Wednesday, 28 October 2015

నా గొంతు, నా ఇష్టమంటున్న హాట్ బ్యూటి


అందాల తార రాశిఖన్నా కు పాడటం అంటే తెగ ఇష్టమట. కేవలం వినడం వరకే కాకుండా చిన్ననాటి నుండి పాటలు పాడటం అలవాటుగా మారిందట. అసలు నిజానికి గాయని కావలని కలలు కన్నా, ఎందుకో వీలుపడలేదట. " నాకు చిన్ననాటి నుంచి, పాటలు వినడం అన్నా, పాడటం అన్నా చాలా ఇష్టం.ఎదుటివాళ్లకు నా గొంతు నచ్చుతుందా, నచ్చదా, వాళ్ళు ఏమనుకుంటారో అని అస్సలు ఆలోచించేదాన్నే కాదు. నా గొంతు, నా ఇష్టం అన్నాట్టుగా తెగ పాడేదాన్ని. ఇప్పటికి అంతే. అన్ని భాషల పాటలు వింటాను. అయినా సంగీతానికి భాషతో పనిలేదుగా. గాయని కావాలనుకున్నదాన్ని, నటిని అయ్యాను. అయినా ఫర్వాలేదు. చాలా సంతోషంగా ఉన్నాను.'" అంటూ సంగీతం మీద తనకున్న పిచ్చిని బయటపెట్టింది రాశి. ఇటివలే శివమ్ తో మానల్ని పలకరించిన రాశి, వచ్చే నెల "బెంగాల్ టైగర్ " తో మనముందుకు రాబోతోంది.

No comments:

Post a Comment