రకుల్ ప్రీత్ సింగ్..నటించడంలోనూ, అందులోనూ చిట్టి పొట్టి డ్రెస్ లతో కనిపించడంలోనూ పెద్దగా మొహమాటపడదని ఇప్పిటికే అంతంత మాత్రంగా స్పష్టమయింది. కానీ ఇప్పుడు బ్రూస్ లీలో చరణ్ సరసన ' లే ఛలో' పాటలో రకుల్ ను చూస్తే, ప్రేక్షక జనం ఫిదా అయిపోవాల్సిందే. సినిమా ఆద్యంతం రకుల్ పై నుంచి జనం కళ్లు తిప్పుకోలేరు అన్నది గ్యారంటీ. గ్లామర్ ను కుండలతో తెచ్చి పోసేసింది. బికినీకి బెత్తెడు దూరంలో వుండే డ్రెస్ తో
అలరించింది. మొత్తానికి దర్శకుడు శ్రీను వైట్ల ఓ పక్క ఫ్యామిలీ. మరోపక్క యాక్షన్, ఇంకో పక్క ఫన్ మాత్రమే కాకుండా, మాంచి ఐ ఫీస్ట్ ను కూడా జోడించాడన్నమాట. అసలే మెగాస్టార్ వుండడమే ప్లస్ అనుకుంటే, ఇలాంటివి ఒక్కోటి బయటపెడుతూ బ్రూస్ లీ మీద అంచనాలు పెంచుతున్నాడు శ్రీనువైట్ల.

No comments:
Post a Comment