరవై గంటల వ్యవధిలో నాలుగు ప్రాంతాలు చుట్టి రావాల్సిన చిక్కోచి పడింది . నాలుగు విమానాలు ఎక్కి, నాలుగు పనులు చేసుకోని . ఒకే రోజులో నాలుగు షూటింగ్ లలో పాల్గొనే సరికి జ్వరం తో పాటు గొంతు ఇన్ఫెక్షన్ వచ్చేసిందట హన్సికకు . ఈ విషయాన్ని ఇదిగో ఇలా ఆ అమ్మడే ట్వీట్ చేసి చెప్పింది.

సరైనోడితో ప్రియమణి రొమాన్స్‌!


అల్లు అర్జున్‌ ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రంతో ఫుల్‌ జోష్‌తో ఉన్నాడు. ప్రస్తుతం ఈయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నాడు. ‘లెజెండ్‌’ వంటి భారీ హిట్‌ తర్వాత బోయపాటి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి ఇప్పటికే ఈ సినిమాకు ‘సరైనోడు’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు ఈ సినిమాలో బన్నీకి జంటగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు మరింతగా గ్లామర్‌ అద్దేందుకు దర్శకుడ బోయపాటి ఈ సినిమాలో ప్రియమణితో ఐటెం సాంగ్‌ చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. గత కొంత కాలంగా సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ వస్తోంది ఈ అమ్మడు. ఆఫర్లు లేక పోవడంతో, తమిళం మరియు తెలుగులో ఛాన్స్‌ల కోసం తిరిగి తిరిగి ఇక ఛాన్స్‌లు రాక పోవడంతో ప్రియమణి పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తల సంగతేమో కాని తాజాగా ఈ అమ్మడికి మెగా హీరో సినిమాలో ఐటెం సాంగ్‌ చేసే బంపర్‌ ఆఫర్‌ వచ్చింది. ఈ పాట తర్వాత ప్రియమణి మళ్లీ బిజీ అయ్యే ఛాన్స్‌లు ఉన్నాయి. హీరోయిన్‌గానే కాకుండా ఐటెం సాంగ్స్‌లో, అతిథి పాత్రల్లో నటించేందుకు తాను సిద్దం అంటూ ఇప్పటికే ప్రియమణి ఓకే చెప్పింది. ప్రియమణికి సరైనోడు మళ్లీ ఆఫర్లు తెచ్చి పెడతాడేమో చూడాలి.

Monday, 21 September 2015

'కబలి'లో అందాల ఐశ్వర్యం.!


'రోబో' సినిమాలో రజనీకాంత్‌ సరసన హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్‌ అందాల ఐశ్వర్యం తాజాగా మరోమారు రజనీకాంత్‌తో జతకట్టనుందట. 'కబలి' సినిమా కోసం రజనీకాంత్‌ స్వయంగా ఐశ్వర్యారాయ్‌తో మాట్లాడారంటూ తాజాగా తమిళ సినీ వర్గాల్లో గాసిప్స్‌ విన్పిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో ఐష్‌ నటించేది హీరోయిన్‌గా కాదనీ, ఓ చిన్న పాత్రలో మాత్రమేననీ తెలుస్తోంది.  'కబలి' సినిమాలో రాధికా ఆప్టే హీరోయిన్‌గా నటిస్తోంది. పా రంజిత్‌ ఈ చిత్రానికి దర్శకుడు. ఎస్‌.థాను ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తమిళ సినీ పరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రంగా 'కబలి'ని రూపొందించబోతున్నారట. ఇటీవలే ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది.  ఇక, 'కబలి'లో రజనీకాంత్‌ గెటప్‌ చాలా డిఫరెంట్‌గా కన్పిస్తోంది. గాడ్‌ఫాదర్‌ తరహాలో రజనీకాంత్‌ గెటప్‌ని ఇప్పటికే రిలీజ్‌ చేశారు. అయితే దీంతోపాటుగా క్లీన్‌ షేవ్‌తో స్టయిలిష్‌గా ఇంకో గెటప్‌లో కూడా రజనీకాంత్‌ కనిపిస్తాడట. అయితే ఐశ్వర్యారాయ్‌ నటించే విషయమై చిత్ర దర్శక నిర్మాతలు ఇంకా పెదవి విప్పడంలేదు. ఓ సౌత్‌ సినిమాకి ఐశ్వర్య తాజాగా కమిట్‌ అయ్యిందనే ప్రచారం బాలీవుడ్‌లోనూ షురూ అవడంతో అది 'కబలి' అన్న వాదనలకు బలం చేకూరుతోంది.  ప్రస్తుతం ఐశ్వర్యారాయ్‌ 'జజ్‌బా' అనే బాలీవుడ్‌ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న విషయం విదితమే.

Sunday, 20 September 2015

సూపర్‌హాట్ సన్నీ మార్నింగ్స్!!


