బాలీవుడ్‌లో అన్యోన్య జంటగా చాలా అందరికి ఆదర్శంగా నిలిచిన హృతిక్ రోషన్ మరియు సుజానేలు కొన్నాళ్ల క్రితం విడాకులు తీసుకుని విడిపోయిన విషయం తెల్సిందే. వీరిద్దరు విడిపోవడానికి కారణాలు ఏంటి అనే విషయంపై బాలీవుడ్‌లో చాలా రోజులు చర్చ జరిగింది. ఆ వార్తలు మెల్లగా మాయమై పోతున్న సమయంలో హృతిక్ రోషన్ మాజీ భార్య సుజానే, హృతిక్ మాజీ స్నేహితుడు అయిన రామ్ పాల్‌ను పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతుంది అంటూ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి జాతీయ మీడియా సంస్థ నుండి లోకల్ మీడియా సంస్థల వరకు ఈ విషయమై పెద్ద చర్చే జరిగింది అయితే ఇవన్ని ఒట్టి పుకార్లు మాత్రమే అని సుజానే తల్లి క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఆమె మాట్లాడుతూ. సుజానే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని, అవన్ని ఒట్టి పుకార్లు మాత్రమే అంటూ తేల్చి చెప్పింది. ప్రస్తుతం సుజానే ఒంటరిగా పిల్లలతో సంతోషంగా జీవితాన్ని గడుపుతోంది అంటూ ఆమె పేర్కొన్నారు. దాంతో సుజానే పెళ్లిపై వస్తున్న వార్తలకు బ్రేక్‌లు పడ్డాయి. .

No comments:
Post a Comment