తెరపై ఎలాంటి పాత్రల్లో నటించడానికైనా తాను పూర్తి సంసిద్ధంగా వున్నానని అంటోంది బాలీవుడ్ భామ, అందాల ఐశ్వర్యం.. ఐశ్వర్యారాయ్. ఆరాధ్యకు జన్మనిచ్చాక కొన్నాళ్ళపాటు సినిమాలకు దూరమైంది ఐశ్వర్యారాయ్. తిరిగి మేకప్ వేసుకుని, ఆమె నటించిన 'జజ్‌బా' సినిమా విడుదలకు సిద్ధమైంది.
ప్రస్తుతం 'జజ్‌బా' సినిమా ప్రమోషన్‌లో బిజీగా వున్న ఐశ్వర్యారాయ్, ఓ తమిళ సినిమాకి కమిట్ అయ్యిందట కూడా. అయితే అది ప్రస్తుతానికి గాసిప్ మాత్రమే. రజనీకాంత్ నటిస్తోన్న 'కబలి' సినిమాలో ఐష్ నటించబోతుందన్నది ఆ గాసిప్ సారాంశం. అదలా వుంచితే, ఇక నుంచి గ్యాప్ తీసుకోకుండా వరుస సినిమాల్లో నటిస్తానని ఐశ్వర్యారాయ్ చెబుతోంది.
తల్లిగా ఆరాధ్య బాధ్యతలు చూసుకోవడం తనకు కొత్త ఎక్స్‌పీరియన్స్ అంటున్న ఐశ్వర్యారాయ్, ఆ అనుభవం 'జజ్‌బా' సినిమాలో నటించడానికి ఉపయోగపడిందని చెబుతోంది. యోగా చేయడం ద్వారా శరీరాన్ని మునుపటికంటే ఫిట్‌గా మార్చుకుందట ఐశ్వర్య. గ్లామరస్ పాత్రలు మళ్ళీ తెరపై చేస్తారా.? అనడిగితే, 'వై నాట్.. నేను దేనికైనా రెడీ..' అంటూ సమాధానమిచ్చింది. గ్లామర్ అంటే ఎక్స్‌పోజింగ్, వల్గారిటీ అనే ఎందుకు అనుకుంటారు.? అంటూ ఐశ్వర్య ఎదురు ప్రశ్నించింది.
సినిమాల్లో రీ-ఎంట్రీ ఇవ్వడానికి ఫ్యామిలీ సపోర్ట్ చాలా వుందనీ, 'జజ్‌బా' ప్రేక్షకులకు మంచి థ్రిల్ ఇస్తుందనీ, ఆలోచింపజేస్తుందని ఐశ్వర్యారాయ్ చెప్పుకొచ్చింది. ఇకపై నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు, యాక్షన్ మూవీస్ ఎక్కువగా చేయాలనుకుంటోందట ఐశ్వర్యారాయ్.

No comments:
Post a Comment