కరణ్ మల్హోత్రా...పేరే కొత్తగా విన్నట్టుంది కదూ!  కానీ...రూపం మాత్రం సుపరిచితమే. కౌంటర్లో టికెట్ కొని లైట్లారిన థియేటర్లోకి వెళ్లి  సినిమాల్ని చూసే ప్రేక్షకుడికి ఆమెని ప్రత్యేకించి పరిచయం చేయనవసరం లేదేమో? సెవన్టీఎంఎం స్క్రీనంతా దేహాన్ని పరిచేస్తూ వీక్షకుల ‘సౌందర్య దాహాన్ని’ తీర్చే అభిసారిక...బాలీవుడ్ తారక ఆమె.  నిజానికి, ఆమె సినీ అరంగేట్రమే ఓ సంచలనం. తర్వాత్తర్వాత...ఆమె ప్రతిచిత్రం ఇంచుమించు వివాదాస్పదం. సినిమాల్లో ‘హాట్‌హాట్’గా, ‘వార్తల్లో వ్యక్తి’గా ప్రముఖంగా ఆమె కనిపిస్తూనే ఉంది. తన కదలికల్తో జనాల్ని కదిలిస్తూనే ఉంది. అంతగా ప్రాచుర్యం పొందిన ఆమెని ‘కరణ్ మల్హోత్రా’గా ఎవరూ గుర్తించరు. కారణం... అయిదక్షరాల స్క్రీన్‌నేమ్‌తోనే ఆమె అశేషప్రేక్షకలోకాన్నీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆ పేరు వింటే చాలు...యువ హృదయాలు కరెంట్‌షాక్‌కి గురైనట్లు విలవిల్లాడుతాయి. ఎస్..ఆమె ఒకప్పటి ‘నీలితార’. ఇప్పటి బాలీవుడ్ నాయిక సన్నీలియోన్.  ఎప్పుడూ ఏదోరకంగా వార్తల్లో ఉండే సన్నీలియోన్ తాజాగా...మరోసారి మీడియాకెక్కింది. అదీ...సరికొత్త వర్కవుట్ల సంచలన డీవీడీతో. హైటెంపో మ్యూజిక్...పెప్పీనంబర్‌తో రిలీజైన సన్నీలియోన్ వర్కవుట్ల డీవీడీయే ఇప్పుడు తాజా సంచలనం. దీనికి సంబంధించిన న్యూసే ఇంటర్‌నెట్‌లో ఇప్పుడు హల్‌చల్ చేస్తూ అత్యధిక ‘క్లిక్’లను నమోదు చేస్తోంది...ఒకప్పడు ‘జిస్మ్‌టూ’లా. వర్కవుట్ సాంగ్ స్పెషల్ అట్రాక్షన్ ఈ తాజా డీవీడీకి సన్నీలియోన్ ప్రధాన ఆకర్షణ కాగా, వర్కవుట్ సాంగ్ ప్రత్యేకాకర్షణ. ‘సన్నీ హై సూపర్...సూపర్! ఫిట్ హై నీచే సే ఊపర్!! వన్నాబీ లైక్ హర్!! స్ట్రెచ్ యువర్‌సెల్ఫ్ అండ్ మూవ్ యువర్ బాడీ!!’’ అనే పల్లవితో సాగే ఈ సాంగ్ ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో ప్రతిధ్వనిస్తోంది. ‘హిప్ రొటేషన్...ట్విస్టింగ్...జంపింగ్...జావింగ్...పంచింగ్...ఎవ్విరీ మార్నింగ్ అండ్ ఈవినింగ్’’ ప్రతిఒక్కరికీ అవసరమనే సందేశంతో రూపొందిన ఈ సాంగ్‌పట్ల యువత విశేషంగా ఆకర్షితమవుతోంది. ‘‘సన్‌లీ..సన్‌లీ తూ ఆజా...ఫిట్‌నెస్ కీ దునియా మే ఆ జా!! అనే ఆహ్వానం పలుకుతున్న ఈ గీతం...‘‘మేక్ యువర్ మార్నింగ్ హాట్ అండ్ సన్నీ..బాత్ మేరీ మానో మై హనీ...ఫర్ సెక్సీబాడీ మై హనీ!!’’ అంటూ సాగుతుంది. ‘‘ఫిట్‌నెస్ ె డెస్టినేషన్...మైండ్ మే ె కాంసంట్రేషన్...ఎక్సర్‌సైజ్‌కీ ఇస్  జర్నీ మే మజా బహుత్ హై!! బాడీమే మాగ్నటిజమ్! జిసాె్క ఫాసినేషన్!! ఫిట్ ెకే సబ్‌కీ నజరోంమే స్టార్‌వో బన్ జాయే!! అరె..మోడల్ జైసీ బాడీ బనాకీ స్టయిలిష్  జారే!! సబ్‌కీ చుట్టీ కార్‌జారే!! అంటూ నయాగారా జలపాతంలా ెరెత్తే వాద్యనేపధ్యంలో ఈ గీతం ఆద్యంతం సాగుతుంది.  మధ్యమధ్యలో ఎక్సర్‌సైజ్‌కి సంబంధించిన సలహాలు, సూచనలు కూడా పాట రూపంలోనే వినిపిస్తాయి. వర్కవుట్‌లో హాట్‌హాట్‌గా సన్నీలియోన్..ఆపేరుకున్న ప్రత్యేకత అంతాఇంతా కాదు. ఆమె మాజీ పోర్న్‌స్టార్. ‘అడల్ట్ స్టార’నే ముద్రతో బాలీవుడ్‌కి ఏతెంచిన సన్నీలియోన్ ‘హాట్ హాట్’ చిత్రాల్తోనే తనదైన ముద్ర వేసుకుంది. అప్పుడెప్పుడో 2003లో రిలీజైన ‘జిస్మ్’కి సీక్వెల్‌గా పూజాభట్ దర్శకత్వంలో ‘జిస్మ్‌టూ’ సినిమాతో ప్రేక్షకలోకాన్ని విష్ చేసిన సన్నీలియోన్ ఆ తర్వాత వివాదాల్తో సహవాసం చేస్తూనే కెరీర్‌ను ముందుకు నడిపిస్తోంది. ‘జిస్మ్..’ అంటే ‘దేహం’ అని అర్ధం. దేహాల సందేహాల్ని తీర్చేందుకుగాను ‘జిస్మ్’ రూపొందగా...‘బిగ్‌బాస్’ రియాల్టీషో ద్వారా ఇండియన్స్‌కి పరిచితమైన సన్నీలియోన్‌ని ‘జిస్మ్‌టూ’ ద్వారా బాలీవుడ్‌కి పరిచయమైన నేపధ్యంలో రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. సన్నీలియోన్ నగ్నదేహంపై పల్చటి తెల్ల చీర కప్పి ఆ చిత్రం ఫస్ట్‌లుక్ విడుదల చేసారు. దాంతోపాటు పూజాభట్ దర్శకత్వం చేయడంతో ఆ సినిమాకి ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. అంతేకాదు...! ‘బిగ్‌బాస్’ రియాల్టీషోలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఇండియా గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను ‘బిగ్‌బాస్’ షోలో పాల్గొన్న తర్వాతనే భారతీయులు లైంగికత గురించి బాహాటంగా మాట్లాడుకునే స్వేచ్ఛను పొందారన్నదే ఆ వ్యాఖ్యల సారాంశం. నీలితారగా పనిచేసానని..ఇప్పుడు బాలీవుడ్‌లో స్టార్‌గా  ఎదగాలనే ఆకాంక్షతోనే అహర్నిశలూ పనిచేస్తున్నానని సమయం దొరికినప్పుడల్లా ఆమె ప్రకటిస్తోంది. అంతేనా! పోర్న్‌స్టార్లంటే ప్రాస్టిట్యూట్‌లు కారంటూ తనదైన వాదన వినిపిస్తోంది. ఆ వాదన ఖండించేవాళ్లే ఎక్కువనేవాళ్లూ మనలోనే ఉన్నారు. సన్నీలియోన్ భారత్‌లో ఉండొద్దు అడల్ట్ కంటెంట్ అధికంగా ఉన్న సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీలో తనదైన స్థానాన్ని సముపార్జించుకోవడానికి ఆమె చేస్తున్న ప్రయత్నం అంతాఇంతా కాదు. అదే సందర్భంలో చేస్తున్న సినిమాలు, అంగీకరించిన యాడ్స్ ద్వారా ఎప్పటికప్పుడు సన్నీలియోన్ పీకల్లోతు వివాదాల్లో కూరుకుపోతూనే ఉంది. భారతీయ మూలాలున్న సన్నీలియోన్‌ని భారత్ నుంచి తరిమేస్తే తప్ప మంచి జరగదంటూ ఆమెకి వ్యతిరేకంగా ఉద్యమస్థాయిలో గొంతెత్తేవాళ్లు బాలీవుడ్‌లో పుష్కలంగానే ఉన్నారు. ఆమెతో పోలిస్తే చిరాకు పడే తారలకూ కొదవ లేదు. రాఖీసావంత్‌లాంటి వాళ్లు సన్నీలియోన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆమె సినిమాలకు సెన్సార్ కత్తెర పడుతూనే ఉంది. యాడ్స్‌కి సంబంధించి ఆమెకు సమన్లు జారీ అవుతూనే ఉన్నాయి. కండోమ్ ఉత్పత్తికి సంబంధించి టీవీ కమర్షియల్‌లో కనిపించినందుకుగాను రక్షజ్యోతి ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్ధ సన్నీలియోన్‌పై కేసు పెట్టింది. దాంతో, ఆమధ్య లుధియానా పోలీసులు ఆమెకి సమన్లు జారీ చేసి హడావుడి చేసారు. ఈ సందర్భంగానే సన్నీలియోన్‌పై కొంతమంది బాలీవుడ్‌స్టార్స్ విమర్శనాస్త్రాలు గుప్పిస్తూ...యువతను చెడిపేస్తుందంటూ పేర్కొన్నారు. అంతేకాదు...బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ముంబైలో అద్దెకు సన్నీలియోన్‌కి ఇల్లు కూడా దొరకలేదు. సన్నీపై షార్ట్‌ఫిల్మ్? నీలితారగా, సినీతారగా...చీకటివెలుగుల క్రీనీడల్తో సయ్యాటలాడిన సన్నీలియోన్ తన జీవితం ‘తెరిచిన పుస్తకమ’ంటూ అభివర్ణిస్తోంది. దిలీప్‌మెహతా అనే డైరక్టర్ సన్నీలియోన్ నిజజీవితాన్ని ఆధారంగా చేసుకుని ఓ షార్ట్‌ఫిల్మ్ రూపొందించేందుకు సన్నాహాలు బాలీవుడ్‌లో వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ వార్తను సన్నీలియోన్ భర్త డేనియల్ వేబర్ కూడా ధృవీకరించారు. వచ్చే ఏడాది ఈ డాక్యుమెంటరీని ఓ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించేందుకుగాను రూపొందిస్తున్నట్లు ఆయన చెప్తున్నారు. ఓవైపు నిజజీవితం ఆధారంగా షార్ట్‌ఫిల్మ్ నిర్మాణ ప్రయత్నాల నేపధ్యంలో...అంతకు ముందుగానే ‘వర్కవ్లు డీవీడీ’తో ముందుకొచ్చింది సన్నీలియోన్.  ప్రియాంక, హృతిక్‌లకు ప్రశంస వర్కవుట్ డీవీడీ ఆవిష్కరణ సందర్భంగా సన్నీలియోన్ బాలీవుడ్ నాయికానాయకులు ప్రియాంక చోప్రా, హృతిక్ రోషన్‌లను ప్రశంసల్తో ముంచెత్తింది. ప్రియాంక చోప్రాది ‘వెల్‌షేప్‌డ్ బాడీ’ అని మెచ్చుకుంది. అదే సమయంలో హృతిక్ రోషన్‌ది ‘పర్‌ఫెక్ట్ స్కల్‌ప్టెడ్ బాడీ’గా అభివర్ణించింది. కెమెరా ముందు అందంగా  కనిపించాలంటే ‘వర్కవుట్ల’ అవసరం ఎంతైనా ఉందని సెలవిస్తున్న సన్నీలియోన్ అందుకోసం తనవంతు ప్రేరణగా వర్కవుట్ డీవీడిని రూపొందించింది. ‘హృదయాల్నే కాదు...ఉదయాల్ని సైతం వేడెక్కిస్తా’నంటున్న సన్నీలియోన్ వర్కవుట్ డీవీడీల్లో హాట్‌గానే ఉంది. ఔను...‘సూపర్‌హాట్ సన్నీ మార్నింగ్స్’ మరి.  గతంలో ‘నీలితార’ అనే ముద్రను చెరిపేసుకుని మెయిన్‌స్రీమ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తానూ భాగమేనంటూ ప్రూవ్ చేసుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్న ఈ తార...వర్కవుట్ డీవీడీద్వారా ఏ సందేశం ఇవ్వదలచుకుందీ అనే ప్రశ్నకు మాత్రం ...తన క్రేజూ, ఇమేజ్‌నీ బిజినెస్ చేసుకోవడానికేననే అభిప్రాయం కూడా వెల్లువెత్తుతోంది. గతంలో శిల్పాశెట్టి కూడా యోగ పేరుతో ఇలాంటి ప్రయత్నమే చేసింది. ఇప్పుడు ఫాంలో ఉన్న సన్నీలియోన్ వంతు. 

