Monday, 5 October 2015

నాగచైతన్య కోసం రేట్ తగ్గించిన శృతి


మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ప్రేమం సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మజ్ను అనే టైటిల్ ఈ సినిమాకి సంబంధించి ప్రచారం లో ఉంది. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకునిగా వ్యవహరించనున్నాడు ఇందులో హీరోయిన్ గా శృతి హాసన్ ని అనుకుంటూన్నారన్న విషయం తెలిసిందే శ్రీమంతుడు బ్లాక్బస్టర్ కావడంతో ఒక్కసారిగా శృతి తన రేట్ పెంచేసింది. మొదట రెండు కోట్లు ఇస్తే కాని సినిమా చేయనని మొండికేసి కూర్చున్న శృతి ఇప్పుడు కాస్త కనికరించింది. నాగ చైతన్య కొత్త సినిమాకి ఒకటిన్నర కోట్లు మాత్రమే తీసుకోనుందట. ఇంత సడెన్ పారితోషికంలో అంతలా డిస్కౌంట్ ఎందుకిచ్చిందో ఎవరికీ అర్థం కావట్లేదు. కథా బలం, తన పాత్ర నచ్చడంతో ఇలా చేసి ఉండొచ్చని సిని విశ్లేషకుల ఉవాచ్. మరో వార్త ఏంటంటే . ఈ సినిమాలో మన విక్టరి వెంకటేష్ ఒక అతిథి పాత్రలో కనిపించనున్నారట. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. .

No comments:

Post a Comment