అటు బ్రహ్మోత్సవం షూటింగ్ మెల్లిగా జరుగుతుందని సూపర్ స్టార్ అభిమానులు బాధపడుతుంటే, అసలు షూటింగ్ జరుగుతుందా లేదా ? ఎప్పుడు జరుగుతుందో, ఎప్పుడు ఆగిపోద్దో అనే కన్ఫ్యూజన్ తో అల్లాడిపోతున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. హీరోయిన్స్ ని మార్చి మార్చి చివరకు అగ్ర కథానాయిక కాజల్ ని ప్రాజెక్ట్ లోకి లాకున్నారు. అక్కడివరకు బాగానే ఉంది. అప్పుడెప్పుడో షూటింగ్ మొదలైతే ఇంతవరకు కాజల్ సర్దార్ సెట్స్ ని పలకరించకపోవటం గమనార్హం.ఇది ఇలాగే సాగితే సినిమా పూర్తీ అయ్యేది ఎప్పుడు అని బెంగపడుతున్న పవన్ అభిమానులకి శుభవార్త. కాజల్ అగర్వాల్ వచ్చేస్తోంది. పవర్ స్టార్ తో కలిసి చిందులేసేందుకు సిద్ధమవుతోంది. ఈ రోజే బ్రహ్మోత్సవం కొత్త షెడ్యుల్ మొదలవుతుందటంతో సూపర్ స్టార్ తో ఆడిపాడుతున్న కాజల్, షెడ్యుల్ ఇలా పూర్తీ అవగానే అలా పవర్ స్టార్ దగ్గర వాలిపోతుంది. సర్దార్ తదుపరి షెడ్యుల్ గుజరాత్ లో అన్న సంగతి తెలిసిందే. ఈ నెల 17 నుంచి సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ లో పాల్గొననుంది కాజల్. గుజరాత్ లో పెద్ద షెడ్యుల్ ప్లాన్ చేసారు. కాజల్ డేట్స్ ఉన్న రోజులన్నీ ఫుల్ గా వాడేసుకుందామని ఫిక్స్ అయిపోయారంట యూనిట్. తాము ఆలస్యం చేస్తే మళ్ళి ఆ ముద్దుగుమ్మ డేట్స్ దొరకడం కష్టం కదా. కాజల్ డిమాండ్ అలాంటిది మరి..
Sunday, 8 November 2015
కాజల్ ని వాడేసుకుందామని ఫిక్స్ అయ్యారు
అటు బ్రహ్మోత్సవం షూటింగ్ మెల్లిగా జరుగుతుందని సూపర్ స్టార్ అభిమానులు బాధపడుతుంటే, అసలు షూటింగ్ జరుగుతుందా లేదా ? ఎప్పుడు జరుగుతుందో, ఎప్పుడు ఆగిపోద్దో అనే కన్ఫ్యూజన్ తో అల్లాడిపోతున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. హీరోయిన్స్ ని మార్చి మార్చి చివరకు అగ్ర కథానాయిక కాజల్ ని ప్రాజెక్ట్ లోకి లాకున్నారు. అక్కడివరకు బాగానే ఉంది. అప్పుడెప్పుడో షూటింగ్ మొదలైతే ఇంతవరకు కాజల్ సర్దార్ సెట్స్ ని పలకరించకపోవటం గమనార్హం.ఇది ఇలాగే సాగితే సినిమా పూర్తీ అయ్యేది ఎప్పుడు అని బెంగపడుతున్న పవన్ అభిమానులకి శుభవార్త. కాజల్ అగర్వాల్ వచ్చేస్తోంది. పవర్ స్టార్ తో కలిసి చిందులేసేందుకు సిద్ధమవుతోంది. ఈ రోజే బ్రహ్మోత్సవం కొత్త షెడ్యుల్ మొదలవుతుందటంతో సూపర్ స్టార్ తో ఆడిపాడుతున్న కాజల్, షెడ్యుల్ ఇలా పూర్తీ అవగానే అలా పవర్ స్టార్ దగ్గర వాలిపోతుంది. సర్దార్ తదుపరి షెడ్యుల్ గుజరాత్ లో అన్న సంగతి తెలిసిందే. ఈ నెల 17 నుంచి సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ లో పాల్గొననుంది కాజల్. గుజరాత్ లో పెద్ద షెడ్యుల్ ప్లాన్ చేసారు. కాజల్ డేట్స్ ఉన్న రోజులన్నీ ఫుల్ గా వాడేసుకుందామని ఫిక్స్ అయిపోయారంట యూనిట్. తాము ఆలస్యం చేస్తే మళ్ళి ఆ ముద్దుగుమ్మ డేట్స్ దొరకడం కష్టం కదా. కాజల్ డిమాండ్ అలాంటిది మరి..
అనుష్క తొడల వివాదం
‘సైజ్ జీరో’ ఆడియో విడుదల సందర్బంగా అనుష్క తొడల గురించి అలీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం దుమారం లేపుతున్నాయి. మహిళా సంఘాల వారు ఆందోళనలు చేస్తున్నారు. అలీ గతంలో పలు ఇలాంటి కామెంట్స్ చేశాడు అని, ఆయన చేస్తున్న కామెంట్స్ ఆడవానికి అవమాన పర్చేవిగా ఉన్నాయి అంటూ మహిళ సంఘాల వారు విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలపై తాజాగా క్లారిటీ ఇచ్చేందుకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు అలీ.ఆ ఇంటర్వ్యూలో అలీ మాట్లాడుతూ. తాను ఆడియో ఫంక్షన్‌కు వచ్చిన ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌మెంట్ చేసేందుకు ఏదో మాట్లాడాను తప్ప, తప్పుడు ఉద్దేశ్యం ఏమీ లేదు అని, అనుష్క తొడల గురించి తాను మాట్లాడిన విషయాలు తప్పు అని తాను భావించడం లేదు అని అలీ క్లారిటీగా చెప్పాడు. గతంలో మహేష్‌బాబు ‘ఖలేజా’ చిత్రంలోనే అనుష్క తొడలు బాగా బలిసి ఉన్నాయి అంటూ డైలాగ్ చెప్పాడు. అప్పుడు ఇబ్బంది కుగలేదు కాని, తాను అనగానే ఇలా విమర్శలు చేయడం ఏంటని అలీ ఎదురు ప్రశ్నిస్తున్నాడు. అలీ అన్న దాంట్లో కూడా లాజిక్ ఉంది కదా ఆలోచించాలని అలీ సన్నిహితులు అంటున్నారు. మొత్తానికి అనుష్క తొడల వివాదంలో మహేష్‌బాబు కూడా వచ్చి చేరాడు. .
పెళ్లి చేసుకుంటున్న ఎన్టీఆర్ హీరోయిన్
అంకిత గుర్తుందా ? రస్నా ప్రకటన ద్వారా ఫేమస్ అయిన ఈ బ్యుటిని అంతా రస్నా బేబి అని పిలిచేవారు. వైవిఎస్ చౌదరి తీసిన లాహిరి లాహిరి లాహిరి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. తోలి చిత్రంలోనే తన అందాలతో అందరిని ఆకట్టుకున్న ఈ భామ ఎన్టీఆర్ సింహాద్రి తో మంచి డిమాండ్ సాధించింది. సింహాద్రి లో చీమ చీమ అనే సీన్, ఆ తరువాత వచ్చే పాట ఇప్పటికి కుర్రాళ్ళ మతి పోగోడుతూనే ఉంది.ఆ తరువాత బాలకృష్ణ సరసన్ విజయేంద్రవర్మలో మెరిసింది. ఎంత త్వరగా స్టార్ అయిందో , అంతే త్వరగా మెత్తబడింది అంకిత. కారణాలు తెలియకపోయినా, విజయేంద్రవర్మ తరువాత ఈ అమ్మడికి అవకాశాలు రాలేదు. ఎంతసేపు అందాల ఆరబోతే తప్ప నటిగా తనని తానూ నిరుపించుకోకపోవడమే అంకిత కెరీర్ ను పాడు చేసి ఉండొచ్చు. అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూ, మధ్యలో గోపీచంద్ రారాజు లో మెరిసినా, ఆ సినిమా ఆడకపోవడంతో ఇక అవకాశాలు లేక అమెరికా వెళ్ళిపోయింది అంకిత. అక్కడే సినిమా టెక్నాలజీలో శిక్షణ పొంది కొన్ని హాలివుడ్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసింది అంకిత. ఆ సమయలోనే పరిచయమైన న్యూజెర్సీకి చెందిన ఎన్నారై, జెపి మోర్గాన్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అయిన విశాల్ జగ్తాప్ ను త్వరలో పెళ్ళాడబోతోంది ఈ రస్నా బేబి. వీరిద్దరికీ పెద్దల సమక్షంలో ముంబైలో నిశ్చితార్థం జరిగింది. .