Saturday, 19 September 2015

ప్రేమ వ్యవహారం ఉంటే బయటకెళ్లి చూసుకోండి


సినిమా అంటేనే బోలెడంత టైం తీసుకునే జాబ్‌. అలాంటి టైంలో పని మీదే ధ్యాస ఉండాలి తప్ప. సొంత పైత్యం ప్రదర్శించుకూడదు. వృధాగా టైం ఖర్చవుతుంటే నిర్మాతకు ఎంతో టెన్షన్‌గా ఉంటుంది. హీరోయిన్‌ నయనతార కూడా తన సొంత వ్యవహారంతో నిర్మాత ధనుష్‌కు విపరీతమైన కోపం తెప్పిస్తుందట.  వివరాల్లోకి వెళితే రజనీ కాంత్‌ అల్లుడు ధనుష్‌ నిర్మాతగా తమిళంలో నిర్మిస్తున్న ఓ సినిమాకు విఘ్నేష్‌ శివన్‌ దర్శకుడు. సేతుపతి హీరో, నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక దర్శకుడు విఘ్నేష్‌తో నయనతారకు ఎఫైర్‌ ఉండడం వల్ల సెట్లో అసలు పని ఎగ్గొట్టి, తమ లవ్‌ గొడవలో మునిగిపోతూ రోజుకు అతి తక్కువ సీన్లు తీస్తుండటంతో ధనుష్‌కు ఒళ్లు మండిపోయి ఇద్దరికీ వార్నింగ్‌ ఇచ్చేశాడట.  మీకు చెప్పాల్సిన సంగతి కాదు. ఇలా టైం వేస్ట్‌ చేస్తే ఎంత ఖర్చు వేస్టవుతుంది. మీకు ఏదైనా పర్సనల్స్‌ ఉంటే బయట చూసుకోండి. ఇలా సెట్లో కాదు అని మొహమాటం మొహమ్మీదే చేప్పేయడంతో నయనతార నొచ్చుకుందట. వెంటనే ఐశ్వర్య (ధనుష్‌ భార్య) రంగంలోకి దిగి నయనతారను జోకొట్టిందట. ప్రేమ వేరు.. బిజినెస్‌ వేరు కదా.. సెట్లో ప్రేమించుకోవడం ఎందుకు. షూటింగ్‌ అయిపోయాక తెల్లారే వరకూ మీ ఇష్టం కదా అంటూ నచ్చచెప్పడంతో నయనతార కూల్‌ అయ్యిందట.

Friday, 18 September 2015

ఇలియానా పోయి తమన్నా వచ్చే


కొన్ని మాటలు జాలువారేటప్పుడు పైన తథాస్తు దేవతలు తథాస్తు అంటారని చెబుతారు. కొన్ని సార్లు నిజమేనేమో అనిపిస్తుంది. అప్పుడెప్పుడో జరిగిన ఓ ఫంక్షన్లో తన పక్కన తమన్నా డ్యాన్స్ చేస్తే బాగుంటదని అన్నారు మెగాస్టార్ ఇప్పుడది నిజం అయ్యేలా ఉంది. రామ్ చరణ్ బ్రూస్లీ లో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఆయన పాత్రకి కొన్ని సన్నివేశాలతో పాటు, ఒక ఫైట్, ఐటం సాంగ్ కుడా ఉంటుంది. ఆ ఐటం సాంగ్ ఎవరు చేస్తారు అనేది మొన్నటిదాకా మిస్టరీలా తోచింది. నాజూకు నడుము సుందరి ఇలియానా మెగాస్టార్ పక్కన నర్తించనుంది అని మీడియా కోడై కూసింది. దీనికికోసం ఏకంగా కోటిన్నర అడిగింది ఇలియానా అని కుడా వార్తలు వచ్చాయి . ఇదంతా ఎంతవరకు నిజమో కాని ఇప్పుడు ఆ సాంగ్ లో ఉండేది ఇలియానా కాదట. మిల్కీ బ్యుటి తమన్నా మెగాస్టార్ తో చిందులేసే అదృష్టాన్ని దక్కించుకున్నట్టు సమాచారం. వచ్చే వారం చిత్రీకరణ ఉంటుంది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే నెల 16న దసరా కానుకగా విడుదల కానుంది..

పెళ్లి వార్తలు పుకార్లే

బాలీవుడ్‌లో అన్యోన్య జంటగా చాలా అందరికి ఆదర్శంగా నిలిచిన హృతిక్‌ రోషన్‌ మరియు సుజానేలు కొన్నాళ్ల క్రితం విడాకులు తీసుకుని విడిపోయిన విషయం తెల్సిందే. వీరిద్దరు విడిపోవడానికి కారణాలు ఏంటి అనే విషయంపై బాలీవుడ్‌లో చాలా రోజులు చర్చ జరిగింది. ఆ వార్తలు మెల్లగా మాయమై పోతున్న సమయంలో హృతిక్‌ రోషన్‌ మాజీ భార్య సుజానే, హృతిక్‌ మాజీ స్నేహితుడు అయిన రామ్‌ పాల్‌ను పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతుంది అంటూ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి జాతీయ మీడియా సంస్థ నుండి లోకల్‌ మీడియా సంస్థల వరకు ఈ విషయమై పెద్ద చర్చే జరిగింది అయితే ఇవన్ని ఒట్టి పుకార్లు మాత్రమే అని సుజానే తల్లి క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఆమె మాట్లాడుతూ. సుజానే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని, అవన్ని ఒట్టి పుకార్లు మాత్రమే అంటూ తేల్చి చెప్పింది. ప్రస్తుతం సుజానే ఒంటరిగా పిల్లలతో సంతోషంగా జీవితాన్ని గడుపుతోంది అంటూ ఆమె పేర్కొన్నారు. దాంతో సుజానే పెళ్లిపై వస్తున్న వార్తలకు బ్రేక్‌లు పడ్డాయి. .

రకుల్..రెచ్చిపోయిందిగా.


రకుల్ ప్రీత్ సింగ్..నటించడంలోనూ, అందులోనూ చిట్టి పొట్టి డ్రెస్ లతో కనిపించడంలోనూ పెద్దగా మొహమాటపడదని ఇప్పిటికే అంతంత మాత్రంగా స్పష్టమయింది. కానీ ఇప్పుడు బ్రూస్ లీలో చరణ్ సరసన ' లే ఛలో' పాటలో రకుల్ ను చూస్తే, ప్రేక్షక జనం ఫిదా అయిపోవాల్సిందే.  సినిమా ఆద్యంతం రకుల్ పై నుంచి జనం కళ్లు తిప్పుకోలేరు అన్నది గ్యారంటీ.  గ్లామర్ ను కుండలతో తెచ్చి పోసేసింది. బికినీకి బెత్తెడు దూరంలో వుండే డ్రెస్ తో 
అలరించింది. మొత్తానికి దర్శకుడు శ్రీను వైట్ల ఓ పక్క ఫ్యామిలీ. మరోపక్క యాక్షన్, ఇంకో పక్క ఫన్ మాత్రమే కాకుండా, మాంచి ఐ ఫీస్ట్ ను కూడా జోడించాడన్నమాట.  అసలే మెగాస్టార్ వుండడమే ప్లస్ అనుకుంటే, ఇలాంటివి ఒక్కోటి బయటపెడుతూ బ్రూస్ లీ మీద అంచనాలు పెంచుతున్నాడు శ్రీనువైట్ల. 

Thursday, 17 September 2015

18 ఏళ్ల అమ్మాయితో రవితేజ రొమాన్స్‌?


‘ప్రేమమ్‌’ సినిమాతో మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది అనుపమ పరమేశ్వరన్‌. 18 సంవత్సరాల ఈ అమ్మడు మొదటి సినిమాతోనే బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకుంది. ‘ప్రేమమ్‌’ సినిమా అద్బుత విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈమెకు మలయాళంతో పాటు టాలీవుడ్‌, కోలీవుడ్‌ల నుండి కూడా వరుసగా ఆఫర్లు వస్తున్నాయి తెలుగులో ఇప్పటికే ఈమె రెండు సినిమాల్లో ఎంపిక కాగా, తాజాగా మూడవ సినిమాకు కూడా సైన్‌ చేసింది త్రివిక్రమ్‌, నితిన్‌ల ‘అఆ’ సినిమాలో రెండవ హీరోయిన్‌గా ఎంపిక అయ్యింది. ‘ప్రేమమ్‌’ తెలుగు రీమేక్‌లో నాగచైతన్యకు జోడీగా ఈమె నటించబోతుంది. తాజాగా రవితేజకు జోడీగా హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. దిల్‌రాజు నిర్మాణంలో వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ‘ఎవడో ఒక్కడు’ చిత్రంలో అనుపమను హీరోయిన్‌గా ఎంపిక చేయడం జరిగింది. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కాబోతుంది. ఒకే సారి మూడు పెద్ద చిత్రాల్లో ఆఫర్లు రావడంతో అనుపమ టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలగడం ఖాయం అంటున్నారు. త్వరలో ఈమె మెగా హీరో సినిమాలో కూడా బుక్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. .

