Monday, 12 October 2015

కళ్యాణ్‌ రామ్‌ కోసం బికినీ వేసింది


‘పటాస్‌’ చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను అందుకున్న నందమూరి కళ్యాణ్‌ రామ్‌ తాజాగా ‘షేర్‌’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. తాజాగా ఆడియో విడుదలైన ఈ చిత్రాన్ని ఇదే నెల చివర్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో హీరోయిన్‌గా సోనాల్‌ చౌహాన్‌ నటిస్తోంది ‘లెజెండ్‌’, ‘పండగ చేస్కో’ చిత్రాలతో సక్సెస్‌లను దక్కించుకున్న ఈ హీరోయిన్‌ తాజాగా నందమూరి కళ్యాణ్‌ రామ్‌తో రొమాన్స్‌ చేస్తోంది
గత రెండు చిత్రాల్లో తన హాట్‌ అందాలను ఆరబోసిన సోనాల్‌ చౌహాన్‌ ఈ చిత్రంలో మరింతగా తన అందాలను ప్రేక్షకులకు విందు చేయనున్నట్లుగా తెలుస్తోంది. సోనాల్‌ చౌహాన్‌ ‘షేర్‌’ చిత్రంలో బికినీలో కనిపించనుందని చిత్ర యూనిట్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది. పాటలో ఈ అమ్మడు బికినీ వేసిందని తెలుస్తోంది. ‘పండగ చేస్కో’ చిత్రంలో బికినీ షో చేసిన సోనాల్‌ తాజాగా మరోసారి కళ్యాణ్‌ రామ్‌ కోసం ‘షేర్‌’ చిత్రంలో కూడా బికినీతో తన అందాలు చూపించనుందని తెలుస్తోంది. ఈ అమ్మడి బికినీ అందాలు తప్పకుండా సినిమాకు ప్రధాన ఆకర్షణ అవ్వడం ఖాయం అని సినీ వర్గాల వారు అంటున్నారు. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలగాలని తపిస్తున్న సోనాల్‌ చౌహాన్‌ ఈ చిత్రంతో అయినా ఆ క్రేజ్‌ను దక్కించుకుంటుందో చూడాలి. .

No comments:

Post a Comment