అందాల తార నయనతార త్వరలోనే ఓ ఇంటి ఆడపడుచు కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో తమిళ నటుడు శింబుతో ఓసారి ప్రేమాయణం నడిపిన నయనతార తనతో బ్రేకప్ తరువాత ప్రభుదేవాతో చెట్టాపట్టాలు వేసుకోని తిరిగిన సంగతి తెలిసిందే. ప్రభుదేవాతో ఏడడుగులు నడవాలానుకున్న నయనతార ఎకంగా మతమార్పిడి చేసుకుంది నిజానికి క్రిస్టియన్ అయిన నయనతార, ప్రభుదేవా కోసమని హిందువుగా మారింది అంత చే్స్తే ప్రభుదేవా నయనతారకు హ్యాండ్ ఇచ్చి బాలివుడ్ లో సెటిల్ అయిపోయాడు. అతికష్టం మీద నయనతార ఆ బాధలోంచి బయటపడింది. ఇంతలో మరో జతగాడు దొరికాడు నయన్ బేబికి. ‘నానుం రౌడీ దాన్’ అనే తమిళ సినిమాలో నటించిన నయనతార, ఆ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో గత కోంతకాలంగా డేటింగ్ చేస్తోంది. అంతే కాదు, వీళ్ళిద్దరూ సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకున్నారనే వార్తలూ గతంలో హల్‌చల్ చేశాయి. అప్పుడే పెళ్లి విషయం ఖండించినా, వీళ్లిద్దరి మధ్య ఎఫైర్ కంటిన్యూ అవుతోందని కోలీవుడ్ టాక్. ప్రస్తుతం సినిమాలతో బిజిగా ఉన్న నయనతార . వచ్చే ఏడాది విఘ్నేష్ శివన్ తో పెళ్లి పీటలు ఎక్కుతుందని కోలివుడ్ లో ఒకటే చర్చ . వీళ్లిదరి ఇంట్లో అమోదం ఇప్పటికే దొరికిందని సమాచారం. ఈసారైనా నయనతార పెళ్ళి కోరుకున్నోడితో జరిగి . మనసు మళ్ళీ గాయపడకుంటే చాలు..

No comments:
Post a Comment