Wednesday, 16 September 2015

అనుష్క కూడా విడియో రిలీజ్ చేస్తుందట


బొమ్మాలి అనుష్క సినిమాల్లోకి రాకముందు యోగా టీచర్ అన్న సంగతి తెలిసిందే కదా . ఆ యోగా రావడం వల్లేనేమో ఏ పాత్ర ఎలా డిమాండ్ చేస్తే అలా మారిపోతోంది అనుష్క. బాహుబలి లో ముసలి దేవసేన పాత్రకు బరువు పెరిగిన అనుష్క, యుక్త వయసులో ఉండే దేవసేన పాత్రకు బరువు తగ్గింది రుద్రమదేవి కోసం బరువు తగ్గి, సైజ్ జీరో కోసం బరువు పెరిగి, మళ్ళి అదే సినిమాలో ఇంకో షేడ్ కోసం బరువు మళ్ళి తగ్గింది  
ఇలా బరువు పెరుగుతూ, తరుగుతూ ఉంటే ఆరోగ్యం దెబ్బతినదా అంటే . అక్కడే ఉంది కదా . సామాన్యులకు, యోగా అభ్యసించినవారికి తేడా . యోగాలో నేర్పరి కాబట్టే . ఎలాంటి పద్దతులు పాటించాలో అలాంటి పద్ధతులు పాటించి, ఆరోగ్యం దెబ్బతినకుండా తన శరీరాకృతిని మార్చుకుంది అనుష్క. ఇప్పుడు తనకున్న జ్ఞానాన్ని అందరికి పంచేందుకు సిద్ధమవుతోంది అనుష్క ఇంతకు ముందు శిల్పా శెట్టి తన సొంత యోగా విడియోని విడుదల చేసినట్టుగా, అనుష్క కుడా తన సొంత యోగా డి.వి.డి రిలీజ్ చేసే సన్నాహాల్లో ఉందట. ఇంకేం . ఆ విడియో చూసే కుర్రకారుకి అందంతో పాటు జ్ఞానం కుడా దొరుకుతుంది..

Tuesday, 15 September 2015

మహేష్‌ను మించిన ప్రభాస్‌

టాలీవుడ్‌ స్టార్‌ హీరోల జాబితాలో సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు పేరు ముందు వరుసలో ఉంటుంది. ఎన్నో టాలీవుడ్‌ రికార్డులను తన ఖాతాలో వేసుకున్న మహేష్‌బాబు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా రికార్డును తన పేరున రాసుకున్నాడు. అత్యధిక బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న హీరోగా మహేష్‌బాబుకు రికార్డు ఉంది అయితే ఎక్కువ బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించినా కూడా, ప్రభాస్‌ తర్వాతే మహేష్‌ ఉండి పోయాడు తాజాగా ‘బాహుబలి’ సినిమాతో అనూహ్యంగా భారీ క్రేజ్‌ను తెచ్చుకున్న ప్రభాస్‌ ప్రస్తుతం పలు కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించబోతున్నాడు. అందులో మొదటిగా మహీంద్ర కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఈయన ఎంపిక అయ్యాడు. ఇప్పటికే చిత్రీకరణ కూడా పూర్తి అయ్యింది. తాజాగా మహీంద్ర కంపెనీ ప్రభాస్‌ తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ముఖ్య పట్టణాల్లో పెద్ద పెద్ద ప్లెక్సీలను ఏర్పాట్లు చేసింది. ఈ స్థాయిలో గతంలో మహేష్‌బాబుకు ప్లెక్సీలు ఏర్పాటు చేసింది లేదు. అలాగే ఇప్పటి వరకు మహేష్‌బాబు ఏ బ్రాండ్‌కు తీసుకోని మొత్తాన్ని ప్రభాస్‌ మహీంద్ర కంపెనీ నుండి తీసుకున్నాడు. ఇలా మహేష్‌ బాబు కంటే కూడా ప్రభాస్‌ ముందు ఉన్నాడు.

నష్టపోయిన అల్లరి నరేష్

సినిమా అనేది మాయ ప్రపంచం. ఎప్పుడు ఎవరి దశ ఎటు తిరుగుతుందో చెప్పలేం. ఒకరు చేయాల్సిన సినిమా ఇంకొకరికి వెళ్ళిపోతుంది ఒకరు అనుభవించాల్సిన స్టార్ స్టేటస్ ఇంకొకరు అనుభవిస్తారు ఖైది అనే సినిమా ముందుగా అనుకున్నట్టు సూపర్ స్టార్ కృష్ణ చేసుంటే ? మనం మెగాస్టార్ ని చుసేవారిమో కాదో. అతడు సినిమా పవన్ కళ్యాణ్ ఒప్పుకునుంటే ? బహుషా మహేష్ ని విపరీతంగా ఆరాధించే ఫ్యామిలి ఆడియెన్స్ పవన్ వైపు మొగ్గు చుపేవారేమో. ఇలాంటి దురదృష్టం అల్లరి నరేష్ ని కుడా వదల్లేదు. వరుస ఫ్లాప్స్ తో సతమతమవుతున్న నాని కెరీర్ ని ఎక్కడికో తీసుకెళ్ళిన సినిమా భలే భలే మొగాడివోయ్ . కాని ఈ సినిమా నాని చేయాల్సింది కాదట . ఈ స్క్రిప్ట్ నాని కన్నా ముందే అల్లరి నరేష్ విన్నాడట. కాని బూతు డైరెక్టర్ అనే బ్రాండ్ ఉన్న మారుతితో పని చేయాడానికి ఇష్టపడని నరేష్ సినిమా చేసేందుకు సాహసించలేదు. కాలం గడిచింది, మారుతి రేంజ్ పెరిగింది, కథ నాని కి వెళ్ళింది. నాని ఒప్పుకున్నాడు, కట్ చేస్తే సినిమా చాలా పెద్ద హిట్, పంపిణిదారులకు కొన్నదానికి రెండింతలు లాభాలు తెచ్చిపెడుతోంది. నాని ఒక్కసారిగా చాలా ఎత్తుకు ఎదిగిపోయాడు. 20 కోట్లకు పైగా షేర్ వసూలు చేసే దిశగా సాగుతున్న భలే భలే మొగాడివోయ్, నాని గోపీచంద్,నితిన్ లాంటి హీరోలను ఛాలెంజ్ చేసే రేంజ్ కి తీసుకెళ్ళింది. పాపం అల్లరి నరేష్..

కరీనా ఎప్పుడు అంటే అప్పుడు పిల్లల్ని కంటాడంటా.


కరీనా కపూర్ - సైఫ్ అలీ ఖాన్ పెళ్లి చేసుకోని మూడు సంవత్సరాలు అవుతోంది. ఇద్దరిలో ఎవరు సినిమాలు మనేయ్యలేదు. సాధారణంగా పెళ్లి అయితే హీరోయిన్ అవకాశాలు తగ్గాలి కాని కరీనా ఇప్పటికి పెద్ద హీరోలతో పాటు కుర్ర హీరోల సరసన నటిస్తోంది అక్కడితో ఆగకుండా ఐటం సాంగ్స్ తో సెగలు రేపుతోంది. మధ్య మధ్యలో హాట్ హాట్ ఫోటోషూట్ లతో నా అందం ఇంకా వన్నేతరగలేదు అంటోంది. 34 ఏళ్ల వయసొచ్చినా , కరీనా చేతిలో ఈ క్షణంలో కనీసం ఐదు సినిమాలు ఉన్నాయి అంటే నమ్ముతారా . ఇక తమ సినిమా ఒప్పుకోవాలని లైన్ కట్టే దర్శకనిర్మాతలు ఉండనే ఉన్నారు. ఎంతసేపు సినిమాలే కాకుండా, సొంత విషయాలు కుడా పట్టించుకోవాలిగా . పెళ్లి అయ్యి మూడు సంవత్సరాలు గడిచినా, ఇంతవరకు కరీనా ఏ శుభవార్త చెప్పలేదు . ఇదే విషయంపై సైఫ్ అలీ ఖాన్ ను ఆరాతీస్తే " కరీనా పెద్ద హీరోయిన్, తను ఎక్కువ కాలం సినిమాల్లో కొనసాగాలని అభిమానులు కోరుకుంటారు, తను అంత పెద్ద స్టార్ అవడానికి వాళ్ళే కారణం. అందుకే కరీనా వాళ్ళ కోరిక మేరకు ఇంకా సినిమాల్లో కొనసాగుతోంది. ఇప్పుడే పిల్లల గురించి ఆలోచిస్తే తన కెరీర్ కు ఇబ్బంది. ఎంత లేదన్నా, ఓ రెండు సంవత్సరాలు కరీనా సినిమాలకు దూరం అవ్వాలి . ఇది కేవలం అభిమానులకే కాదు. నాకు కుడా ఇష్టం లేదు. ఇంకా ఎంత కాలం సినిమాల్లో కొనసాగాలనేది తన ఇష్టం, ఎందుకంటే ఇది తనకు, తన అభిమానులకు మధ్య విషయం. తను ఎప్పుడు రెడీ అంటే అప్పుడు పిల్లల్ని కంటాను" అంటూ చెప్పుకొచ్చాడు ఛోటా నవాబ్. .

Monday, 14 September 2015

జక్కన్నపై ఆగ్రహం


టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళిపై ప్రేక్షకులు కాస్త కోపంగా ఉన్నారు. ‘బాహుబలి’ మొదటి పార్ట్‌ విడుదల కాగానే రెండవ పార్ట్‌ను ప్రారంభిస్తాను అని మాట ఇచ్చిన జక్కన్న, ఆ మాటను తుంగలో తొక్కాడు. ముందుగా అనుకున్న దాని కంటే కూడా దాదాపు నెల రోజులు ఆలస్యంగా ‘బాహుబలి’ రెండవ పార్ట్‌ పనులు మొదలు అయ్యాయి ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘బాహుబలి’ రెండవ పార్ట్‌ను వచ్చే సంవత్సరం చివర్లో విడుదల చేసే అవకాశాలున్నాయని అంటున్నారు ‘బాహుబలి’ మొదటి పార్ట్‌ విడుదల అవ్వక ముందు రెండవ పార్ట్‌ను వచ్చే సంవత్సరం జులైలో విడుదల చేస్తాం అంటూ రాజమౌళి చెప్పాడు. అయితే మొదటి పార్ట్‌ భారీ విజయం సాధించడంతో రెండవ పార్ట్‌పై నమ్మకం ప్రేక్షకుల్లో భారీగా ఉంది. దాంతో ఆ నమ్మకాన్ని నిలుపుకునేందుకు మరింతగా కష్ట పడాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు రాజమౌళి మెల్లగా ఈ సినిమాను తెరకెక్కించాలని, అలాగే బాలీవుడ్‌ పరిస్థితులకు అనుగుణంగా ఈ సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నాడు. దాంతో ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి. రెండవ పార్ట్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులు అందుకే జక్కన్నపై కోపంతో ఉన్నారు..

