సింగర్ మధుప్రియ ప్రేమ పెళ్లికి చెక్ పెట్టారు ఆమె బంధువులు. ‘ఆడపిల్లనమ్మా..’ అనే పాటతో అనేకమంది మన్ననలు పొందిన మధుప్రియ ప్రేమ పెళ్లికి ఆమె తల్లిదండ్రులు, బంధువులు అభ్యంతరం చెబుతున్నారు. శుక్రవారం కాగజ్‌నగర్‌లో తాను ప్రేమించిన శ్రీకాంత్ అనే యువకుడితో మధుప్రియ పెళ్లికి సిద్ధపడింది. ఐతే ఆమె బంధువులు అంత చిన్న వయస్సులోనే పెళ్లి వద్దని అడ్డు పడ్డారు. కానీ మధుప్రియ మాత్రం ఈ పెళ్లి జరిపించాలని పట్టుబడుతోంది. కాగజ్‌నగర్‌లోని వాసవీ గార్డెన్స్‌లో శుక్రవారం ఉదయం 11.20గంటలకు వీరికి మ్యారేజ్ చేయాలని శ్రీకాంత్ తల్లిదండ్రులు నిర్ణయించారు. కానీ ఇందుకు మధుప్రియ పేరెంట్స్ అంగీకరించలేదు. కెరీర్ మీద ఫోకస్ పెట్టాల్సిన వయసులో అప్పుడే పెళ్లి చేసుకోవడం సరికాదన్నారు. కానీ, ఇందుకు మధుప్రియ అభ్యంతరం వ్యక్తం చేసి రెండురోజుల కిందట శ్రీకాంత్ ఇంటికి చేరుకుంది.శ్రీకాంత్ పేరెంట్స్ వీరి వివాహానికి కార్డ్స్ కూడా పంచేశారు. దీంతో మధుప్రియ బంధువులు, శ్రీకాంత్ ఇంటిపై దాడి చేసి మధుప్రియను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని తెలిసింది. ఆమె పేరెంట్స్ శ్రీకాంత్ ఇంటి వద్దకు చేసుకుని గొడవ చేయడంతో ప్రేమజంట డీఎస్పీ చక్రవర్తిని ఆశ్రయించింది. ఇద్దరూ మేజర్లే కాబట్టి వీరి పెళ్లికి ఎలాంటి పోలీసులు కూడా అడ్డుచెప్పకపోవచ్చని తెలుస్తోంది. రెండునెలల కిందటే మధుప్రియ మేజర్ అయ్యింది. దీంతో ఇద్దరు అడ్డంకులు లేవని శ్రీకాంత్ బంధువులు అంటున్నారు. హైదరాబాద్ న్యూ నల్లకుంట ప్రాంతంలో నివసించే మధుప్రియ రెండేళ్ళుగా శ్రీకాంత్‌తో ప్రేమలో పడింది. దీనిపై ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. అటు పోలీసులు ప్రేమజంటకు కౌన్సిలింగ్ ఇచ్చే పనిలోపడ్డారు.

No comments:
Post a Comment