Tuesday, 13 October 2015

కత్రినా కావాలనే చేస్తోందా ?

జాకిచాన్ సినిమాలో ఛాన్స్ ఇస్తామంటే ఏ అమ్మాయి అయినా ఏం చేస్తుంది. ఎగిరి గంతేస్తుంది.ఎంత పెద్ద హీరోయిన్ అయినా షారుఖ్ ఖాన్ తో సినిమా అంటే ఏం చేస్తుంది ? డేట్స్ అడ్జెస్ట్ కాకపొతే తప్ప, ఖచ్చింతగా మిస్ చేసుకోదు మరి కత్రినాకైఫ్ ఏంటి ఇలా ప్రవర్తిస్తోంది ? జాకిచాన్ త్వరలో ఒక ఇండో-చైనా సినిమా చేయనున్న సంగతి తెలిసిందే
మొదట దానిలో కత్రినాకైఫ్ ని హీరోయిన్ గా అనుకున్నారు. కాని సడెన్ గా కత్రినా ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఆమీర్ ఖాన్ ప్రాజెక్ట్ చెయట్లేదు కాబట్టే నేను కుడా చెయ్యట్లేదు అనే వంక చూపించింది. సరే దానిలో నిజం ఉంది అనుకుందాం. షారుఖ్ దిల్ వాలే కుడా మొదట కత్రినా చేయాల్సిన సినిమా. డేట్స్ ఉండి కుడా సినిమా ఒప్పుకోలేదు. ధూమ్ - 3 తరువాత ఏడాది కత్రినా సినిమా ఒక్కటి రాలేదు. ఈ ఏడాది వచ్చిన ఫాంటమ్ కుడా ధూమ్-3 కి ముందు ఒప్పుకున్న సినిమా. మళ్ళి కత్రిన సినిమా ఎప్పుడు ? దగ్గరలో ఏ సినిమా లేదు. వచ్చిన ఆఫర్స్ అన్ని కాదంటోంది. ఇలా ఎందుకు ? ఇదంతా పెళ్లి కోసమే అంటున్నారు బాలివుడ్ జనాలు. రణబీర్ తో ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా పెళ్లి చేసుకోని సినిమాలు వదిలేయాలి అన్నది కత్రినా ప్లాన్ అంటున్నారు. అందుకేనా కత్రినా ఇలా ప్రవర్తిస్తోంది ?.

No comments:

Post a Comment