భారత దేశానికి మరో పోర్న్ స్టార్


బిగ్ బాస్ అనే పేరు చాలా సార్లు వినే ఉంటారు కదూ . అదేనండి అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన బిగ్ బ్రదర్ షో ని అవే అంశాలతో భారత దేశానికి తీసుకువచ్చారు . సల్మాన్ ఖాన్ యాంకరింగ్ చేస్తాడు కొంత మందిని నెలలపాటు ఒకే ఇంట్లో ఉంచేస్తారు వారి ప్రవర్తన బట్టి జనాలు ఓటు వేయాలి . చివరిదాకా మిగిలిన వారు విజేత . ఇంకా గుర్తు రాలేదా ? సన్నీ లియోన్ ఈ షో ద్వారానే మన దేశానికి వచ్చింది . ఇప్పుడు ఖచ్చింతంగా గుర్తు వచ్చే ఉంటది కదా . ఇప్పుడు మళ్ళి ఆ షోలోకి ఇంకో ముద్దుగుమ్మ రాబోతోంది. సన్నీ లియోన్ ని మించిన అభిమాన గణం ఉంది ఆవిడకి . పేరు మియా ఖలీఫా. టాప్ పోర్న్ వెబ్ సైట్ అయిన పోర్న్ హబ్ లో నెం.1 పోర్న్ స్టార్ గా నిలిచిన అందగత్తె. ఇప్పుడు మియా ఖలీఫా ని బిగ్ బాస్ కొత్త సీజన్ కోసం మన దేశానికి రప్పించే ప్రయత్నాల్లో ఉన్నారట బిగ్ బాస్ నిర్వాహకులు. ఈసారి కుడా సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ యాంకర్ గా వ్యవహరించనున్నాడు. మియా ఖలీఫా తో పాటు మన దేశానికి చెందిన చాలా మంది సెలబ్రిటీలు పాల్గొంటారు. సన్నీ లియోన్ దెబ్బకే మన కుర్రకారు మూర్చపోతోంది. సన్నీ ని మించి అందం అక్కడ . ఇక సన్నీ ని వదిలేసి మియా మియా అంటూ కలవరిస్తారేమో కుర్రాళ్ళు..

Sunday, 13 September 2015

చారుశీలగా మారిన జబర్దస్త్‌ బ్యూటీ


‘శ్రీమంతుడు’ సినిమాతో చారుశీల పేరు ఎంత పాపులర్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శృతిహాసన్‌ చారుశీలగా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. చారుశీల స్వప్నబాల అంటూ ఏకంగా ఒక పాటే మహేష్‌బాబు పాడగా, ఈ సినిమాలో ఉంది అంతటి క్రేజ్‌ను దక్కించుకున్న చారుశీల పేరును ఉపయోగించుకునేందుకు జబర్దస్త్‌ బ్యూటీ రష్మీ సిద్దం అయ్యింది ‘చారుశీల’ పేరుతో తెరకెక్కబోతున్న ఒక సినిమాలో ఈ అమ్మడు హీరోయిన్‌గా బుక్‌ అయ్యింది. ‘జబర్దస్త్‌’తో హీరోయిన్‌ కంటే ఎక్కువ క్రేజ్‌ను దక్కించుకున్న రష్మీ అప్పుడప్పుడు వెండి తెరపై కూడా సందడి చేస్తోంది. తాజాగా ఈమె ‘గుంటూరు టాకీస్‌’ సినిమాలో ఒక హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమా త్వరలో విడుదల కానుంది. జాతీయ అవార్డు గ్రహీత ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా విడుదల కాకుండానే ఈమెకు ‘చారుశీ’ సినిమాలో నటించే అవకాశం దక్కింది. శ్రీనివాస్‌ ఉయ్యూర్‌ అనే వ్యక్తి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ‘చారుశీల’లో రష్మీ తన అందాలతో ఆకట్టుకోనుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. 

విడాకులు తీసుకున్న రాజమౌళి విలన్


ప్రముఖ కన్నడ నటుడు సుదీప్ తెలుగు ప్రెక్షకులకు బాగా పరిచయం. ఈగలో విలన్ గా మెప్పించిన సుదీప్ బాహుబలిలో ఓ పాత్రలో తళుక్కున మెరిసారు. తాజా వార్త ఎంటంటే ఆయన విడాకులు తీసుకున్నారు దీనికిగాను ఆయన భార్యకి చెల్లించిన మొత్తం ఎంతో తెలుసా ? అక్షరాల 19 కొట్లు ఆయన భార్య పేరు ప్రియ రాధక్రిష్నన్ . ఆమె ఒక మలయాళీ , వీరువురు 2000 సంవత్సరంలో ఒకరినొకరు కలుసుకున్నరు . ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది . ఓ సంవత్సరం పరిచయం తరువాత 2001 వివాహం చేసుకున్నారు . వీరికి ఒకరే సంతానం . ఆ పాప వయసు 11 సంవత్సరాలు. కన్నడ సినిమా ఇండస్త్రిలో సుదీప్ ది ప్రత్యేక స్థానం . సినిమాల్లొకి రాకముందు సిరియల్స్ లొ నటీంచేవారు ఆయన . స్వయంకృషితో రాణించిన సుదీప్ కి 2001 లో స్పర్ష అనే సినిమాతో మంచి పేరు వచ్చింది . ఆ తరువాత చాల హిట్ సినిమాలు తీసి అగ్ర హిరోగా ఎదిగారు. మన విక్రమార్కుడు, మిర్చి, అత్తారింటికి దారేది సినిమాలు రిమేఖ్ చెసి ఆయన కనండ ప్రేక్షకులకు అందించారు . 

Saturday, 12 September 2015

ఆ హీరోయిన్ ఎఫైర్స్ ను ఆమె భర్త భరించలేక పోయాడా..?!

హీరోయిన్లను పెళ్లి చేసుకోవడమే కాదు.. వారితో కాపురం చేయడం కూడా కత్తిమీద సాము అని అంటాడు ఆయన. ఎంతో మోజుతో తన సహనటి ఒక ఆమెను వివాహం చేసుకొన్న ఆయన కొన్ని నెలల కాపురానికే ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఇద్దరూ వారు లైమ్ లైట్ లోనే ఉన్నారు. వాళ్ల బంధం చాలా సంవత్సరాల కిందటే తెగిపోయింది. అయితే ఆ బంధం తెగిపోవడానికి రీజన్లు ఏమిటి అంటే మాత్రం ఆమె తో తను తట్టుకోలేకపోయానని ఆయన అంటాడు. ఆమె సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమందితో చాలా సఖ్యతతో ఉంటుందని.. పెళ్లి అయిన తర్వాత కూడా అలా చేస్తుండే సరికి మొదట చెప్పి చూశానని.. అయితే చివరకు ఆమె మారకపోవడంతో తను విడాకులను తీసుకొన్నానని ఆయన అంటాడు.  కదలించాలి కానీ.. ఆమె విషయంలో లెక్కలేనన్ని కంప్లైట్ చేస్తాడు ఆ సీనియర్ నటుడు. అప్పట్లో ఆమెకు నాటి స్టార్ హీరో ఒకరితో సన్నిహిత సంబంధాలుండేవని.. పరిశ్రమ చెన్నైలో ఉన్న రోజుల్లో వారిద్దరి సాన్నిహిత్యాన్ని తను సహించలేకపోయానని.. ఆయన చెబుతాడు. ఆయన పేరు అవనసరం అంటూనే... ఆ హీరోతో తన భార్య దగ్గరగా ఉండేసరికి తను విడాకులను ఛాయిస్ గా చేసుకొన్నాననని తన దారి చూసుకొన్నాని ఆ యాక్టర్ అంటాడు. ఆమెతో జీవితం బాగుంటుందని అనుకొంటే చివరకు అలా అయ్యిందని.. అలా ఎవరిదారి వారు చూసుకోవడం మేలైందని.. లేకపోతే ఇబ్బంది కరమైన పరిస్థితులు ఉండేవని ఆయన వివరిస్తాడు.  ప్రస్తుతంలోకి వస్తే.. ఆ విడాకుల తర్వాత కూడా ఆమె సినిమాల్లో నటించి.. మరో వివాహం చేసుకొంది. అయినా వైవిహిక జీవితం ఇబ్బందులమధ్యనే నడుస్తోంది. ఇక ఆ నటుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసుకొంటూ.. మరో వివాహం చేసుకొని సెటిలయ్యాడు. పాత కథ ఎత్తితే మాత్రం మొదటి భార్యను తిడతాడు ఆయన.

