Tuesday, 20 October 2015

ఈమె ‘బాహుబలి’కి వదిన


దర్శకధీరుడు రాజమౌళి ‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా చేశాడు. దాదాపుగా 700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సంచలనాలకు మారు పేరుగా నిలిచిన ‘బాహుబలి’ రెండవ పార్ట్‌ ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ ప్రస్తుతం జరుగుతుంది. ఇప్పటికే స్క్రిప్ట్‌ను సిద్దం చేసిన జక్కన్న ప్రస్తుతం నటీనటుల ఎంపిక మరియు లొకేషన్స్‌ మరియు సెట్టింగ్స్‌ ఎంపికలో ఉన్నాడు ఈ నేపథ్యంలో తాజాగా తమిళ స్టార్‌ హీరో సూర్యను ఒక ముఖ్య పాత్రకు జక్కన్న ఎంపిక చేసిన విషయం తెల్సిందే అదే విధంగా ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా శ్రియను పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ‘బాహుబలి’కి అన్న అయిన విలన్‌ భల్లాలదేవకు భార్యగా శ్రియ కనిపించనున్నట్లుగా తెలుస్తోంది. దేవసేనను పెళ్లి చేసుకోవాలని కోరుకున్న భల్లాలదేవ ఆమె దక్కక పోవడంతో శ్రియను వివాహం ఆడతాడు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ‘బాహుబలి’ చిత్రంలో ఏ చిన్న పాత్ర అయినా దక్కక పోతుందా అని స్టార్స్‌ సైతం చకోరా పక్షిలా ఎదురు చూస్తున్న సమయంలో చాలా ముఖ్యమైన పాత్ర శ్రియకు దక్కడంతో ఎగిరి గంతేసినంత పని చేస్తోంది. జక్కన్న నుండి అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే శ్రియ స్వయంగా ప్రకటిస్తాను అంటూ సన్నిహితులతో చెబుతోందట. గతంలో ప్రభాస్‌తో కలిసి ‘చత్రపతి’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రియ ఈ సినిమాలో మాత్రం ఆయనకు వదినగా కనిపించబోతుంది.

No comments:

Post a Comment