Thursday, 10 September 2015

త్రివిక్రమ్ సినిమా..అ..ఆ

ఈసారి గమ్మత్తయిన పేరుతో సినిమాకు స్వీకారం చుడుతున్నారు దర్శకుడు త్రివిక్రమ్,. మొదటి నుంచీ త్రివిక్రమ్ సినిమా పేర్లు మాంచి క్యాచీగా వుంటాయి. రెండు, మూడు, నాలుగు అక్షరాలే. ఈసారి కూడా అలా రెండు అక్షరాల పేరే పెట్టారు..అ..ఆ అంటూ కానీ ఇది షార్ట్ కట్టే,.పూర్తి పేరు...'అనసూయ రామలింగం' వర్సెస్ 'ఆనంద్ విహారి అన్నమాట. దీన్ని ఉపశీర్షికగా పెట్టారు. నితిన్-సమంతలతో త్రివిక్రమ్-రాధాకృష్ణ తమ హారిక హాసిని బ్యానర్ పై నిర్మిస్తారు. సమంతకు తోడుగా మరో హీరోయిన్ ను కూడా ఎంపిక చేసారు. ప్రేమమ్ సినిమాలో నటించిన అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో రెండవ హీరోయిన్ గా నటిస్తుంది. వాస్తవానికి ఈమెను, ఇదే బ్యానర్ లో నాగచైతన్యతో నిర్మించే ప్రేమమ్ రీమేక్ కు కూడా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. నితిన్-త్రివిక్రమ్ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తారు. నటరాజ్ సుబ్రహ్మణ్యం సినిమాటోగ్రఫీని, రాజీవన్ ఆర్ట్ డైరక్షన్ ను అందిస్తారు. పూర్తిగా ఫ్రెష్ లుక్ తో, డిఫరెంట్ టేకింగ్ తో సినిమా చేయాలని చూస్తున్నారు త్రివిక్రమ్. అందుకే తన టెక్నీషియన్స్ బ్యాచ్ ను కూడా మార్చేసారు. మేకింగ్ అంతా వైవిధ్యంగానే వుంటుంది అని వినికిడి. టీమ్, మేకింగ్ అంతా మారింది..సమంత మాత్రం మరోసారి త్రివిక్రమ్ సినిమాలో నటిస్తోంది.

No comments:

Post a Comment