Tuesday, 15 September 2015

కరీనా ఎప్పుడు అంటే అప్పుడు పిల్లల్ని కంటాడంటా.


కరీనా కపూర్ - సైఫ్ అలీ ఖాన్ పెళ్లి చేసుకోని మూడు సంవత్సరాలు అవుతోంది. ఇద్దరిలో ఎవరు సినిమాలు మనేయ్యలేదు. సాధారణంగా పెళ్లి అయితే హీరోయిన్ అవకాశాలు తగ్గాలి కాని కరీనా ఇప్పటికి పెద్ద హీరోలతో పాటు కుర్ర హీరోల సరసన నటిస్తోంది అక్కడితో ఆగకుండా ఐటం సాంగ్స్ తో సెగలు రేపుతోంది. మధ్య మధ్యలో హాట్ హాట్ ఫోటోషూట్ లతో నా అందం ఇంకా వన్నేతరగలేదు అంటోంది. 34 ఏళ్ల వయసొచ్చినా , కరీనా చేతిలో ఈ క్షణంలో కనీసం ఐదు సినిమాలు ఉన్నాయి అంటే నమ్ముతారా . ఇక తమ సినిమా ఒప్పుకోవాలని లైన్ కట్టే దర్శకనిర్మాతలు ఉండనే ఉన్నారు. ఎంతసేపు సినిమాలే కాకుండా, సొంత విషయాలు కుడా పట్టించుకోవాలిగా . పెళ్లి అయ్యి మూడు సంవత్సరాలు గడిచినా, ఇంతవరకు కరీనా ఏ శుభవార్త చెప్పలేదు . ఇదే విషయంపై సైఫ్ అలీ ఖాన్ ను ఆరాతీస్తే " కరీనా పెద్ద హీరోయిన్, తను ఎక్కువ కాలం సినిమాల్లో కొనసాగాలని అభిమానులు కోరుకుంటారు, తను అంత పెద్ద స్టార్ అవడానికి వాళ్ళే కారణం. అందుకే కరీనా వాళ్ళ కోరిక మేరకు ఇంకా సినిమాల్లో కొనసాగుతోంది. ఇప్పుడే పిల్లల గురించి ఆలోచిస్తే తన కెరీర్ కు ఇబ్బంది. ఎంత లేదన్నా, ఓ రెండు సంవత్సరాలు కరీనా సినిమాలకు దూరం అవ్వాలి . ఇది కేవలం అభిమానులకే కాదు. నాకు కుడా ఇష్టం లేదు. ఇంకా ఎంత కాలం సినిమాల్లో కొనసాగాలనేది తన ఇష్టం, ఎందుకంటే ఇది తనకు, తన అభిమానులకు మధ్య విషయం. తను ఎప్పుడు రెడీ అంటే అప్పుడు పిల్లల్ని కంటాను" అంటూ చెప్పుకొచ్చాడు ఛోటా నవాబ్. .

No comments:

Post a Comment