Saturday, 10 October 2015

కిరాయి ఇంట్లో ఉంటున్న బ్యూటి


ఇంగ్లీష్ నేల నుంచి ఇక్కడికొచ్చి తన అందంతో అదరగొడుతున్న భామ ఆమి జాక్సన్. రామ్ చరణ్ ఎవడుతో తెలుగు తెరపై తలుక్కున మెరిసి, మళ్ళి మాయమైపోయింది. అటు తమిళ చిత్రాలు, ఇటు హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న ఆమి జాక్సన్ ఇకపై తన దృష్టంతా బాలివుడ్ పై పెట్టాలని భావిస్తోందట ఆమి జాక్సన్ బాలివుడ్ లో కొత్తగా చేసిన మూవీ " సింగ్ ఈజ్ బ్లింగ్ " అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకుడు. సినిమా పెద్దగా ఆడట్లేదు కాని, బాలివుడ్ బాబులను తెగ ఆకర్షించేసింది ఆమి. ప్రస్తుతం అమ్మడు ఓ రెండు కొత్త చిత్రాల కథాచర్చల్లో పాల్గొంటోంది. హిందీలో సెటిల్ అయిపోదామని చూస్తున్న ఆమీ జాక్సన్, ముంబాయిలోని బాంద్రా ఏరియాలో ఒక ఫ్లాట్ రెంట్ కి తీసుకుంది. ఇప్పుడు అక్కడే ఉంటోంది. చెన్నై,లండన్ నుంచి మాటిమాటికి ముంబాయి వెళ్ళేబదులు ముంబాయిలోనే మకాం పెడితే తనకి అన్ని విధాలా సులువుగా ఉంటుందని అమ్మడి ప్లాన్. మరి ఇల్లు కొనుక్కోవాలి కాని కిరాయి ఎందుకు కట్టడం అనుకుంటున్నారా ? రెండు పెద్ద ప్రాజెక్ట్స్ పడితే కొంటుందట. మళ్ళి అవకాశాలు రాకపోతే డబ్బులు ఊరికే ఖర్చుపెట్టినట్టు అవుతుందిగా. మామూలు ముందుచూపు కాదు కదా అమ్మడిది..

No comments:

Post a Comment