Friday, 11 September 2015

మహేష్ -పవన్ ని బుట్టలో వేసుకున్న దిల్ రాజు


అగ్ర నిర్మాత దిల్ రాజు మంచి ఫాంలో ఉన్నారు. ఒకసారి ఒక పెద్ద హీరోని ఒప్పించడమే మహా గొప్ప అయితే ఒకేసారి ఇద్దరు అగ్ర హీరోలను బుట్టలో వేసుకున్నారు దిల్ రాజు. పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలని ఎప్పటి నుంచో కలాల కంటున్నారు దిల్ రాజు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ముందు పవన్ తోనే తీయాల్సి ఉన్నా, అది తర్వాత మహేష్ చేతిలోకి వెళ్ళింది
ఆ రకంగా పవన్ తో సినిమా కాకపోయినా మహేష్ తో తీయాలనే కోరికైతే తీరింది. పవన్ తో సినిమా ఓకే అయిందని, త్వరలోనే వివరాలు తెలియపరుస్తానని ఇటివలే ప్రకటించారు దిల్ రాజు ఇది ఇలా ఉంటే . మహేష్-మురగదాస్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నట్లు సమాచారం. అయితే దీనికి మురగదాస్ కుడా ఒక నిర్మాతగా ఉంటారు. తమిళ్ లో మురగదాస్, తెలుగులో దిల్ రాజు నిర్మించే అవకాశాలు కుడా లేకపోలేదు. మొతానికి ఈ జెనరేషన్ లో చాలా మంది నిర్మాతల వల్ల కాని పని దిల్ రాజు చేయబోతున్నారు. పనిలో పనిగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సినిమా మహేష్-పవన్ కాంబినేషన్ లో కుడా తీస్తే బాగుంటుంది. ఆ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ దేబ్బలాడుకోవడమైనా మానేస్తారు..

ముగ్గురు అత్తల ముద్దుల అల్లుడు


శ్రీమంతుడు’ సినిమాతో రికార్డు బ్రేకింగ్‌ సక్సెస్‌ను అందుకున్న మహేష్‌బాబు తాజా చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ఈ సినిమా చిత్రీకరణ ఈనెల 16 నుండి ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అయ్యింది జులై 10నే ప్రారంభం అవ్వాల్సి ఉన్నా కూడా మహేష్‌కు ఇతర పను ఉండటం వల్ల షూటింగ్‌ ప్రారంభం వాయిదా వేశారు తాజాగా ఈ సినిమాను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తి స్థాయి ఫ్యామిలీ చిత్రం అంటున్నారు. ఈ చిత్ర కథ కూడా వైవిధ్యభరితంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాలో మహేష్‌బాబుకు ముగ్గురు మేనత్తలు ఉంటారు అని, ఆ ముగ్గురు అత్తలకు కూడా ముగ్గురు కూతుర్లు ఉంటారు. ఆ ముగ్గురు అత్తల చుట్టు తిరిగే కథాంశంతోనే ఈ సినిమా తెరకెక్కుతుంది. కుటుంబ విలువలు పుష్కలంగా ఉండే ఈ సినిమాలో మహేష్‌బాబు సరసన ముగ్గురు ముద్దుగుమ్మలు సమంత, కాజల్‌, ప్రణీతలు నటించనున్నారు. మొదటి సారి ముగ్గురు ముద్దుగుమ్మలతో మహేష్‌బాబు చేయబోతున్న రొమాన్స్‌ను చూసేందుకు ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంవత్సరం వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. .

టాప్ డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చేలా ఉన్న మహేష్ బాబు

మహేష్ బ్రహ్మోత్సవం తర్వాత ఏ సినిమా ఒప్పుకోకపోయినా ఒక దర్శకుడికి మాత్రం చేసి పెడతాడు అనుకున్నారంతా. పాపం ఆ డైరెక్టర్ కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నాడు మహేష్ కోసం. ఇన్ని రోజులు దాటేసి వెళ్ళిన మహేష్ ఆయనతో సినిమాకి ఒప్పుకున్నాడు. బ్రహ్మోత్సవం తరువాత అదే మొదలవుద్దేమో అనుకున్నారు సిని జనాలు. మళ్ళి ఇక్కడ ఓ మలుపు తిరిగింది కథ. ఒక యువ దర్శకుడు చెప్పిన కథకి మహేష్ పచ్చ జెండా ఊపినట్టు సమాచారం. రెండేళ్ళ క్రితమే ఈ దర్శకుడు మహేష్ కి వేరే కథ చెప్పినప్పటికీ అది మన సూపర్ స్టార్ కి నచ్చలేదు. బ్రహ్మోత్సవం పూర్తీ అయ్యేలోపు సర్వం సిద్ధం చేసుకుంటే ఆ యువ దర్శకుడికే అవకాశామిచ్చేలా ఉన్నాడట సూపర్ స్టార్. అలా అని చెప్పి ఆ అగ్ర దర్శకుడితో సినిమా క్యాన్సిల్ అవలేదు . కాని ఇంకెన్ని సంవత్సరాలు తన వెంట తిప్పుకుంటాడో మహేష్ ఆయన్ని..

Thursday, 10 September 2015

మిలియన్ చెల్లించి రెండు టీషర్ట్స్ కొన్నుక్కుందట

వెర్రి వెయ్యి రకాలు, పైత్యం పలు విధాలు అని అన్నారు ఎవరో మహానుభావులు. బహుశా పరిణితి చోప్రా లాంటి వాళ్ళకోసమే అన్నారేమో ఈ మాట. ఇంతకి పరిణితి ఏం చేసింది ఒక మిలియన్ ఖర్చు పెట్టి రెండు టీషర్ట్స్ కొనుక్కుందట డబ్బులు ఎక్కువయిపోయాయో, లేదంటే ఎవరినైనా కుళ్ళుకునేల చేయాలి అనుకుందేమో పరిణితి చోప్రా . లేనోడు లేక ఏడుస్తుంటే . వీళ్ళ పైత్యం ఏమిటో . ఇలా అనుకుంటూ పరిణితి ని తిట్టుకున్తున్నారా . అయితే ఆగండి . పరిణితి మరీ ఎక్కువేమి ఖర్చు పెట్టలేదు. అదేంటి, మిలియన్ అంటే పది లక్షలు కదా అనుకుంటున్నారా . పరిణితి మిలియన్ పెట్టి బట్టలు కొనుకున్నది జాకర్త లో . అక్కడి మిలియన్ అంటే మన రూపాయలలో సరిగ్గా 4652.73 రూపాయలు .మిలియన్ అంటూ అందరిని బకరా చేసి తన పైత్యం 

సన్నీ లియోన్ ని తరిమెయ్యాలి - రాఖి సావంత్

మొన్నామధ్య ఒక రాజకీయ నాయకుడు సన్నీ లియోన్ వలెనే మానభంగాలు జరుగుతున్నాయి అన్నాడు గుర్తుందా ? చిన్నగా మొదలైన ఆ గొడవ రోజుకో మలుపు తీసుకొంటోంది. సన్నీ వలనే మానభంగాలు జరుగుతున్నాయి అని కొందరు వాదిస్తే, సన్నీ భారత దేశానికి రాక ముందు కుడా మానభంగాలు జరిగాయి . మరి అప్పుడు ఎవరిదీ బాధ్యత అని ప్రశ్నిస్తున్నారు మరి కొందరు ఈ వివాదం పై స్పందిస్తూ సెక్సీ భామ రాఖి సావంత్ సంచలన వాఖ్యలు చేసింది " అసలు సన్నీ లియోన్ లాంటి వాళ్ళను దేశం నుండి తరిమేయాలి. మారిపోయాను, ఒక్కప్పటిలా లేను అని మాయ మాటలు చెబుతూనే అసభ్యకరమైన బట్టలు వేసుకుంటారు, అసభ్యకరమైన సినిమాలు చేస్తారు. ఇలాంటి వాళ్ళ వలన యువత చెడిపోతోంది, సన్నీ లియోన్ ప్రభావం యువతపై తీవ్రంగా ఉంటోంది. అందుకే మానభంగాలు పెరుగుతున్నాయి. సభ్యత లేని బట్టలు,సినిమాలు,వాణిజ్య ప్రకటనలు మానేసేంత వరకు సన్నీ లియోన్ ని దేశంలో తిరగానివ్వకూడదు" అంటూ నోటికోచ్చినదంతా కక్కేసింది రాఖి సావంత్. అంతా బాగానే ఉంది కాని సెక్స్ బాంబ్ అనే ముద్ర ఉన్న రాఖి సావంత్ ఇలాంటి కాకమ్మ కబుర్లు చెప్పడం వింతగా ఉంది..

నాకు కూడా అలాంటివి నచ్చవు


ఎంతయినా మనం భారతీయులం. మన పద్ధతులు మనకు వున్నాయి. విదేశీయులతో మనం పోల్చుకోలేం. ఇక్కడ పద్ధతులు ఎంతో సంస్కారవంతమైనవి. విదేశీయులు కొన్ని విసయాల్లో మన నుండి ఎంతో నేర్చుకోవాలి.. అంటుంది హిందీ హీరోయిన్‌ రాణి ముఖర్జీ. గతంలో మనం వాళ్ళ నుంచినేర్చుకోవాలని తాపత్రయపడేవాళ్ళం. ముఖ్యంగా విచ్చలవిడి శృంగారం అనేది మనకు నచ్చని విషయం. వాళ్ళు నడుస్తూ ముద్దులు పెట్టుకుంటూ పోతారు.  పార్కుల్లో, రోడ్ల పక్కన చుంబనాలే చుంబనాలు. అవన్నీ అక్కడ చెల్లుతాయి. ఇక్కడ పిల్లలు, పెద్దలూ వుంటారు. వాటిని చూసి షాక్‌ అవుతారు. శృంగారం అనేది జంతువుల్లా పబ్లిక్‌గా చేసుకునేది కాదు. నాలుగు గోడల మధ్య జరిగేది. దాన్ని బహిరంగంగా ప్రోత్సహించడాన్ని నేను సహించను. మనలో చాలామంది విదేశాలకు హనీమూన్‌కి వెళతారు. కానీ అక్కడ నేర్చుకునేది ఏమీ వుండదు. వాళ్ళకులాగా మనం రోడ్ల మీద ముద్దులు పెట్టుకోలేం కదా.. అని ప్రశ్నిస్తోంది రాణి ముఖర్జీ.

