Sunday, 18 October 2015

రకుల్‌కు షాక్‌.. అయినా పర్వాలేదు!!


టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రెండు సంవత్సరాల్లోనే స్టార్‌ హీరోలను తన బుట్టలో వేసుకుని వరుసగా వారి చిత్రాల్లో నటిస్తోంది ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఈ అమ్మడు తాజాగా మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌తో కలిసి ‘బ్రూస్‌లీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ‘బ్రూస్‌లీ’ చిత్రం రకుల్‌కు షాక్‌ ఇచ్చింది యావరేజ్‌ టాక్‌ను తెచ్చుకున్న ‘బ్రూస్‌లీ’ చిత్రం రకుల్‌ ఆశపై నీళ్లు చల్లింది మొదటి స్టార్‌ ప్రాజెక్ట్‌ నిరాశ పర్చిన ఈ అమ్మడి చేతిలో మరో రెండు భారీ ప్రాజెక్ట్‌ు ఉన్నాయి. ‘బ్రూస్‌లీ’ నిరాశ పర్చిన కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా రాబోతున్న యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ను అందుకుంటాను అనే నమ్మకంతో ఉంది. ఎన్టీఆర్‌ సినిమా తర్వాత అల్లు అర్జున్‌ సినిమా ‘సరైనోడు’ చిత్రం కూడా చేస్తోంది. ‘నాన్నకు ప్రేమతో’ మరియు ‘సరైనోడు’ చిత్రాలు సక్సెస్‌ అయితే ఈ అమ్మడు స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెళగడం ఖాయం అని సినీ వర్గాల వారు అంటున్నారు. ఈ అమ్మడికి పలువురు హీరోల సరసన హీరోయిన్‌గా నటించే అవకాశాలు వరుసగా వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు కొత్తగా ఏ చిత్రానికి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదు.

No comments:

Post a Comment