Friday, 23 October 2015

ఫస్టాఫ్ అంతా రకుల్‌దేనట.!


టాలీవుడ్‌లో ఫుల్‌జోష్‌లోవున్న హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్. సినిమా.. సినిమాకీ డిఫరెంట్ వే లో ట్రెండీగా కనిపించే ఈ అమ్మడు.. ‘బ్రూస్ లీ’లో మాత్రం ప్రేక్షకుల్ని తన అందచందాలతో కట్టిపడేసింది. సినిమా ఫస్టాఫ్ బాగుందని చెప్పడానికి ఈమె కూడా ఓ కారణం! వీడియో గేమ్ డెవలపర్ రియా రోల్ చిన్నాదే ఐనా, పోలీస్ నే పెళ్లి చేసుకోవాలనే ఆమె బలమైన కోరిక‌తో అలా అలా తిప్పేసింది.కోరుకున్నది లభిస్తే ఎంత హ్యాపీగా ఫీలవుతామో.. అలాగే చెర్రీతో నటించాలన్న డ్రీమ్ నెరవేర్చుకుని పొంగిపోతోంది. పాటల్లో రకుల్ చేసిన గ్లామర్ షో సినిమాకు బిగెస్ట్ ప్లస్ పాయింట్. బ్రూస్ లీకి తానూ కీలకమేనని అభిమానులకు గుర్తు చేసింది. యాక్టింగ్ కు పెద్దగా ప్రయార్టీలేని రోల్‌లో అందాలను ఆరబోసి ప్రేక్షకుడ్ని తన కొంగున ముడేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

No comments:

Post a Comment