మహేష్ ను అలా అంటే ఎలా తేజా?

చేసేవాడిని చేయనివ్వాలి..అంతే కానీ ఎందుకో చేస్తున్నాడు అని కన్నాలు వెదక్కూడదు. సరే, కాస్త సేవ చేస్తే, ప్రభుత్వం ఏదైనా రాయతీలు ఇస్తే ఇవ్చొచ్చు. కానీ రాయతీల కోసమే ఇలా చేస్తున్నారు అనడం సబబు కాదేమో? కేంద్రం, రాష్ట్ర పభుత్వాలు, గ్రామాలను ప్రయివేటు ఫండ్స్ తో అభివృద్ధి చేయించేందుకు, ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా కార్పొరేట్ సంస్థలను, సెలబ్రిటీలను, అధికారులను ముందుకు రమ్మంటున్నాయి. మరి వాటికి ఆ ఖర్చుకు బదులుగా టాక్స్ ఎగ్జెంప్షన్ ఇస్తే ఇచ్చి వుండొచ్చు. ఇటీవల మహేష్ రెండు గ్రామాలు, ప్రకాష్ రాజ్ ఒక గ్రామం, శృతి హాసన్ ఇలా చాలా మంది దత్తత బాట పట్టారు. దీనిపై జర్నలిస్టులు దర్శకుడు తేజను ప్రశ్నిస్తే, 'ఆళ్లంతా..దేనికి చేస్తున్నారో, బహుశా ఏదో టాక్స్ వెసులు బాటు ఇస్తామని అని వుండొచ్చు. అందుకే ఈ వేలం వెర్రి..నిజంగా చేసే ఉద్దేశం వుంటే, ఒక్కడు సినిమా హిట్ అయినపుడే చేయచ్చుగా' అన్నాడు. ఒక్కడు సినిమా టైమ్ లో మోడీ లేడు..తెలంగాణ గ్రామజ్యోతి లేదు..ఆంధ్రలో గ్రామాల దత్తత స్కీము లేదు. ఇప్పుడు కదావచ్చింది. ప్రభుత్వం నుంచి రిక్వెస్ట్ నో, మోటివేషన్ నో వున్నపుడు కదా ఎవరైనా ముందుకు వెళ్లేది. ఆ మాత్రం తెలియకుంటే ఎలా? 

త్రివిక్రమ్ సినిమా..అ..ఆ

ఈసారి గమ్మత్తయిన పేరుతో సినిమాకు స్వీకారం చుడుతున్నారు దర్శకుడు త్రివిక్రమ్,. మొదటి నుంచీ త్రివిక్రమ్ సినిమా పేర్లు మాంచి క్యాచీగా వుంటాయి. రెండు, మూడు, నాలుగు అక్షరాలే. ఈసారి కూడా అలా రెండు అక్షరాల పేరే పెట్టారు..అ..ఆ అంటూ కానీ ఇది షార్ట్ కట్టే,.పూర్తి పేరు...'అనసూయ రామలింగం' వర్సెస్ 'ఆనంద్ విహారి అన్నమాట. దీన్ని ఉపశీర్షికగా పెట్టారు. నితిన్-సమంతలతో త్రివిక్రమ్-రాధాకృష్ణ తమ హారిక హాసిని బ్యానర్ పై నిర్మిస్తారు. సమంతకు తోడుగా మరో హీరోయిన్ ను కూడా ఎంపిక చేసారు. ప్రేమమ్ సినిమాలో నటించిన అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో రెండవ హీరోయిన్ గా నటిస్తుంది. వాస్తవానికి ఈమెను, ఇదే బ్యానర్ లో నాగచైతన్యతో నిర్మించే ప్రేమమ్ రీమేక్ కు కూడా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. నితిన్-త్రివిక్రమ్ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తారు. నటరాజ్ సుబ్రహ్మణ్యం సినిమాటోగ్రఫీని, రాజీవన్ ఆర్ట్ డైరక్షన్ ను అందిస్తారు. పూర్తిగా ఫ్రెష్ లుక్ తో, డిఫరెంట్ టేకింగ్ తో సినిమా చేయాలని చూస్తున్నారు త్రివిక్రమ్. అందుకే తన టెక్నీషియన్స్ బ్యాచ్ ను కూడా మార్చేసారు. మేకింగ్ అంతా వైవిధ్యంగానే వుంటుంది అని వినికిడి. టీమ్, మేకింగ్ అంతా మారింది..సమంత మాత్రం మరోసారి త్రివిక్రమ్ సినిమాలో నటిస్తోంది.

Wednesday, 9 September 2015

రవితేజ..ఒకటి తగ్గి..రెండోది పెరిగి..?


సినిమా ఫలితం తేడావస్తే, చాలా విషయాల్లో తేడాలు వచ్చేస్తాయి. కిక్ 2 సినిమా హీరో రవితేజ మీద ఇలాంటి రిజల్ట్ నే చూపిస్తోంది. కుర్ర హీరోలతో పోటీ పడాలని, అర్జెంట్ గా బోలెడు కష్టపడి, ఒళ్లు, బరువు తగ్గించుకున్నాడు హీరో రవితేజ. దాంతో మొహంలో ముసిలి కళ వచ్చేసిందని జనం నుంచి కామెంట్లు వినిపించాయి. దీంతో రవితేజ ఇప్పుడు పునరాలోచనలో పడ్డాడు. మరీ అంత తగ్గిపోతే ఇమేజ్ తగ్గిపోతుందని తెలిసి వచ్చిందని, కాస్త పెరగాలని అనుకుంటున్నాడట. సరే బరువు తగ్గింది, పెంచుకుందాం అనుకుంటే, మరోపక్క పారితోషిక తగ్గిపోతోందంట. కిక్ 2 కు ముందు అగ్రిమెంట్ చేసుకున్న నిర్మాత దిల్ రాజు, ఇప్పుడు అంత రేంజ్ లేదు..కాస్త తగ్గించమని పట్టుపడుతున్నాడట. ఏదో ఒక పాయింట్ దగ్గర సెటిల్ చేసకోవడం అవసరం. ఎందుకంటే చేతిలో బెంగాల్ టైగర్ తప్ప మరో సినిమా లేదు. తరువాత వ్యవహారం ఆ సినిమా ఫలితం పైనే ఆధారపడి వుంటుంది. అందువల్ల బెంగాల్ టైగర్ హిట్ అయితే ఇంత, ఫ్లాపయితే ఇంత అనే స్టయిల్ లో ఒప్పందం చేసుకోవడం బెటరేమో?

త్రిషా...ఏంటమ్మా..ఇదంతా?

త్రిష..మంచి ఫెర్ ఫార్మర్. గ్లామర్ పాత్రల్లో కూడా తనదైన ముద్రవేయగలదు. ఇప్పుడు ఆమె నటిస్తున్న తాజా సినిమా నాయకి పోస్టర్ బయటకు వచ్చింది. ఒక పక్క గ్రేసీ లుక్స్ తో కనిపిస్తూనే, మరోపక్క చేతిలో రక్తం ఓడే కత్తితో భయపెడుతోంది త్రిష. ఆ సూపర్ లుక్స్ ఏమిటో..చేతిలో ఆ నెత్తురోడే కత్తి ఏమిటో..పైగా  షి వాచ్..అండ్ కాచ్ యు అంటూ భయపెట్టే ఆ క్యాప్షన్ ఏమిటో. కాస్త ఆసక్తిగానే వుంది వ్యవహారం,.  ఉభయ భాషల్లో తయారవుతున్న ఈ సినిమాకు గోవర్థన్ దర్శకుడు. త్రిష మేనేజర్ గిరిధర్ నిర్మాత. 70 దశకం బ్యాక్ డ్రాప్ తో పక్కా రివెంజ్ డ్రామాగా ఈ సినిమా కథ వుంటుందని తెలుస్తోంది. ఆద్యంతం గ్రిప్పింగ్ నడిచే ఈ స్క్రిప్ట్ పై త్రిష బోలెడు ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా కాకుండా మరో హర్రర్ సినిమాలో కూడా త్రిష నటిస్తోంది. ఈ రెండు సినిమాలు తనలోని నటిని బాగా ఎలివేట్ చేస్తాయని ఆమె చాలా నమ్మకంగా వుంది. 

