సినిమా హీరోలకే సౌకర్యం . ఒకే సినిమా మీద ఉంటారు ఆ చిత్రం పూర్తీ అయ్యేవరకు . సరిపడా డబ్బులు, విశ్రాంతికి విశ్రాంతి హీరోయిన్ల పరిస్థితి ఇందుకు పూర్తీ భిన్నం కెరీర్ ఎక్కువ కాలం ఉండదు . కాస్త వయసు మీదపడినా జనాలు చూడటం మానేస్తారు. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి . వయసులో ఉన్నప్పుడే ఎన్ని వీలయితే అన్ని సినిమాలు చేసి నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలి. అంత బిజీ షెడ్యుల్ తో జీవితాన్ని గడపడం చాలా కష్టం . ఈ క్రమంలో ఎన్ని పాట్లు పడాలో ! ముద్దుగుమ్మ హన్సిక కి ఓ కష్టం వచ్చి పడింది . ఇటు తమిళ, ఇటు తెలుగు చిత్రాలతో నిత్యం బిజీ బిజీగా గడిపే హన్సికకు ఇరవై గంటల వ్యవధిలో నాలుగు ప్రాంతాలు చుట్టి రావాల్సిన చిక్కోచి పడింది . నాలుగు విమానాలు ఎక్కి, నాలుగు పనులు చేసుకోని . ఒకే రోజులో నాలుగు షూటింగ్ లలో పాల్గొనే సరికి జ్వరం తో పాటు గొంతు ఇన్ఫెక్షన్ వచ్చేసిందట హన్సికకు . ఈ విషయాన్ని ఇదిగో ఇలా ఆ అమ్మడే ట్వీట్ చేసి చెప్పింది.

No comments:
Post a Comment