Wednesday, 28 October 2015

తమన్నా ఐటెం అంటే అంతే మరి!


బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌లు ఐటెం సాంగ్స్‌ చేయడం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అయితే టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ మాత్రం ఐటెం సాంగ్స్‌ను చాలా తక్కువగా చేస్తారు. కొందరు హీరోయిన్స్‌ అయితే అసలు ఐటెం సాంగ్‌ చేసేందుకు ఒప్పుకోరు. కాని కొందరు హీరోయిన్స్‌ భారీ మొత్తంలో పారితోషికం ఇస్తే ఐటెం సాంగ్స్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నారు
తమన్నా స్టార్‌ హీరోయిన్‌గా దూసుకు పోతున్నప్పటికి ఈమె ఐటెం సాంగ్స్‌కు ఒప్పుకుంటోంది. ఆ మధ్య ‘అల్లుడు శీను’ చిత్రంలో ఐటెం సాంగ్‌ చేసిన తమన్నా మరోసారి బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ సినిమాలో ఐటెం సాంగ్‌ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ‘అల్లుడు శీను’ చిత్రంలో ఐటెం సాంగ్‌ చేసేందుకు తమన్నా దాదాపుగా 75 లక్షలు తీసుకున్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. మరోసారి శ్రీనివాస్‌ సినిమాలో ఐటెం సాంగ్‌ చేసేందుకు అంతకు మించిన పారితోషికాన్ని తమన్నా పుచ్చుకుంటున్నట్లుగా చెబుతున్నారు. సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఆరు నిమిషాల ఐటెం సాంగ్‌ కోసం తమన్నా ఈసారి ఏకంగా 85 లక్షల పారితోషికాన్ని తీసుకోబోతున్నట్లుగా చెబుతున్నారు. టాలీవుడ్‌లో ఐటెం సాంగ్‌కు ఈ స్థాయి పారితోషికం ఇప్పటి వరకు ఎవరు తీసుకున్నది లేదు అని, తమన్నా ఆ రికార్డును సొంతం చేసుకుంది అని సినీ వర్గాల వారు అంటున్నారు. తమన్నాతో ఐటెం సాంగ్‌ అంటే మామూలు విషయమా మరి, పారితోషికం అదే స్థాయిలో ఉంటుంది. భీమినేని శ్రీనివాస్‌ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా సొనారిక నటిస్తుంది. తమిళ ‘సుందర పాండ్యన్‌’కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. .

No comments:

Post a Comment