ఇక ఆ ముచ్చట కూడా తీర్చేసుకుంటే బెటరంటుంది



సినిమా హీరోయిన్స్‌ కూడా ఎన్నో అసంతృప్తులు, నిరాశలూ ఉంటాయి. కేవలం సినిమాల్లోనే ఉండిపోతే ఎలా.. నూతిలో కప్పలాగ..కాస్త బయటి ప్రపంపచపంలో కూడా సక్సెస్‌ కావాలి కదా అని చెబుతోంది హాట్‌ బ్యూటీ నమిత. హీరోయిన్‌గా సరైన అవకాశాలు దొరక్క కొంత కాలం స్టేజ్‌ షోలకే పరిమితం అయిపోయిన నమిత ఇప్పుడు మళ్లీ సినిమాల మీద తీవ్రంగా దృష్టి సారిస్తానంటుంది.  ఇటీవల ఆమె చేయించుకున్న ఫోటో షూట్‌ కూడా అందుకేనట. నేను నటిగా చెయ్యాల్సింది ఎంతో ఉంది. అయితే ఇప్పుడు నన్ను తమిళనాడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించమని కొన్ని పార్టీలు కోరుతున్నాయి. ఎన్ని సినిమాలు చేసినా ఫైనల్‌గా వెళ్లాల్సింది రాజకీయాల్లోకే కాబట్టి. నాకూ రాజకీయాల పట్ల ఆశక్తి ఉంది.  తమిళనాట నాకు ఎంతో పేరు కూడా ఉంది. నేను రాజకీయాల్లో రాణించగలను. ఎందుకంటే నేను ప్రస్తుత రాజకీయాలను గమనిస్తున్నాను. పొలిటికల్‌గా డిటైల్స్‌ తర్వాత చెబుతాను ఆ సరదా కూడా తీర్చుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నానంటోంది నమిత. 

అంత ఖర్చు పెట్టి ఏం చూపించిందని




హీరోయిన్స్‌ తమ గురించి ఎంతగానో ప్రమోషన్‌ చేసుకుంటేగానీ నిలబడలేరు. అలాంటి పబ్లిసిటీ కోసం ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినాగానీ ఫొటో సెషన్‌ చేసుకుంటేనే గానీ పరిపూర్ణం కాదు. సెక్సీగా, ట్రెండీగా ఫొటోసెషన్‌ చేసుకుంటే ఆ ఫొటోలు కుర్రకారుకి పిచ్చెక్కించేస్తాయి. అందుకే ఫొటోసెషన్‌ చేయించుకున్నాను.. అని చెబుతుంది హిందీ భామ పరిణీతి చోప్రా.  టాప్‌ హీరోయిన్‌ అయిన ప్రియాంకా చోప్రా చెల్లెలిగా సినీ రంగ ప్రవేశం చేసిన పరిణీతి చోప్రా అక్క కన్నా తెలివైంది అని పేరు తెచ్చుకుంది. చాలా సినిమాల్లో తన సత్తా చాటుకుంది. అయినా సరే రేస్‌లో కొంత వెనకబడిపోయింది. అందుకే చాలా డబ్బు ఖర్చు పెట్టి ఫొటోసెషన్‌ చేయించుకుంది. అయితే ఆ ఫొటోలన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయిపోయాయి అంటూ లబోదిబోమంటుందట ఇప్పుడు.  ఎందుకంటే ఆ ఫొటోల కోసం మేకప్‌, డ్రెస్‌లు, హెయిర్‌ డ్రెస్సర్స్‌.. ఎంతో హంగామా చేసినా ఫొటోల్లో సెక్సీనెస్‌ కనిపించలేదట. ఆ ఫొటోలు పేలవంగా వున్నాయని పలు పత్రికలు తిరస్కరించాయట. అసలు నువ్వు ఏం చూపించావని ఫొటోలు వేసుకోవాలి? దాని కోసం ఫొటోసెషన్‌ దేనికి? సెల్‌ఫోన్‌తో తీసుకున్నా సరిపోయేది అని కూడా అన్నారట. దాంతో పరిణీతి తన ఫొటోలు తానే చూసుకుని దుఃఖిస్తోందట. మరి తనకు తెలియదా ఫొటోసెషన్‌లో ఒక్క డ్రెస్‌లే తప్ప ఇంకేదో చూపించాలని. అది కనబడకపోతే ఫొటోలు ఎవరు చూస్తారు మరి.? 

సినిమా సర్కిల్స్ ఆవల ఆమెతో డేట్ కు యమ డిమాండ్..!

ఆమె తో డేట్ అంటే పడి చస్తున్నారు... ఎంత ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడని వారు కనిపిస్తున్నారు... ఆమెతో ఈ విషయంలో కమ్యూనికేట్ కావడానికి కూడా మార్గాలు ఏర్పడటంతో అనేక మంది అప్రోచ్ అవుతున్నారు. ఈ పరిస్థితులను ఆమె కూడా బాగానే క్యాష్ చేసుకొంటోంది! ఇంత వరకూ ఒక్క సరైన సినిమాలో హీరోయిన్ గా నటించలేదు కానీ.. ఆమె చాలా మందికి కలల రాణిగా మారింది. తన క్యూట్ నెస్ తో అనేక మందికి నిద్రలేకుండా చేస్తోంది.  దాదాపు రెండేళ్ల కిందట వెలుగులోకి వచ్చిన ఆమె కు అప్పటి నుంచి తెగ డిమాండ్ ఉంది. ఆమె తో డేట్ కోసం ఇండస్ట్రీలోని వారి కన్నా.. బయటి వారే తె గ ఆసక్తి చూపుతున్నారు. హై ఫై సర్కిల్స్ లో ఆమె తో డేట్ చాలా వ్యాల్యూ. ఈ పరిస్థితులను ఆమె కూడా క్యాష్ చేసుకుంటోంది. సరదా సాయంత్రాలతో బాగా సంపాదిస్తోంది! ఒక పెద్ద హీరో నటించిన ఫ్యామిలీ కాన్సెప్ట్ తో వెలుగులోకి వచ్చిందామె. ఆ సినిమాలో చేసింది చాలా చిన్న పాత్రే అయినా.. అంతకు ఎన్నో రెట్ల గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కూడా ఆమెకు ఇండస్ట్రీలో అలాంటి ప్రాధాన్యం లేని పాత్రలే దక్కుతున్నాయి. తెరపై అలా లాగిస్తున్న ఈ భామ... తెర వెనుక మాత్రం తన కంపెనీ కోసం పడిచచ్చే వారి పాలిట డ్రీమ్ గర్ల్ గా చెలామణి అవుతోంది. ఆమె డేట్ కు ధర కూడా భారీ స్థాయిలోనే ఉంది. ఒక సాయంత్రం ఆమె విలువైన కంపెనీ దాదాపు ఐదారు లక్షల వరకూ పలుకుతోంది! మరి క్రేజ్ ఉన్నప్పుడు ఆ మాత్రం ధర పెద్ద విశేషం కాదేమో! - 

Tuesday, 8 September 2015

చవితికి డిక్టేటర్ ఫస్ట్ సాంగ్




బాలయ్య బాబు తో దర్శకుడు శ్రీవాసు. కోన వెంకట్ టీమ్ రూపొందిస్తున్న చిత్రం డిక్టేటర్. ఈ సినిమా ఫస్ట్ సాంగ్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం మాంచి వెన్యూ ఎంచుకున్నారు.  ఖైరతాబాద్ వినాయకుడి సన్నిథిలో వినాయక చవితి నాడు ఫస్ట్ సాంగ్ లాంచ్ చేస్తారు. ఈ పాట కూడా గణేశుడిపైనే వుంటుందని, అందుకే గణేశ మండపంలో లాంచింగ్ ఏప్ట్ గా వుంటుందని ఇలా డిసైడ్ చేసారట. ఈరోస్ ఈ సినిమాకు ఫండింగ్ చేస్తోంది. దర్శకుడు శ్రీవాసే నిర్మాణ వ్యవహారాలు కూడా చూసుకుంటున్నారు.  ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం విదేశాల్లో జరుగుతోంది. ఈ సినిమా కోసం బాలయ్య సరికొత్తగా కాస్త వయసు తగ్గిన లుక్ లో కనిపిస్తారు. ఈ మేరకు విగ్, మేకప్, డ్రెస్సింగ్ విషయాల్లో చాలా కేర్ తీసుకున్నారు. బాలయ్య సరసన అంజలి, సోనాలి చౌహాన్ నటిస్తున్నారు.

శ్రీను వైట్లకు చాన్స్ తక్కువేనా?

అఖిల్ తొలి సినిమా విడుదల ఫిక్సయిపోయింది. షూటింగ్ ఫినిషింగ్ స్టేజ్ కు వచ్చేసింది. అప్పుడే మలి సినిమాపై అభిమానుల ఆలోచనలు పెరిగిపోయాయి. పలువురు డైరక్టర్ల పేర్లు వినిపిస్తున్నాయి. శ్రీనువైట్ల, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరి జగన్నాధ్, ఇలా చాలా జాబితానే వుంది.   అయితే ఇవన్నీ వట్టి వదంతులేనంట..సినిమా అక్టోబర్ మూడోవారంలో విడుదలవుతుంది. నవంబర్ లో మాత్రమే తరువాత సినిమా మీద నిర్ణయం తీసుకుంటా అని అఖిల్ తన సన్నిహితులతో చెబుతున్నాడంట. జనవరి నాటికి ఏ డైరక్టర్ అందుబాటులో వుంటే, అది కూడా ఆ డైరక్టర్ తనకు సూటబుల్ అనుకుంటే, అతని దగ్గర తనకు నప్పే కథ వుంటే, అప్పడు ఓకె అంటాడని తెలుస్తోంది. అయితే శ్రీను వైట్లకు అఖిల్ తో చేయాలని వుంది కానీ, అఖిల్ ప్రయారిటీ లిస్ట్ లో శ్రీనువైట్ల పేరు ముందుగా లేదని వినికిడి. జనవరి నాటికి త్రివిక్రమ్, కొరటాల శివ, పూరి ముగ్గురు రెడీగానే వుండొచ్చు కానీ, కథ సరైనది పడాలి కదా..