Saturday, 3 October 2015

చైనా చేక్కేస్తున్న ఇలియానా


నాజూకు నడుమందం ఇలియానా భారి ప్రాజెక్ట్ ని బుట్టలో వేసుకుంది. కొంత కాలంగా ఏ భాషలో కుడా అవకాశాలు లేక స్లో అయిపోయిన అమ్మడి కెరీర్ మళ్ళి ఊపందుకుంటుందేమో చూడాలి. ప్రస్తుతం, బలంగా వీస్తున్న వార్త ఏంటంటే ఇలియానా చైనా సూపర్ స్టార్ జాకిచాన్ సరసన్ నటించే అవకాశం కొట్టేసిందట
భారత్-చైనా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం పేరు "కుంగ్ పు యోగ". నిజానికి ఈ సినిమాలో మొదటగా జాకిచాన్ తో పాటు ఆమీర్ ఖాన్ కూడా ఉంటాడని, ఇది ఒక మల్టి స్టారర్ చిత్రమని అన్నారు అప్పట్లో. కాని ఈ సినిమాను అమీర్ చేయట్లేదని చెప్పేసాడు. ఇప్పుడు సోనుసుద్ ఈ సినిమాలో ఉన్నప్పటికీ అది అమీర్ చేయాల్సిన పాత్రేనా కాదా అనేది తెలియదు. ఇక ఇందులో మొదట హీరోయిన్ గా కత్రిన కైఫ్ ని అనుకున్నప్పటికీ ఆమీర్ తప్పుకోవడంతో కత్రిన కుడా ప్రాజెక్ట్ నుంచి వైదొలిగింది. ఇప్పుడు అదే అవకాశం ఇలియానా ను వరించింది. అదృష్టం అంటే ఇదేనేమో !.

No comments:

Post a Comment