ఉత్తరాది, దక్షిణాది తేడా లేకుండా హిందీ, తెలుగు, తమిళ భాషల్ని ఒక ఊపు ఊపిన భామ అసిన్. మైక్రోమ్యాక్స్ అధినేత రాహుల్ శర్మ ప్రేమ మత్తులో పడి కెరీర్ ను పక్కన పెట్టేసింది అసిన్. తండ్రి నిర్ణయాల వలనే కెరీర్ మందగించింది అనేవారు లేకపోలేదు. ఏది ఏమైతేనేం.
మొత్తానికి సినిమాలు మానేసింది ఈ బ్యూటి. పెళ్లి కోసమే సినిమాలకి గుడ్ బై చెప్పిన అసిన్, ఇదే ఏడాది చివర్లో పెళ్లి చేసుకోవాలనుకుంది. నవంబర్ 26 న అసిన్ పెళ్లి జరగబోతోందని పెద్ద ఎత్తున ప్రచారం కుడా జరిగింది. అయితే తన పెళ్లి ఇప్పట్లో లేదని తేల్చి చెప్పేసింది అసిన్. మీడియాని గట్టిగా తిట్టేసింది కుడా. నిజంగానే అసిన్ ఇప్పుడే పెళ్లి చేసుకోవలనుకోలేదా ? లేక ఏదైనా ఒత్తిడి వలన వాయిదా వేయాల్సి వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అసిన్ తన పెళ్లిని వాయిదా వేయాల్సివచ్చింది. అసిన్ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సంస్థలు పెళ్లి చేసుకుంటే తమ సంస్థల మార్కెట్ కు ఎదురుదెబ్బ తగులుతుందని ఒత్తిడి చేయడంతో అసిన్ , ఆ కాంట్రాక్ట్ పూర్తీ అయ్యేవరకు పెళ్లి చేసుకోనని మాటిచ్చింది. కాని అప్పటికే పెళ్లి వార్తలు మీడియాకి లీక్ అవడంతో చేసేదేమీ లేక మీడియా మీద దుమ్మేత్తిపోసింది.

No comments:
Post a Comment