Friday, 23 October 2015

అదంతా ఫాల్స్ అంటున్న సమంత



చెర్రీ న్యూప్రాజెక్ట్‌లో తాను నటించడం లేదంటూ క్లారిటీ ఇచ్చేసింది చెన్నై బ్యూటీ సమంత. తమిళంలో హిట్టయిన ‘తన్ని ఒరువన్’ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెల్సిందే! సురేందర్‌రెడ్డి డైరెక్షన్ చేయనున్న ఈ ఫిల్మ్‌లో హీరోయిన్‌గా సమంత ఓకే అయ్యిందంటూ వెబ్ మీడియాలో వచ్చిన వార్తలు ఆమె చెవిన పడ్డాయి. అందులో తాను నటించడంలేదని వివరణ ఇచ్చుకుంది. ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తున్నాయో తనకు అర్ధంకాలేదంటూ తెలిపింది.మరోవైపు ‘బ్రూస్ లీ’ డిజాస్టర్ కావడంతో రీమేక్‌పై మెగా క్యాంప్ ఆలోచనలో పడినట్టు రూమర్లు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడం కూడా కష్టమేనని అంటున్నారట. దీన్ని పెండింగ్‌లో పూరి జగన్నాథ్‌తో మాస్ ఎంటర్‌టైనర్ చేయాలని చెర్రీ ఆలోచిస్తున్నట్లు మెగా ఫ్యాన్స్ టాక్. మొత్తానికి చరణ్ ఏ డైరెక్టర్‌తో సెట్స్‌పైకి వెళ్తాడో చూడాలి.

No comments:

Post a Comment