Tuesday, 3 November 2015
Samantha In Trouble For Smoking
n for her girl’s next door image.But what the petite beauty has done in her latest Tamil film, 10 Endrathukulla, has shocked her fans. Samantha played two characters, one that of a village belle and the other as a sister of a notorious leader with negative shadesShe appeared smoking cigarette for second role in the film. Samantha was seen puffing out smoke through her nose, like a thorough professional.When a fan tweeted Samantha's smoking pictures from the film, Sam replied to him saying, "who knew playing evil could be such fun !!! Loved it !!"Now the same act of Sam landed her in trouble. Tamil Hindu right wing party Hindu Makkal Katchi took offense of those pictures and demanded apology from Samantha.The HMK's state secretary Veera Manikyam Siva accused the actress of endorsing smoking and added that the act will actor’s act will lead many women to follow suit.He further stated that party will stage a protest in front of her residence if she fails to tender an apology. He threatened that they will send her cigarette and tobacco packets if she fails to comply with their demands..
2017లో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు
టాలీవుడ్ జక్కన్న సృష్టించిన అద్బుత సృష్టి ‘బాహుబలి’. మొదటి పార్ట్ వచ్చి చాలా నెలలు అవుతున్నా కూడా ఇప్పటికి కూడా ఆ పేరు మారు మ్రోగి పోతూనే ఉంది. ప్రస్తుతం రాజమౌళి రెండవ పార్ట్ కోసం స్క్రిప్ట్ వర్క్‌ను చేస్తున్నాడు. ముందుగా అనుకున్న ప్రకారం బాహుబలి మొదటి పార్ట్ విడుదల అయిన సమయంలోనే అంటే వచ్చే సంవత్సరం జులై లేదా అగస్టులో రెండవ పార్ట్‌ను విడుదల చేస్తాం అంటూ స్వయంగా రాజమౌళి ప్రకటించాడు.కాని కొన్ని కారణాల వల్ల రెండవ పార్ట్ షూటింగ్ ప్రారంభం ఆలస్యం అయ్యింది. దానికి తోడు మొదటి పార్ట్ భారీ విజయం రెండవ పార్ట్‌పై మరింతగా అంచనాలు పెంచింది. ఈ కారణాల వల్ల రెండవ పార్ట్ ఇప్పటికి కూడా షూటింగ్ ప్రారంభం అవ్వలేదు. సినీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం వచ్చే సంవత్సరం సంక్రాంతి తర్వాత ‘బాహుబలి’ రెండవ పార్ట్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. దాంతో ఈ చిత్రం విడుదల 2016లో ఉండక పోవచ్చని, 2017లోనే రెండవ పార్ట్ విడుదల అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలియాలి అంటే 2016 వరకు ఆగాలని చెప్పిన చిత్ర యూనిట్ సభ్యులు ఇకపై 2017 వరకు ఆగాల్సిందే అని చెబుతున్నారు. ఇంతకు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో. అది తెలియాలంటే 2017లో రాబోతున్న ‘బాహుబలి’ రెండవ పార్ట్ చూసి తెలుసుకోండి. .
Sunday, 1 November 2015
మూడు కోట్లకు టోపీ పెట్టిందెవరు?
బాలీవుడ్‌లో రీ-ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్యారాయ్‌కు ‘జజ్బా’ మూవీ ప్రొడ్యూసర్ 3 కోట్లకు టోపీపెట్టారా? ఆ తరహా క్యాంపెయిన్ బాలీవుడ్‌లో కొనసాగుతోంది. ఈ సినిమాలో నటించినందుకు ఐష్‌కు నాలుగు కోట్ల రెమ్యునరేషన్ ఇస్తామంటూ ప్రొడ్యూసర్ డీల్ కుదుర్చుకున్నాడట. అడ్వాన్స్‌గా కోటి ఇవ్వడంతో నటించింది. తీరా సినిమా ఫినిష్ అయ్యాక మనీ విషయంలో ప్రొడ్యూసర్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.అదిగో ఇదిగో అంటూ కాలం వెళ్లదీస్తూ వచ్చాడు. ఈలోగా ఐశ్వర్యరాయ్ ఈ మూవీ ప్రచారానికి దూరంగా వుండడంతో పరిస్థితి గమనించిన డైరెక్టర్ సంజయ్ గుప్త.. నిర్మాతల పేర్లలో ఐశ్వర్య పేరు కూడా జత చేశాడు. మూవీ లాభాల్లో వాటా ఇప్పిస్తానని మాటిచ్చి ఐశ్వర్యను శాంతింపజేసినట్టు ఇన్‌సైడ్ టాక్. చివరకు సినిమా ఫ్లాప్ అయ్యింది.. లాభాలేవీ రాలేదు. దీంతో ఐష్ పేరు నిర్మాతగా వేసినా ఫలితం లేకుండాపోయింది. మొత్తానికి ఐశ్వర్యకి ఇవ్వవలసిన మూడు కోట్లకు ఇలా టోపీ పెట్టాడట. మొత్తానికి రీఎంట్రీ సినిమా ఏమోగానీ, ఐష్‌కు పెద్ద షాక్ తగిలిందని ముంబై టాక్.
ఇదే నా ఫస్ట్ కిస్.. బాగా పెట్టానా
ఇప్పటివరకు పోస్టర్స్‌తో అభిమానులను అలరించిన ‘కుమారి 21ఎఫ్’ ట్రైలర్ వచ్చేసింది. కేవలం నిమిషమున్నర ట్రైలర్‌లో హీరో రాజ్‌తరుణ్‌ని హేండ్సమ్‌గా చూపించాడు దర్శకుడు. హైదరాబాద్ శిల్పకళావేదికగా జరిగిన ఆడియో ఫంక్షన్‌కి గెస్ట్‌గా అల్లుఅర్జున్ వచ్చాడు. ఈ ట్రైలర్‌కు నెటిజన్స్ నుంచి మాంచి స్పందన వచ్చింది. ఇద్దరు అమ్మాయిలను చూపిస్తూ స్టోరీ మొదలవుతోంది. ట్రెండ్‌కు తగ్గట్టుగానే డైలాగ్స్ మరీ ఓవర్‌గా వున్నట్లు కనిపిస్తున్నాయి. లొకేషన్స్ బాగున్నాయి. స్టోరీ మొత్తం లవర్స్ మధ్యే తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. రాజ్‌తరుణ్ హీరోగా హేబాపటేల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్. ప్రజెంట్ క్యాంపెయిన్ షురూ చేసిన నిర్మాత, లెక్కల మాస్టార్ సుకుమార్, ఈనెల్లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట.
బాధపడుతున్న సన్నీ లియోన్
సెక్సీ భామ సన్నీ లియోన్ తెగ బాధపడుతోంది. నా పని నేను చేసుకోవడం కూడా తప్పేనా అంటోంది. ఇంతకీ ఏం జరిగింది అని అడుగుతున్నారా? విషయంలోకి వెళ్తే, సన్నీ ని పదే పదే ట్యాగ్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారట ట్విట్టర్ లోని ఆకతాయిలు. మాటి మాటికి సన్నీ గతాన్ని గుర్తుచేసేలా పదజాలాన్నీ వాడుతున్నారట." నేనెప్పుడో మారిపోయాను. ఎప్పుడో మరచిపోయిన గతాన్ని మాటిమాటికీ గుర్తు చేస్తున్నారు కొందరు మనసులేని వాళ్ళ. ప్రస్తుతం నెను కేవలం నటిని మాత్రమే. నా పని నేను చేసుకోవడం కూడా తప్పేనా. నన్ను బాధపెట్టి ఏం సాధిస్తున్నారో అర్థం కాదు. " అంటూ వాపోయింది సన్ని. సన్ని తదుపరి చిత్రం "మస్తిజాదే" షూటింగ్ పూర్తి చేసుకోని విడుదలకు సిద్ధంగా ఉంది..
Friday, 30 October 2015
అసిన్ పెళ్లిని ఎవరు వాయిదా వేసారు ?
ఉత్తరాది, దక్షిణాది తేడా లేకుండా హిందీ, తెలుగు, తమిళ భాషల్ని ఒక ఊపు ఊపిన భామ అసిన్. మైక్రోమ్యాక్స్ అధినేత రాహుల్ శర్మ ప్రేమ మత్తులో పడి కెరీర్ ను పక్కన పెట్టేసింది అసిన్. తండ్రి నిర్ణయాల వలనే కెరీర్ మందగించింది అనేవారు లేకపోలేదు. ఏది ఏమైతేనేం.
మొత్తానికి సినిమాలు మానేసింది ఈ బ్యూటి. పెళ్లి కోసమే సినిమాలకి గుడ్ బై చెప్పిన అసిన్, ఇదే ఏడాది చివర్లో పెళ్లి చేసుకోవాలనుకుంది. నవంబర్ 26 న అసిన్ పెళ్లి జరగబోతోందని పెద్ద ఎత్తున ప్రచారం కుడా జరిగింది. అయితే తన పెళ్లి ఇప్పట్లో లేదని తేల్చి చెప్పేసింది అసిన్. మీడియాని గట్టిగా తిట్టేసింది కుడా. నిజంగానే అసిన్ ఇప్పుడే పెళ్లి చేసుకోవలనుకోలేదా ? లేక ఏదైనా ఒత్తిడి వలన వాయిదా వేయాల్సి వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అసిన్ తన పెళ్లిని వాయిదా వేయాల్సివచ్చింది. అసిన్ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సంస్థలు పెళ్లి చేసుకుంటే తమ సంస్థల మార్కెట్ కు ఎదురుదెబ్బ తగులుతుందని ఒత్తిడి చేయడంతో అసిన్ , ఆ కాంట్రాక్ట్ పూర్తీ అయ్యేవరకు పెళ్లి చేసుకోనని మాటిచ్చింది. కాని అప్పటికే పెళ్లి వార్తలు మీడియాకి లీక్ అవడంతో చేసేదేమీ లేక మీడియా మీద దుమ్మేత్తిపోసింది.
వచ్చే ఏడాది మ్యారేజ్!
నయనతార మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. నెక్ట్స్ ఇయర్‌లో మ్యారేజ్ చేసుకోవడానికి ఈ బ్యూటీ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇంతకీ నయన ఎవరిని మ్యారేజ్ చేసుకుంటోంది? పెద్దలు ఓకే చేసిన వివాహమా? లేక లవ్ మ్యారేజా? అనే ప్రశ్నలు సినీ అభిమానులను వెంటాడుతున్నాయి. నయనకు గతంలో తగిలిన అనుభవాలతో మ్యారేజ్ ఇష్యూలో సైలెంట్‌గా వుందని ఆమె క్లోజ్ ఫ్రెండ్స్ చెబుతున్నమాట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే నెక్ట్స్ ఇయర్ నయనతార- విఘ్నేష్ శివన్ పెళ్లి చేసుకోబోతున్నారట. ఎట్ ప్రజెంట్.. నయనతార పలు సినిమాలతో బిజీగా వుంది. అవి పూర్తయ్యేవరకు పెళ్లి విషయాన్ని వాయిదా వేసుకున్నట్లు ఇన్ సైడ్ టాక్. ఈ ఇష్యూపై కోలీవుడ్‌లో ఒకటే చర్చ. ప్రభుదేవాతో నయన ప్రేమ గురించి అందరికీ తెలిసిందే! పెళ్లి వరకూ వచ్చి.. చివరి నిమిషంలో విడిపోయారు. ఈ వ్యవహారం తర్వాత సినిమాల్లో బిజీ ఐపోయింది నయన. ఇదిలావుండగా ‘నానుం రౌడీ దాన్’ సినిమాలో నటించిన ఈ అమ్మడు, ఆ ఫిల్మ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో డేటింగే కాదు సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకున్నారనే వార్తలూ గతంలో హల్‌చల్ చేశాయి. పెళ్లి విషయం ఖండించినా, వీళ్లిద్దరి మధ్య ఎఫైర్ కంటిన్యూ అవుతోందని కోలీవుడ్ టాక్.
‘ఆడపిల్ల’ ప్రేమపెళ్లికి చెక్ ?
సింగర్ మధుప్రియ ప్రేమ పెళ్లికి చెక్ పెట్టారు ఆమె బంధువులు. ‘ఆడపిల్లనమ్మా..’ అనే పాటతో అనేకమంది మన్ననలు పొందిన మధుప్రియ ప్రేమ పెళ్లికి ఆమె తల్లిదండ్రులు, బంధువులు అభ్యంతరం చెబుతున్నారు. శుక్రవారం కాగజ్‌నగర్‌లో తాను ప్రేమించిన శ్రీకాంత్ అనే యువకుడితో మధుప్రియ పెళ్లికి సిద్ధపడింది. ఐతే ఆమె బంధువులు అంత చిన్న వయస్సులోనే పెళ్లి వద్దని అడ్డు పడ్డారు. కానీ మధుప్రియ మాత్రం ఈ పెళ్లి జరిపించాలని పట్టుబడుతోంది. కాగజ్‌నగర్‌లోని వాసవీ గార్డెన్స్‌లో శుక్రవారం ఉదయం 11.20గంటలకు వీరికి మ్యారేజ్ చేయాలని శ్రీకాంత్ తల్లిదండ్రులు నిర్ణయించారు. కానీ ఇందుకు మధుప్రియ పేరెంట్స్ అంగీకరించలేదు. కెరీర్ మీద ఫోకస్ పెట్టాల్సిన వయసులో అప్పుడే పెళ్లి చేసుకోవడం సరికాదన్నారు. కానీ, ఇందుకు మధుప్రియ అభ్యంతరం వ్యక్తం చేసి రెండురోజుల కిందట శ్రీకాంత్ ఇంటికి చేరుకుంది.శ్రీకాంత్ పేరెంట్స్ వీరి వివాహానికి కార్డ్స్ కూడా పంచేశారు. దీంతో మధుప్రియ బంధువులు, శ్రీకాంత్ ఇంటిపై దాడి చేసి మధుప్రియను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని తెలిసింది. ఆమె పేరెంట్స్ శ్రీకాంత్ ఇంటి వద్దకు చేసుకుని గొడవ చేయడంతో ప్రేమజంట డీఎస్పీ చక్రవర్తిని ఆశ్రయించింది. ఇద్దరూ మేజర్లే కాబట్టి వీరి పెళ్లికి ఎలాంటి పోలీసులు కూడా అడ్డుచెప్పకపోవచ్చని తెలుస్తోంది. రెండునెలల కిందటే మధుప్రియ మేజర్ అయ్యింది. దీంతో ఇద్దరు అడ్డంకులు లేవని శ్రీకాంత్ బంధువులు అంటున్నారు. హైదరాబాద్ న్యూ నల్లకుంట ప్రాంతంలో నివసించే మధుప్రియ రెండేళ్ళుగా శ్రీకాంత్‌తో ప్రేమలో పడింది. దీనిపై ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. అటు పోలీసులు ప్రేమజంటకు కౌన్సిలింగ్ ఇచ్చే పనిలోపడ్డారు.
Thursday, 29 October 2015
షార్ట్ డ్రెస్ వేసుకుంటే నో ఎంట్రీ
ఇండిగో విమానంలో ఓ మహిళ పాసింజర్‌కు చేదు అనుభవం ఎదురైంది. షార్ట్ దుస్తులు వేసుకుందన్న కారణంతో ఆమెని విమానంలోకి ఎక్కనివ్వలేదు సిబ్బంది. ఈ తతంగాన్ని గమనించిన మరో పాసింజర్, ఫేసుబుక్‌లో అప్‌లోడ్ చేసింది. ఫ్రాక్ వేసుకుని ఓ మహిళ ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో దోహా నుంచి ముంబై చేరుకుంది. అక్కడి నుంచి ఢిల్లీకి కనెక్టడ్ విమానం ఇండిగో ఎక్కాల్సివుంది. ముంబై ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ బయలుదేరడానికి సిద్దంగావున్న ఇండిగోలో ఆ మహిళా ప్రయాణికురాలు ఎక్కారు.ఆమె ఫ్రాక్ వేసుకోవడంతో ఇంతటి షార్ట్ దుస్తులు వేసుకుంటే తమ విమానంలో అనుమతి లేదని విమాన సిబ్బంది చెప్పి కిందకు దించివేశారు. అదే విమానంలోవున్న మరో మహిళ ప్రయాణికురాలు పురభిదాస్ ఈ ఘటన వివరాలను తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. మహిళ పట్ల ఇండిగో విమానం సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారని, మోకాళ్ల వరకు ఫ్రాక్ వేసుకుందని, మరి సిబ్బందికి అంత అభ్యంతరకరంగా ఎందుకు కనిపించిందో అర్థం కాలేదని తెలిపింది. ఇదే సంస్థలో పని చేస్తున్న ఎయిర్‌హోస్టులు మాత్రం మోకాళ్ల వరకు ఫ్రాక్‌లు వేసుకున్నారని గుర్తు చేసింది. ఈ విషయంపై పురభిదాస్ ఇండిగో సంస్థ కస్టమర్ కేర్‌ను సంప్రదించింది. ఫ్రాక్‌లు వేసుకుంటే తమ విమానాల్లో అనుమతిలేదని చెప్పినట్టు ఆమె వివరించింది. డ్రెస్ మార్చుకున్న తర్వాతే వేరే విమానంలో ఆమె ఢిల్లీ చేరుకున్నారట. విమానం నుంచి కిందకు దించేసిన ఆ మహిళ ప్రయాణికురాలు.. అదే ఇండిగో సంస్థలో పని చేస్తున్న ఓ ఉద్యోగి సోదరి కూడా!
Wednesday, 28 October 2015
ఇప్పట్లో పెళ్ళి లేదంటున్న అనుష్క
మన దేశంలో ఎప్పుడు వార్తల్లో ఉండే జండ ఏది అంటే, విరాట్ కొహ్లీ, అనుష్క శర్మల పేర్లే చెప్పాలి. దేశవ్యాప్తంగా హాట్ జంట అంటే ఇదే. ఈ జంట త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నారని. విరాట్ ఇంట్లో పెళ్ళికి తొందర పెడుతున్నారని వార్తలు వచ్చాయి.అయితే ఇవన్ని నిజాలు కావు అని కొట్టిపారేసారు అనుష్క సన్నిహితులు. అనుష్క ఇప్పుడు చాలా బీజిగా ఉందని, చేతిలో అన్నేసి సినిమాలు పెట్టుకోని పెళ్లి ఎలా చేసుకుంటుందని చెప్పారు అనుష్క సన్నిహితులు. మరోవైపు విరాట్ కుడా ఈ మధ్యే టెస్ట్ కెప్టెన్ గా జట్టు పగ్గాలు చేపట్టాడు. తాను కుడా పెళ్ళికి తొందరపడట్లేదట. కొహ్లీ ఇంట్లో ఒత్తిడి చేస్తున్నారు అనేది కుడా అవాస్తవమేనట. పెళ్ళి చేసుకోకున్నా ఈ జంట హడావిడి అంతా, ఇంతా కాదు కదా. ఎక్కడపడితే అక్కడే కలిసి కనిపిస్తారు. అప్పుడే పెళ్ళి చేసుకోవాల్సిన తొందరేం ఉంది..
తమన్నా ఐటెం అంటే అంతే మరి!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లు ఐటెం సాంగ్స్ చేయడం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అయితే టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ మాత్రం ఐటెం సాంగ్స్‌ను చాలా తక్కువగా చేస్తారు. కొందరు హీరోయిన్స్ అయితే అసలు ఐటెం సాంగ్ చేసేందుకు ఒప్పుకోరు. కాని కొందరు హీరోయిన్స్ భారీ మొత్తంలో పారితోషికం ఇస్తే ఐటెం సాంగ్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు
తమన్నా స్టార్ హీరోయిన్‌గా దూసుకు పోతున్నప్పటికి ఈమె ఐటెం సాంగ్స్‌కు ఒప్పుకుంటోంది. ఆ మధ్య ‘అల్లుడు శీను’ చిత్రంలో ఐటెం సాంగ్ చేసిన తమన్నా మరోసారి బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సినిమాలో ఐటెం సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘అల్లుడు శీను’ చిత్రంలో ఐటెం సాంగ్ చేసేందుకు తమన్నా దాదాపుగా 75 లక్షలు తీసుకున్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. మరోసారి శ్రీనివాస్ సినిమాలో ఐటెం సాంగ్ చేసేందుకు అంతకు మించిన పారితోషికాన్ని తమన్నా పుచ్చుకుంటున్నట్లుగా చెబుతున్నారు. సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఆరు నిమిషాల ఐటెం సాంగ్ కోసం తమన్నా ఈసారి ఏకంగా 85 లక్షల పారితోషికాన్ని తీసుకోబోతున్నట్లుగా చెబుతున్నారు. టాలీవుడ్‌లో ఐటెం సాంగ్‌కు ఈ స్థాయి పారితోషికం ఇప్పటి వరకు ఎవరు తీసుకున్నది లేదు అని, తమన్నా ఆ రికార్డును సొంతం చేసుకుంది అని సినీ వర్గాల వారు అంటున్నారు. తమన్నాతో ఐటెం సాంగ్ అంటే మామూలు విషయమా మరి, పారితోషికం అదే స్థాయిలో ఉంటుంది. భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా సొనారిక నటిస్తుంది. తమిళ ‘సుందర పాండ్యన్’కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. .
నా గొంతు, నా ఇష్టమంటున్న హాట్ బ్యూటి
అందాల తార రాశిఖన్నా కు పాడటం అంటే తెగ ఇష్టమట. కేవలం వినడం వరకే కాకుండా చిన్ననాటి నుండి పాటలు పాడటం అలవాటుగా మారిందట. అసలు నిజానికి గాయని కావలని కలలు కన్నా, ఎందుకో వీలుపడలేదట. " నాకు చిన్ననాటి నుంచి, పాటలు వినడం అన్నా, పాడటం అన్నా చాలా ఇష్టం.ఎదుటివాళ్లకు నా గొంతు నచ్చుతుందా, నచ్చదా, వాళ్ళు ఏమనుకుంటారో అని అస్సలు ఆలోచించేదాన్నే కాదు. నా గొంతు, నా ఇష్టం అన్నాట్టుగా తెగ పాడేదాన్ని. ఇప్పటికి అంతే. అన్ని భాషల పాటలు వింటాను. అయినా సంగీతానికి భాషతో పనిలేదుగా. గాయని కావాలనుకున్నదాన్ని, నటిని అయ్యాను. అయినా ఫర్వాలేదు. చాలా సంతోషంగా ఉన్నాను.'" అంటూ సంగీతం మీద తనకున్న పిచ్చిని బయటపెట్టింది రాశి. ఇటివలే శివమ్ తో మానల్ని పలకరించిన రాశి, వచ్చే నెల "బెంగాల్ టైగర్ " తో మనముందుకు రాబోతోంది.
Monday, 26 October 2015
కాబోయే భర్త షాక్ ఇచ్చాడా?
హీరోయిన్ అసిన్.. మైక్రోమ్యాక్స్ సీఈఓ రాహుల్‌శర్మని త్వరలో మ్యారేజ్ చేసుకోనుంది. అసిన్ బర్త్ డేకు ముందుగానే స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేశారు. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా? ఆమె గదిని పూలతో నింపేసి బహుమతిగా ఇచ్చారు. ఒకవిధంగా ఆ గిఫ్ట్‌ని చూసి ఈ బ్యూటీ షాకయ్యిందట. అక్టోబర్ 26న బర్త్‌డే అయితే, ముందుగానే ఇలా ఇవ్వడమేంటంటూ అప్పుడే ఫిల్మ్ సర్కిల్స్‌లో హడావుడి మొదలైంది. మ్యారేజ్‌కు ముందు బర్త్‌డే వస్తే, కోరుకున్న ప్రియుడు విదేశాలకు తీసుకెళ్లడం, డైమండ్స్, గోల్డ్ ఇలా రకరకాల ఐటెమ్స్ ఇవ్వడం మనం చూస్తున్నాం. కానీ వీటన్నింటికి భిన్నంగా రాహుల్ ఇచ్చిన గిఫ్ట్‌పై చర్చ మొదలైంది. వాటిని ఫోటో తీసి అసిన్ తన సోషల్ నెట్‌వర్క్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. దీనిపై రకరకాల కామెంట్స్ పడిపోతున్నాయి. మ్యారేజ్‌కి ముందే ప్రియుడు ఫ్లపర్స్‌తో సరిపెట్టారని కొందరంటే, కాబోయే భర్త ఈ విధంగా ఝలక్ ఇచ్చారని మరికొందరు అంటున్నారు. మొత్తానికి ఈ కామెంట్స్‌పై అసిన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
హాట్ సినిమాకి ఘాటు ఫోటోషూట్ !
హీరోయిన్ రాధికాఆప్టే.. తక్కువ సినిమాలతో హైలైట్ అయ్యింది ఈ అమ్మడు. సినిమాల కంటే.. కాంట్రవర్సీ కామెంట్స్ ఈమెని బాగా ఎక్స్‌ఫోజ్ చేశాయి. నెటిజన్స్ సెర్చ్‌లో ఈమెకు లాస్ట్ త్రీ మంత్స్ గూగుల్‌లో సెకండ్ ప్లేస్. వర్మ ‘రక్తచరిత్ర’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె, కంటిన్యూగా బాలయ్యతో రెండు సినిమాలు నటించి ట్రెడిషనల్ బ్యూటీగా రికార్డ్ ఓన్ చేసుకుంది. రీసెంట్‌గా ‘అహల్య’ షార్ట్ ఫిల్మ్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాధికా, ఈసారి నెక్ట్స్ ఫిల్మ్‌లో లెస్బియన్‌గా చేస్తోంది.బాలీవుడ్‌లోఇది మరో ‘ఫైర్’ అని అంటున్నారు నెటిజన్స్. ట్వంటీ ఇయర్స్ బ్యాక్ బాలీవుడ్‌లో ‘ఫైర్’ చేసిన హంగామా అంతాఇంతా కాదు. ఇప్పటికైతే ఈ సినిమా కోసం ఓ ఫోటోషూట్ చేసినట్టు ముంబై న్యూస్. ఈ మూవీలో రాధిక ఓ రేంజ్‌లో రెచ్చిపోనుందని తెలుస్తోంది. కాంట్రవర్సీ కామెంట్స్, హెవీ ఎక్స్‌పోజింగ్ వంటి కీ-పాయింట్స్‌తో టోటల్‌గా క్యాష్ చేసుకోవాలన్నది ఈ మూవీ ఫిల్మ్‌మేకర్ ఆలోచన.
వావ్...లక్కీ గాళ్స్
ఈమెని ఎర వేసి.. ఆ పని..!
ప్రియాంక చోప్రా డేంజరస్ హీరోయినా? ముమ్మాటికీ అవుననే అంటున్నారు ఇంటర్నెట్ ఎక్స్‌పర్ట్స్. పొరపాటున ఇంటర్నెట్‌లో ఈమె పేరుతో సెర్చ్ చేస్తే బుక్కైపోయినట్టేనని ఇంటెల్ సెక్యూరిటీ సంస్థ తాజా నివేదిక. సైబర్ నేరగాళ్లు బాలీవుడ్ నటీనటుల వ్యవహారాలకు సంబంధించిన గాసిప్స్‌నే వినియోగదారులకు ఎరగా వేస్తున్నారట. ఇందులో ప్రియాంకా చోప్రానే టాప్ ప్లేస్‌లో వుందట. ఈమె బారినపడి చాలామంది నెట్ యూజర్స్ బుక్కైనట్టు సమాచారం.ప్రియాంక పేరుతో సెర్చ్ చేసినప్పుడు చాలా వెబ్ పేజీలు ఓపెన్ అవుతున్నాయని, వాటిలో వైరస్‌లు వుంటాయంటూ తేల్చింది. వాటిని డౌన్‌లోడ్ చేయగానే హ్యాకర్లు మన కంప్యూటర్‌లో చేరి, నెటిజన్స్‌కు సంబంధించిన వ్యక్తిగత వివరాలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు దొంగిలిస్తున్నారని నిపుణులు తేల్చారు. ఇలాంటి విషయాలు డౌన్‌లోడ్ చేసేటప్పుడు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిస్తున్నారు. గతేడాది అలియాభట్‌కు సంబంధించిన వీడియోలు, వ్యవహారాలను చూసేందుకు క్లిక్ చేసిన నెటిజన్స్.. హ్యాకర్స్ బారినపడగా, ఈ ఏడాది ఆ స్థానంలోకి ప్రియాంకా వచ్చేసింది. ఇక శ్రద్ధాకపూర్ సెకండ్ ప్లేస్‌కి వెళ్లింది. నెటిజన్స్ తస్మాత్ జాగ్రత్త!
Sunday, 25 October 2015
అడ్డు చెప్పను అంటున్న ముద్దుగుమ్మ
అందాలబొమ్మ రెజీనా ఎంత అందమైన అమ్మాయో, దానికి మించిన గడుసరి. సినిమా సినిమాకి గ్లామర్ డోసు పెంచుకుంటున్న రెజీనా సీన్ డిమాండ్ చేస్తే ఎక్కడిదాకా అయినా వెళుతుందట. ముద్దు సన్నివేశాలకి అడ్డు అస్సలు చెప్పదట ఇదే విషయాన్ని రెజీనా చెబుతూ " సన్నివేశాలు డిమాండ్ చేసాయి కాబట్టే లిప్‌లాక్స్ చేశాను
కథ డిమాండ్ చేసినప్పుడు నేను ముద్దు సన్నివేశాలకి అడ్డు చెప్పను. భవిష్యత్తులో లిప్‌లాకుల పరంగా ట్రెండ్ సృష్టిస్తానేమో ఎవరికి తెలుసు! నేను ఆర్టిస్టుని. నాలో భిన్నకోణాలను ఆవిష్కరించే అవకాశం వచ్చినప్పుడు హద్దులు దాటడానికీ వెనుకాడను. " అంటూ తన భయంలేమిని మరోసారి బయటపెట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటి గోపిచంద్ తో నటిస్తున్న "సౌఖ్యం" షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. క్రిస్టమస్ కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది..
Saturday, 24 October 2015
రంజుగా లిప్ లాక్ చేస్తున్నమంజిమా
'సాహసం శ్వాసగా సాగిపో' మూవీలో లిప్ లాక్ లకు కొదవుండదట. ఈ మూవీలో హీరోహీరోయిన్లు నాగచైతన్య- మళయాలనటి మంజిమా మోహన్ ల మధ్య ఈ సీన్స్ జోరుగా ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం హీరోహీరోయిన్ల మధ్య ఇలాంటి రొమాంటిక్ సీన్సే షూట్ చేస్తున్నారు.దీంతో చాలా వరకూ షూటింగ్ పూర్తయినట్టేనని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా త్వరలోనే ముగించి సాధ్యమైనంత త్వరలో మూవీ రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. గౌతమ్ వాసుదేవ మీనన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని కోన వెంకట్ సమర్పిస్తున్నారు.
Friday, 23 October 2015
బసు ప్రసాద్ ఖవాలీ షో గర్ల్ అయింది
సినిమాలు లేకపోతేనేం..నటి శ్వేతా బసు ప్రసాద్ ఖవాలీ షో గర్ల్ అయింది. ఓ ఖవాలీ సాంగ్ లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆలిండియా బఖూద్ అనే గ్రూప్ రూపొందించిన క్రీపీ ఖవాలీ వీడియో కి శ్వేత షో ఎస్సెట్ అయింది.సింగర్ గా మంచి మార్కులే కొట్టేసింది. ఫేస్‌బుక్ సహా నెట్‌వర్కింగ్‌సైట్స్ లో అమ్మాయిలను వేధించే ఆకతాయిల మీద సెటైరికల్ గా వేసిన చమక్కులే ఈ వీడియో.
కో-ప్రొడ్యూసర్ అయిన ఛార్మి..
దర్శకుడు పూరీ జగన్నాధ్‌తో కలిసి బ్యూటీ ఛార్మి ఓ సినిమా నిర్మిస్తుందని టాక్. రేవతి దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా ఈ సినిమాకు ఆమె కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తుందని తెలుస్తోంది. పూరీతో గతంలో ‘జ్యోతిలక్ష్మి’ మూవీకి కూడా కో-ప్రొడ్యూసర్ అయిన ఛార్మి.. అందులో హీరోయిన్ రోల్‌లో మెప్పించింది.కాగా విక్రమ్, సమంతల ‘10 ఎంద్రతుకుల్లా’ అనే తమిళ సినిమాలో ఛార్మి ఐటెం సాంగ్‌లో తన ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగించనుంది. ‘గానా గానా తెలంగాణ’అనే మాస్ టైప్ సాంగ్ ఇదట! అయితే.. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సాంగ్ వుంటుందా అన్నది ఇంకా సస్పెన్స్!
అదంతా ఫాల్స్ అంటున్న సమంత
చెర్రీ న్యూప్రాజెక్ట్‌లో తాను నటించడం లేదంటూ క్లారిటీ ఇచ్చేసింది చెన్నై బ్యూటీ సమంత. తమిళంలో హిట్టయిన ‘తన్ని ఒరువన్’ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెల్సిందే! సురేందర్‌రెడ్డి డైరెక్షన్ చేయనున్న ఈ ఫిల్మ్‌లో హీరోయిన్‌గా సమంత ఓకే అయ్యిందంటూ వెబ్ మీడియాలో వచ్చిన వార్తలు ఆమె చెవిన పడ్డాయి. అందులో తాను నటించడంలేదని వివరణ ఇచ్చుకుంది. ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తున్నాయో తనకు అర్ధంకాలేదంటూ తెలిపింది.మరోవైపు ‘బ్రూస్ లీ’ డిజాస్టర్ కావడంతో రీమేక్‌పై మెగా క్యాంప్ ఆలోచనలో పడినట్టు రూమర్లు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడం కూడా కష్టమేనని అంటున్నారట. దీన్ని పెండింగ్‌లో పూరి జగన్నాథ్‌తో మాస్ ఎంటర్‌టైనర్ చేయాలని చెర్రీ ఆలోచిస్తున్నట్లు మెగా ఫ్యాన్స్ టాక్. మొత్తానికి చరణ్ ఏ డైరెక్టర్‌తో సెట్స్‌పైకి వెళ్తాడో చూడాలి.
