ఇండిగో విమానంలో ఓ మహిళ పాసింజర్‌కు చేదు అనుభవం ఎదురైంది. షార్ట్ దుస్తులు వేసుకుందన్న కారణంతో ఆమెని విమానంలోకి ఎక్కనివ్వలేదు సిబ్బంది. ఈ తతంగాన్ని గమనించిన మరో పాసింజర్, ఫేసుబుక్‌లో అప్‌లోడ్ చేసింది. ఫ్రాక్ వేసుకుని ఓ మహిళ ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో దోహా నుంచి ముంబై చేరుకుంది. అక్కడి నుంచి ఢిల్లీకి కనెక్టడ్ విమానం ఇండిగో ఎక్కాల్సివుంది. ముంబై ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ బయలుదేరడానికి సిద్దంగావున్న ఇండిగోలో ఆ మహిళా ప్రయాణికురాలు ఎక్కారు.ఆమె ఫ్రాక్ వేసుకోవడంతో ఇంతటి షార్ట్ దుస్తులు వేసుకుంటే తమ విమానంలో అనుమతి లేదని విమాన సిబ్బంది చెప్పి కిందకు దించివేశారు. అదే విమానంలోవున్న మరో మహిళ ప్రయాణికురాలు పురభిదాస్ ఈ ఘటన వివరాలను తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. మహిళ పట్ల ఇండిగో విమానం సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారని, మోకాళ్ల వరకు ఫ్రాక్ వేసుకుందని, మరి సిబ్బందికి అంత అభ్యంతరకరంగా ఎందుకు కనిపించిందో అర్థం కాలేదని తెలిపింది. ఇదే సంస్థలో పని చేస్తున్న ఎయిర్‌హోస్టులు మాత్రం మోకాళ్ల వరకు ఫ్రాక్‌లు వేసుకున్నారని గుర్తు చేసింది. ఈ విషయంపై పురభిదాస్ ఇండిగో సంస్థ కస్టమర్ కేర్‌ను సంప్రదించింది. ఫ్రాక్‌లు వేసుకుంటే తమ విమానాల్లో అనుమతిలేదని చెప్పినట్టు ఆమె వివరించింది. డ్రెస్ మార్చుకున్న తర్వాతే వేరే విమానంలో ఆమె ఢిల్లీ చేరుకున్నారట. విమానం నుంచి కిందకు దించేసిన ఆ మహిళ ప్రయాణికురాలు.. అదే ఇండిగో సంస్థలో పని చేస్తున్న ఓ ఉద్యోగి సోదరి కూడా!
Thursday, 29 October 2015
షార్ట్ డ్రెస్ వేసుకుంటే నో ఎంట్రీ

Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment