Wednesday, 30 September 2015

ఒక్క సీన్ కోసం 34 టేకులు తీసుకున్న హీరోయిన్


సినిమాల్లో నటించినడం అనుకున్నంత సులభం కాదు . ఎండకి ఒర్చాలి, వానకి తడవాలి, నిద్రాహారాలు మానాలి . ఎంత పట్టుదల ఉంటె ఇది సాధ్యపడుతుంది అందుకే అందరు స్టార్స్ కాలేరు ముగ్గుగుమ్మ రెజినాది కుడా కష్టపడే వ్యక్తిత్వం . అందుకే వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇంకా ఇండస్ట్రీలో నెట్టుకొస్తోంది, మంచి ఆఫర్స్ పొందుతోంది . ఇటివలే రిలీజ్ అయిన సుబ్రహ్మణ్యం ఫర్ సెల్ లో చాలా కష్టపడి చేసిన సీన్ ఒకటి ఉందట . దాని గురించి రెజినా చెబుతూ . "న్యూజెర్సీలో అత్యంత చలిగా ఉండే ఓ నదీ ప్రాంతంలో ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలో షూటింగ్‌ చేశాం. ఆ స్పాట్‌లో తేజ్‌, బ్రహ్మానందం, నేనూ ఉన్నాం. అక్కడి చలికి నా గొంతు వణికిపోయింది. డైలాగ్‌ చెప్పలేని పరిస్థితి. చలి తట్టుకోలేక ఓ సందర్భంలో ఏడుపొచ్చేసింది. కంట్రోల్‌ చేసుకున్నాను. దాదాపు ఆ సన్నివేశం చిత్రీకరణకు 34 టేకులు తీసుకున్నాం. అప్పుడు అనిపించింది యాక్టింగ్‌ అంత ఈజీ కాదని. " ఇలా తన కష్టాన్ని మీడియాతో పంచుకుంది

No comments:

Post a Comment