Sunday, 25 October 2015

అడ్డు చెప్పను అంటున్న ముద్దుగుమ్మ


అందాలబొమ్మ రెజీనా ఎంత అందమైన అమ్మాయో, దానికి మించిన గడుసరి. సినిమా సినిమాకి గ్లామర్ డోసు పెంచుకుంటున్న రెజీనా సీన్ డిమాండ్ చేస్తే ఎక్కడిదాకా అయినా వెళుతుందట. ముద్దు సన్నివేశాలకి అడ్డు అస్సలు చెప్పదట ఇదే విషయాన్ని రెజీనా చెబుతూ " సన్నివేశాలు డిమాండ్ చేసాయి కాబట్టే లిప్‌లాక్స్ చేశాను
కథ డిమాండ్ చేసినప్పుడు నేను ముద్దు సన్నివేశాలకి అడ్డు చెప్పను. భవిష్యత్తులో లిప్‌లాకుల పరంగా ట్రెండ్ సృష్టిస్తానేమో ఎవరికి తెలుసు! నేను ఆర్టిస్టుని. నాలో భిన్నకోణాలను ఆవిష్కరించే అవకాశం వచ్చినప్పుడు హద్దులు దాటడానికీ వెనుకాడను. " అంటూ తన భయంలేమిని మరోసారి బయటపెట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటి గోపిచంద్ తో నటిస్తున్న "సౌఖ్యం" షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. క్రిస్టమస్ కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది..

No comments:

Post a Comment