Tuesday, 15 September 2015

మహేష్‌ను మించిన ప్రభాస్‌

టాలీవుడ్‌ స్టార్‌ హీరోల జాబితాలో సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు పేరు ముందు వరుసలో ఉంటుంది. ఎన్నో టాలీవుడ్‌ రికార్డులను తన ఖాతాలో వేసుకున్న మహేష్‌బాబు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా రికార్డును తన పేరున రాసుకున్నాడు. అత్యధిక బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న హీరోగా మహేష్‌బాబుకు రికార్డు ఉంది అయితే ఎక్కువ బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించినా కూడా, ప్రభాస్‌ తర్వాతే మహేష్‌ ఉండి పోయాడు తాజాగా ‘బాహుబలి’ సినిమాతో అనూహ్యంగా భారీ క్రేజ్‌ను తెచ్చుకున్న ప్రభాస్‌ ప్రస్తుతం పలు కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించబోతున్నాడు. అందులో మొదటిగా మహీంద్ర కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఈయన ఎంపిక అయ్యాడు. ఇప్పటికే చిత్రీకరణ కూడా పూర్తి అయ్యింది. తాజాగా మహీంద్ర కంపెనీ ప్రభాస్‌ తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ముఖ్య పట్టణాల్లో పెద్ద పెద్ద ప్లెక్సీలను ఏర్పాట్లు చేసింది. ఈ స్థాయిలో గతంలో మహేష్‌బాబుకు ప్లెక్సీలు ఏర్పాటు చేసింది లేదు. అలాగే ఇప్పటి వరకు మహేష్‌బాబు ఏ బ్రాండ్‌కు తీసుకోని మొత్తాన్ని ప్రభాస్‌ మహీంద్ర కంపెనీ నుండి తీసుకున్నాడు. ఇలా మహేష్‌ బాబు కంటే కూడా ప్రభాస్‌ ముందు ఉన్నాడు.

No comments:

Post a Comment