Thursday, 15 October 2015

ఆమె అందంపై కామెంట్స్‌


మెగా స్టార్‌ చిరంజీవి సినిమాల్లో లేకపోయినా కూడా ఇండస్ట్రీకి దగ్గరగానే ఉంటూ వస్తున్నాడు. ఎప్పటికప్పుడు హీరోయిన్స్‌పై ప్రశంసలు కురిపిస్తూ వచ్చాడు, వస్తున్నాడు. ‘రచ్చ’ సినిమా సమయంలో తమన్నాపై ప్రశంసల జల్లు కురిపించిన చిరంజీవి ఆ తర్వాత ఒక సమయంలో సమంతను పొగడ్తలతో ముంచెత్తాడు తాజాగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అందాలపై కామెంట్స్‌ చేశాడు స్వయంగా రకుల్‌ అందం గురించి ఆమెతోనే చెప్పాడట. ఈ విషయాన్ని స్వయంగా రకుల్‌ వెళ్లడిస్తూ. ‘బ్రూస్‌లీ’ చిత్రంలో చిరంజీవి గారితో ఒక సీన్‌లో నటించాను. జీవితంలో చిరంజీవి గారితో నటిస్తానా అని అనుకున్నాను. ఆ ఒక్క సీన్‌ జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక చిరు తనతో ‘లే చలో.’ పాటలో చాలా అందంగా ఉన్నావని, ఆ పాటకు ప్రేక్షకుల నుండి ప్రశంసలు దక్కడం ఖాయం అని, ఈ సినిమాతో నీ క్రేజ్‌ మరింతగా పెరుగుందని కూడా అన్నాడు అంటూ సంబర పడుతూ చెబుతోంది. చిరు ప్రశంసలతో రకుల్‌ గాల్లో తేలిపోతుంది. ఇక ఈమె ప్రస్తుతం ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ల చిత్రాల్లో కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. .

No comments:

Post a Comment