Thursday, 8 October 2015

హీరోయిన్ సూట్ కేస్ దొంగలించారు

మహేష్ బాబు అతిథి సినిమాలో హీరోయిన్ గా చేసిన అమ్మాయి గుర్తుంది కదా. పేరు అమృత రావు. అమృతారావు విలువైన సూట్ కేస్ జైపూర్ విమానాశ్రయంలో చోరికి గురైంది అని వార్త ఒక నగల యాడ్ షూటింగ్ నిమిత్తం ఆమె జైపూర్ వెళ్ళగా, తాను తెచ్చుకున్న మూడు లగేజీ బ్యాగ్స్ లో ఒకటి మిస్సయిన విషయాన్ని గమనించి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది
ఇందులో సుమారు లక్ష రూపాయల విలువైన వస్తువులున్నాయని తెలిపింది. " పెద్ద నగరాల్లో ఇలాంటి చిన్న చిన్న ఘటనలు మామూలే, విమానాశ్రయ అధికారులు తన సూట్ కేసును తిరిగి అందజేస్తారన్న నమ్మకం నాకుంది, ప్రస్తుతం నేనిక్కడ షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేస్తున్నాను " అని అమృత తెలిపింది. మరోవైపు ఒక ఎయిర్ పోర్టు అధికారి మాట్లాడుతూ " ఈ విమానాశ్రయంలో ఇలాంటి సంఘటన ఇంతకుముందు జరగలేదు. తమ సిబ్బంది చాలా సిన్సియర్ గా, జాగ్రత్తగా విధులు నిర్వహిస్తారు. దీనిపై త్వరిత గతిన విచారణ జరిపి పోయిన సూట్ కేసును ఆమెకు అందజేస్తాము " అని తెలిపారు..

No comments:

Post a Comment