ఫస్టాఫ్ అంతా రకుల్‌దేనట.!
టాలీవుడ్‌లో ఫుల్‌జోష్‌లోవున్న హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్. సినిమా.. సినిమాకీ డిఫరెంట్ వే లో ట్రెండీగా కనిపించే ఈ అమ్మడు.. ‘బ్రూస్ లీ’లో మాత్రం ప్రేక్షకుల్ని తన అందచందాలతో కట్టిపడేసింది. సినిమా ఫస్టాఫ్ బాగుందని చెప్పడానికి ఈమె కూడా ఓ కారణం! వీడియో గేమ్ డెవలపర్ రియా రోల్ చిన్నాదే ఐనా, పోలీస్ నే పెళ్లి చేసుకోవాలనే ఆమె బలమైన కోరికతో అలా అలా తిప్పేసింది.కోరుకున్నది లభిస్తే ఎంత హ్యాపీగా ఫీలవుతామో.. అలాగే చెర్రీతో నటించాలన్న డ్రీమ్ నెరవేర్చుకుని పొంగిపోతోంది. పాటల్లో రకుల్ చేసిన గ్లామర్ షో సినిమాకు బిగెస్ట్ ప్లస్ పాయింట్. బ్రూస్ లీకి తానూ కీలకమేనని అభిమానులకు గుర్తు చేసింది. యాక్టింగ్ కు పెద్దగా ప్రయార్టీలేని రోల్‌లో అందాలను ఆరబోసి ప్రేక్షకుడ్ని తన కొంగున ముడేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
Wednesday, 21 October 2015
మళ్లీ మిస్ అయిన సమంత
మెగా హీరోలతో నటించే అవకాశం కోసం హీరోయిన్స్ చకోర పక్షుల్లా ఎదురు చూస్తు ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, చరణ్, అల్లు అర్జున్‌లతో నటించే అవకాశం వస్తే వారు స్టార్స్ అయినట్లే. అందుకే ఈ ముగ్గురు మెగా హీరోల సినిమాల్లో నటించాలని హీరోయిన్స్ కోరుకుంటారు ఇప్పటికే పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్‌ల సరసన నటించిన సమంత ముచ్చటగా మూడవ మెగా హీరో రామ్‌చరణ్‌తో కూడా నటించాలని కోరుకుంటుంది ‘బ్రూస్‌లీ’ సినిమాలో ఈమెకు అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారి పోయింది. సమంతను ఎంపిక చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆ స్థానంలో రకుల్ ప్రీత్ సింగ్‌ను ఎంపిక చేశారు. తాజాగా సమంతకు మళ్లీ చరణ్ సరసన నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారి పోయింది. టాలీవుడ్ నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ‘తని వరువన్’ రీమేక్‌లో హీరోయిన్‌గా సమంతను ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరిగింది. చరణ్ కూడా సమంతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అన్నారు. కాని తాజాగా సమంత ఆ వార్తలపై స్పందిస్తూ ‘తని వరువన్’ సినిమాలో తాను నటించడం లేదు అంటూ తేల్చి చెప్పింది. ఈసారి ఏం జరిగిందో ఏమో కాని, ఈ సినిమాలో ఎంపిక అవ్వడం జరిగింది, మళ్లీ మిస్ అవ్వడం కూడా చకచక జరిగి పోయింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ రీమేక్‌లో హీరోయిన్ ఎవరు అనేది త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తాం అంటూ నిర్మాత ప్రకటించాడు. .
Tuesday, 20 October 2015
ఈమె ‘బాహుబలి’కి వదిన
దర్శకధీరుడు రాజమౌళి ‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా చేశాడు. దాదాపుగా 700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సంచలనాలకు మారు పేరుగా నిలిచిన ‘బాహుబలి’ రెండవ పార్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతుంది. ఇప్పటికే స్క్రిప్ట్‌ను సిద్దం చేసిన జక్కన్న ప్రస్తుతం నటీనటుల ఎంపిక మరియు లొకేషన్స్ మరియు సెట్టింగ్స్ ఎంపికలో ఉన్నాడు ఈ నేపథ్యంలో తాజాగా తమిళ స్టార్ హీరో సూర్యను ఒక ముఖ్య పాత్రకు జక్కన్న ఎంపిక చేసిన విషయం తెల్సిందే అదే విధంగా ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా శ్రియను పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ‘బాహుబలి’కి అన్న అయిన విలన్ భల్లాలదేవకు భార్యగా శ్రియ కనిపించనున్నట్లుగా తెలుస్తోంది. దేవసేనను పెళ్లి చేసుకోవాలని కోరుకున్న భల్లాలదేవ ఆమె దక్కక పోవడంతో శ్రియను వివాహం ఆడతాడు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ‘బాహుబలి’ చిత్రంలో ఏ చిన్న పాత్ర అయినా దక్కక పోతుందా అని స్టార్స్ సైతం చకోరా పక్షిలా ఎదురు చూస్తున్న సమయంలో చాలా ముఖ్యమైన పాత్ర శ్రియకు దక్కడంతో ఎగిరి గంతేసినంత పని చేస్తోంది. జక్కన్న నుండి అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే శ్రియ స్వయంగా ప్రకటిస్తాను అంటూ సన్నిహితులతో చెబుతోందట. గతంలో ప్రభాస్‌తో కలిసి ‘చత్రపతి’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రియ ఈ సినిమాలో మాత్రం ఆయనకు వదినగా కనిపించబోతుంది.
ఇబ్బంది పెట్టిన అంజలి
తెలుగు అమ్మాయి అంజలి ఎప్పుడూ ఏదో ఒక కారణం చేత మీడియాలో ఉంటూ వస్తుంది. తాజాగా ఆ మీడియాను ఈమె తన ఆలస్యంతో ఇబ్బంది పెట్టింది. అంజలి నటించిన ‘చిత్రాంగద’ చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మీడియా సమావేశం చెప్పిన సమయంకు ప్రారంభం అవుతుందని భావించిన ప్రెస్ మిత్రులు అంతా కూడా ఆ సమయంకు అక్కడకు చేరుకున్నారు మీడియా వారు అక్కడకు చేరుకున్న దాదాపు రెండు గంటలకు కాని అంజలి అక్కడకు రాలేదు. అంజలి కోసం అంత సమయం ఎదురు చూసిన మీడియా వారు ఆమెపై ఆగ్రహంను వ్యక్తం చేశారు. నిర్మాత మరియు దర్శకుడి రిక్వెస్ట్ మేరకు ఆమె వచ్చే వరకు ఎదురు చూసి, ప్రెస్‌మీట్‌ను కవర్ చేశారు. లేట్‌గా వచ్చిన అంజలి సింపుల్‌గా సారీ అంటూ చెప్పి తాను చేసిన తప్పును సరి చేసుకునే ప్రయత్నం చేసింది. కాని మీడియా వారు మాత్రం ఆమెపై తీవ్ర కోపం ఉన్నా ఏమనలేక పోయారు. ఇక ‘చిత్రాంగద’ విషయానికి వస్తే హర్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాన్ని అశోక్ దర్శకత్వంలో శ్రీధర్ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. సినిమా మరో ‘గీతాంజలి’లా ఉంటుందనే నమ్మకంతో చిత్రం యూనిట్ సభ్యులు మరియు ప్రేక్షకులు ఉన్నారు. .
Monday, 19 October 2015
టాప్ లెస్ అంటారేంటి? 'అది' చూపించలేదుగా
బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీష్రాఫ్ కూతురు కృష్ణా ష్రాఫ్ కోరుకుంటున్న తరహా పబ్లిసిటీ ఏమిటో అర్ధమైపోతోంది. ఇప్పటికే రెండు మార్లు తన హాఫ్ న్యూడ్ ఫొటోల పోస్టింగ్‌లతో సంచలనం సృష్టించిన ఈ చిన్నది... ఇప్పుడు ఆ ఫొటో ఫోజులకు తగ్గట్టుగానే మాటలూ వదులుతూ మీడియాకు చేతినిండా పనిపెడుతోంది.
