Monday, 28 September 2015

వామ్మో .. శృతి కుడా రేటు పెంచేసింది

                                                               
ఒక్క సినిమా హిట్ అయితే చాలు తారల డిమాండ్ నిజంగానే తారలను తాకుతుంది . పెద్ద తారాగణంతో సినిమా చేస్తే సినిమా సగం ఖర్చు వాళ్ళ పారితోషికానికి పోతుంది . తీసేది చిన్న సినిమా అన్న పట్టింపు కుడా లేదు శృతి హాసన్ అమాతంగా రేటు పెంచేసింది గబ్బర్ సింగ్ కి ముందు శృతిహాసన్ ని అంతా ఐరన్ లెగ్ అన్నారు . సినిమా బ్లాక్బస్టర్ అవడంతో ఒక్కసారిగా కోటి రూపాయలు డిమాండ్ చేయడం మొదలుపెట్టింది శృతి . ఇప్పుడు శ్రీమంతుడు ఘన విజయం తరువాత మళ్ళి రేట్ పెంచేసింది . అది కుడా అంతా ఇంతా కాదు . మారుతి కి ఆ బడ్జెట్ ఇస్తే ఓ సినిమా తీసి పెడతాడు ! నాగచైతన్య చేయబోతున్న ప్రేమం రీమేక్ లో శృతిని కథానాయికగా అనుకుంటున్న విషయం తెలిసిందే . ఈ సినిమా కోసం శృతి హాసన్ ఏకంగా రెండు కోట్లు డిమాండ్ చేసిందట . అవాక్కైన నిర్మాతలు సినిమాకి అంత గ్లామర్ రావాలంటే తప్పదు కదా అని సరే అన్నారట ! శృతి నటించిన పులి వచ్చే వారం విడుదల కాబోతోంది . అది కుడా హిట్ అయితే శృతి రేట్ ఇంకా ఎక్కడిదాకా పోతుందో !.

No comments:

Post a Comment