హీరోయిన్ అసిన్.. మైక్రోమ్యాక్స్ సీఈఓ రాహుల్‌శర్మని త్వరలో మ్యారేజ్ చేసుకోనుంది. అసిన్ బర్త్ డేకు ముందుగానే స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేశారు. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా? ఆమె గదిని పూలతో నింపేసి బహుమతిగా ఇచ్చారు. ఒకవిధంగా ఆ గిఫ్ట్‌ని చూసి ఈ బ్యూటీ షాకయ్యిందట. అక్టోబర్ 26న బర్త్‌డే అయితే, ముందుగానే ఇలా ఇవ్వడమేంటంటూ అప్పుడే ఫిల్మ్ సర్కిల్స్‌లో హడావుడి మొదలైంది. మ్యారేజ్‌కు ముందు బర్త్‌డే వస్తే, కోరుకున్న ప్రియుడు విదేశాలకు తీసుకెళ్లడం, డైమండ్స్, గోల్డ్ ఇలా రకరకాల ఐటెమ్స్ ఇవ్వడం మనం చూస్తున్నాం. కానీ వీటన్నింటికి భిన్నంగా రాహుల్ ఇచ్చిన గిఫ్ట్‌పై చర్చ మొదలైంది. వాటిని ఫోటో తీసి అసిన్ తన సోషల్ నెట్‌వర్క్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. దీనిపై రకరకాల కామెంట్స్ పడిపోతున్నాయి. మ్యారేజ్‌కి ముందే ప్రియుడు ఫ్లపర్స్‌తో సరిపెట్టారని కొందరంటే, కాబోయే భర్త ఈ విధంగా ఝలక్ ఇచ్చారని మరికొందరు అంటున్నారు. మొత్తానికి ఈ కామెంట్స్‌పై అసిన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

No comments:
Post a Comment