తాజాగా సదరు ఫొటోల గురించి డిఎన్ఎ తో మాట్లాడిన కృష్ణా ష్రాఫ్... ఆ ఇంటర్వ్యూలో తన ఫొటోలు టాప్‌లెస్‌గా ఉన్నాయంటే తాను ఒప్పుకోనని చెప్పింది. అసలు టాప్‌లెస్ అంటే మీకు అర్ధం తెలుసా? అంటూ విశ్లేషణలోకి దిగింది. పై భాగం పూర్తి గా నగ్నంగా ఉన్నంత మాత్రాన టాప్‌లెస్ అనకూడదని, తన ఫొటోల్లో తాను నిపుల్‌ని చూపించలేదని గుర్తు చేసింది. కాబట్టి ఆ ఫొటోలను టాప్‌లెస్ అని వర్ణించడం కరెక్ట్ కాదని అభిప్రాయపడింది. బహుశా ఇప్పటిదాకా ఏ బాలీవుడ్ భామా ఈ స్థాయిలో తమ ప్రైవేట్ బాడీ పార్ట్ గురించి మాట్లాడిన దాఖలా లేకపోవడంతో... ఈ అమ్మడి మాటలు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి.
సరే... ఇంత హడావిడి చేస్తున్నావ్... సినిమాల్లోకి ఎప్పుడొస్తావ్? అని ప్రశ్నిస్తే... అసలు అందంగా ఉన్న అమ్మాయి అనగానే సినిమాల్లోకి రావడం అనే ఎందుకు ఆలోచిస్తారో తనకర్ధం కాదంటూ తన అందానికి తానే కితాబిచ్చేసుకుంది. తండ్రి, అన్నయ్యల షూటింగ్‌లు చూశా కాబట్టి తనకు నటన గురించి అందులోని కష్టనష్టాల గురించి తెలుసంది. అందుకేనేమో... పెద్ద కష్టపడకుండానే ఎంట్రీకి ముందు పబ్లిసిటీ తెచ్చేసుకుందామని ఇలాంటి ఫొటోలు, మాటలు వదులుతోందన్నామాట.
నయనతార పెళ్లి చేసుకుంటుందట
అందాల తార నయనతార త్వరలోనే ఓ ఇంటి ఆడపడుచు కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో తమిళ నటుడు శింబుతో ఓసారి ప్రేమాయణం నడిపిన నయనతార తనతో బ్రేకప్ తరువాత ప్రభుదేవాతో చెట్టాపట్టాలు వేసుకోని తిరిగిన సంగతి తెలిసిందే. ప్రభుదేవాతో ఏడడుగులు నడవాలానుకున్న నయనతార ఎకంగా మతమార్పిడి చేసుకుంది నిజానికి క్రిస్టియన్ అయిన నయనతార, ప్రభుదేవా కోసమని హిందువుగా మారింది అంత చే్స్తే ప్రభుదేవా నయనతారకు హ్యాండ్ ఇచ్చి బాలివుడ్ లో సెటిల్ అయిపోయాడు. అతికష్టం మీద నయనతార ఆ బాధలోంచి బయటపడింది. ఇంతలో మరో జతగాడు దొరికాడు నయన్ బేబికి. ‘నానుం రౌడీ దాన్’ అనే తమిళ సినిమాలో నటించిన నయనతార, ఆ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో గత కోంతకాలంగా డేటింగ్ చేస్తోంది. అంతే కాదు, వీళ్ళిద్దరూ సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకున్నారనే వార్తలూ గతంలో హల్‌చల్ చేశాయి. అప్పుడే పెళ్లి విషయం ఖండించినా, వీళ్లిద్దరి మధ్య ఎఫైర్ కంటిన్యూ అవుతోందని కోలీవుడ్ టాక్. ప్రస్తుతం సినిమాలతో బిజిగా ఉన్న నయనతార . వచ్చే ఏడాది విఘ్నేష్ శివన్ తో పెళ్లి పీటలు ఎక్కుతుందని కోలివుడ్ లో ఒకటే చర్చ . వీళ్లిదరి ఇంట్లో అమోదం ఇప్పటికే దొరికిందని సమాచారం. ఈసారైనా నయనతార పెళ్ళి కోరుకున్నోడితో జరిగి . మనసు మళ్ళీ గాయపడకుంటే చాలు..
మాట మార్చిన ఇలియానా
గోవా సుందరి మాట మార్చేసింది. తాను చెప్పిన నీతులు తానే పాటించడం లేదు. ఇంతకి ఇలియానా ఏం చేసిందో తెలుసుకోవాలనుందా ? అయితే విషయాన్ని పుర్తిగా చదవండి సినిమాలు ఎందుకు తగ్గించారు అని అప్పట్లో అడిగితే, హీరోతో కలిసి ఓ రెండు రోమాంటిక్ సీన్లు చేసి, పాటకు ముందోసారి, మళ్ళీ క్లయిమాక్స్ లో ఓసారి కనిపించడం తనవల్ల కాదని కరాఖండిగా చెపప్పేసింది ఇలియానా అలాంటి పాత్రలు చాలా చేసారు కాదా ఇప్పటికే అని అడిగితే, ఒకప్పుడు తనకు ఇష్టం లేకపోయినా చేయాల్సివచ్చిందని, నిలదొక్కుకోవడానికే అలా చేసానని, ఇప్పుడు ఏది పడితే అది చేసే పొజిషన్ లో తాను లేనని, కథలో తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటేనే సినిమా ఒప్పుకుంటాను అని చెప్పింది ఇల్లి బేబి. అయితే జాకిచాన్ తో చేయబోతున్న సినిమాలో ఇలియానాది అంత విశిష్టమైన పాత్ర ఏమి కాదని టాక్. మరి ఇలియానా ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నట్టు అని గుసగుసలాడుకుంటున్నాయి సినీవర్గాలు. డిమాండ్ తగ్గింది కాబట్టే చేస్తోందా? జాకిచాన్ పాపులారిటిని ఉపయోగించుకోని మరిన్ని అవకాశాలు దక్కించుకుందామనుకుంటోందా? చాలా మంది కాథానాయికలు వదిలేసిన ఆ సినిమాని ఇలియానా చేయాడంలో దాగున్న అంతరార్థం ఎమిటో మారి! చెప్పాల్సిందంతా చెప్పి, తాను చేసేది చేస్తోంది గోవా బ్యూటి..
Sunday, 18 October 2015
అంతా శృతిపై పడుతున్నారు
‘శ్రీమంతుడు’ చిత్రంతో శృతిహాసన్ క్రేజ్ టాలీవుడ్‌లో బాగా పెరిగింది. ప్రస్తుతం ఈమెను తమ సినిమాలో బుక్ చేసుకునేందుకు పలువురు స్టార్ డైరెక్టర్స్ మరియు నిర్మాతలు క్యూలో ఉన్నారు. తాజాగా ఈమె రెండు తెలుగు సినిమాలకు ఓకే చెప్పింది అందులో మొదటిది యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివల కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న మూవీ
రకుల్‌కు షాక్.. అయినా పర్వాలేదు!!
టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రెండు సంవత్సరాల్లోనే స్టార్ హీరోలను తన బుట్టలో వేసుకుని వరుసగా వారి చిత్రాల్లో నటిస్తోంది ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మడు తాజాగా మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌తో కలిసి ‘బ్రూస్‌లీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ‘బ్రూస్‌లీ’ చిత్రం రకుల్‌కు షాక్ ఇచ్చింది యావరేజ్ టాక్‌ను తెచ్చుకున్న ‘బ్రూస్‌లీ’ చిత్రం రకుల్ ఆశపై నీళ్లు చల్లింది మొదటి స్టార్ ప్రాజెక్ట్ నిరాశ పర్చిన ఈ అమ్మడి చేతిలో మరో రెండు భారీ ప్రాజెక్ట్‌ు ఉన్నాయి. ‘బ్రూస్‌లీ’ నిరాశ పర్చిన కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా రాబోతున్న యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంతో బ్లాక్ బస్టర్‌ను అందుకుంటాను అనే నమ్మకంతో ఉంది. ఎన్టీఆర్ సినిమా తర్వాత అల్లు అర్జున్ సినిమా ‘సరైనోడు’ చిత్రం కూడా చేస్తోంది. ‘నాన్నకు ప్రేమతో’ మరియు ‘సరైనోడు’ చిత్రాలు సక్సెస్ అయితే ఈ అమ్మడు స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెళగడం ఖాయం అని సినీ వర్గాల వారు అంటున్నారు. ఈ అమ్మడికి పలువురు హీరోల సరసన హీరోయిన్‌గా నటించే అవకాశాలు వరుసగా వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు కొత్తగా ఏ చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
Thursday, 15 October 2015
ఆమె అందంపై కామెంట్స్
మెగా స్టార్ చిరంజీవి సినిమాల్లో లేకపోయినా కూడా ఇండస్ట్రీకి దగ్గరగానే ఉంటూ వస్తున్నాడు. ఎప్పటికప్పుడు హీరోయిన్స్‌పై ప్రశంసలు కురిపిస్తూ వచ్చాడు, వస్తున్నాడు. ‘రచ్చ’ సినిమా సమయంలో తమన్నాపై ప్రశంసల జల్లు కురిపించిన చిరంజీవి ఆ తర్వాత ఒక సమయంలో సమంతను పొగడ్తలతో ముంచెత్తాడు తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ అందాలపై కామెంట్స్ చేశాడు స్వయంగా రకుల్ అందం గురించి ఆమెతోనే చెప్పాడట. ఈ విషయాన్ని స్వయంగా రకుల్ వెళ్లడిస్తూ. ‘బ్రూస్‌లీ’ చిత్రంలో చిరంజీవి గారితో ఒక సీన్‌లో నటించాను. జీవితంలో చిరంజీవి గారితో నటిస్తానా అని అనుకున్నాను. ఆ ఒక్క సీన్ జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక చిరు తనతో ‘లే చలో.’ పాటలో చాలా అందంగా ఉన్నావని, ఆ పాటకు ప్రేక్షకుల నుండి ప్రశంసలు దక్కడం ఖాయం అని, ఈ సినిమాతో నీ క్రేజ్ మరింతగా పెరుగుందని కూడా అన్నాడు అంటూ సంబర పడుతూ చెబుతోంది. చిరు ప్రశంసలతో రకుల్ గాల్లో తేలిపోతుంది. ఇక ఈమె ప్రస్తుతం ఎన్టీఆర్, అల్లు అర్జున్‌ల చిత్రాల్లో కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. .
Tuesday, 13 October 2015
ఇలియానా పెళ్లి ఘడియలు
బెల్లి భామ ఇలియానా ఈ మధ్య వార్తల్లో ఉంటూనే ఉంటోంది. మళ్ళి ఏం చేసింది ఈ గోవా బ్యూటి అనుకుంటున్నారా . అబ్బో చాలానే చేసింది రెమ్యునరేషన్ తగ్గించుకోకుండా మొండికేసి ఇటు దక్షిణాది లో అవకాశాలు కోల్పోయి, ఎలాంటి సినిమాలో చేయాలో తెలియక అటు బాలివుడ్ లోనూ అవకాశాలు కోల్పోయి ఖాలిగా ఉంటున్న ఈ సుందరికి, తన ప్రియుడు, ఆస్ట్రేలియా అందగాడు ఆండ్రూ నీబోన్ తో ఇటివలే నిశ్చితార్థం కుడా అయిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి ఈ వేడుకను అత్యంత రహస్యంగా నిర్వహించినట్లు సమాచారం. సినిమాకు సంబంధించిన ఎవరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదని సినివర్గాల టాక్. ఇంతకీ ఇలియానా సినిమాలు మానేయాలి అనుకుంటోందా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం. జాకిచాన్ తో చైనా సినిమా అవకాశం వచ్చినట్టు వస్తున్న వార్తలను ఇంతవరకు ఇలియానా ఇటు ఒప్పుకోనులేదు అటు ఖండించనులేదు. బహుషా ఆ సినిమా పూర్తీ చేసి పెళ్లి చేసుకుంటుందేమో !.
నిర్మాతతో ప్రేమలో హీరోయిన్
సినిమా ఎవరిని ఎలా వాడుకోవాలో తెలిస్తే మనల్ని ఎవరు ఆపలేరు . ఈ విషయాన్ని బాగా వంటబట్టించుకున్నట్టుంది కేథరిన్ థ్రేసా . అమ్మడు తెలుగులో కెరీర్ ను మొదలుపెట్టినా అడపాదడపా కొన్ని సినిమాలు తప్ప ఎక్కడా సాఫీగా సాగలేదు అందుకే కోలివుడ్ మీద పడింది ఇప్పుడు కోలివుడ్ లో ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న వార్త ఏంటంటే . కేథరిన్ ఒక స్టార్ నిర్మాతతో ప్రేమాయణం సాగిస్తోందట. ఆ నిర్మాత వలనే ఆయన కేథరిన్ కు ఆఫర్లు వస్తున్నాయని, కేథరిన్ చేస్తున్న నాలుగు సినిమాల్లో మూడింటికి ఆ నిర్మాతే డబ్బులు పెడుతున్నాడని తమిళ తంబీలు గుసగుసలాడుకుంటున్నారు. ఈ జంట పెళ్లి పీటలు ఎక్కినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని కోలివుడ్ కోడై కూస్తోంది. ఇక్కడితో ఆగకుండా ఈ మధ్యే ఆ జంట ఒక ఫారిన్ టూర్ కి కుడా వెళ్లి వచ్చారట. కేథరిన్ కి మరిన్ని ప్రాజెక్ట్స్ దక్కేలా ఆ నిర్మాత తన శక్తంతా ధారబోస్తున్నాడట . ఎంతైనా లోకజ్ఞానం బాగా తెలిసిన అమ్మాయిలా ఉంది మన కేథరిన్. ఏమంటారు ?.
కత్రినా కావాలనే చేస్తోందా ?
జాకిచాన్ సినిమాలో ఛాన్స్ ఇస్తామంటే ఏ అమ్మాయి అయినా ఏం చేస్తుంది. ఎగిరి గంతేస్తుంది.ఎంత పెద్ద హీరోయిన్ అయినా షారుఖ్ ఖాన్ తో సినిమా అంటే ఏం చేస్తుంది ? డేట్స్ అడ్జెస్ట్ కాకపొతే తప్ప, ఖచ్చింతగా మిస్ చేసుకోదు మరి కత్రినాకైఫ్ ఏంటి ఇలా ప్రవర్తిస్తోంది ? జాకిచాన్ త్వరలో ఒక ఇండో-చైనా సినిమా చేయనున్న సంగతి తెలిసిందే
మొదట దానిలో కత్రినాకైఫ్ ని హీరోయిన్ గా అనుకున్నారు. కాని సడెన్ గా కత్రినా ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఆమీర్ ఖాన్ ప్రాజెక్ట్ చెయట్లేదు కాబట్టే నేను కుడా చెయ్యట్లేదు అనే వంక చూపించింది. సరే దానిలో నిజం ఉంది అనుకుందాం. షారుఖ్ దిల్ వాలే కుడా మొదట కత్రినా చేయాల్సిన సినిమా. డేట్స్ ఉండి కుడా సినిమా ఒప్పుకోలేదు. ధూమ్ - 3 తరువాత ఏడాది కత్రినా సినిమా ఒక్కటి రాలేదు. ఈ ఏడాది వచ్చిన ఫాంటమ్ కుడా ధూమ్-3 కి ముందు ఒప్పుకున్న సినిమా. మళ్ళి కత్రిన సినిమా ఎప్పుడు ? దగ్గరలో ఏ సినిమా లేదు. వచ్చిన ఆఫర్స్ అన్ని కాదంటోంది. ఇలా ఎందుకు ? ఇదంతా పెళ్లి కోసమే అంటున్నారు బాలివుడ్ జనాలు. రణబీర్ తో ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా పెళ్లి చేసుకోని సినిమాలు వదిలేయాలి అన్నది కత్రినా ప్లాన్ అంటున్నారు. అందుకేనా కత్రినా ఇలా ప్రవర్తిస్తోంది ?.
మొదట దానిలో కత్రినాకైఫ్ ని హీరోయిన్ గా అనుకున్నారు. కాని సడెన్ గా కత్రినా ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఆమీర్ ఖాన్ ప్రాజెక్ట్ చెయట్లేదు కాబట్టే నేను కుడా చెయ్యట్లేదు అనే వంక చూపించింది. సరే దానిలో నిజం ఉంది అనుకుందాం. షారుఖ్ దిల్ వాలే కుడా మొదట కత్రినా చేయాల్సిన సినిమా. డేట్స్ ఉండి కుడా సినిమా ఒప్పుకోలేదు. ధూమ్ - 3 తరువాత ఏడాది కత్రినా సినిమా ఒక్కటి రాలేదు. ఈ ఏడాది వచ్చిన ఫాంటమ్ కుడా ధూమ్-3 కి ముందు ఒప్పుకున్న సినిమా. మళ్ళి కత్రిన సినిమా ఎప్పుడు ? దగ్గరలో ఏ సినిమా లేదు. వచ్చిన ఆఫర్స్ అన్ని కాదంటోంది. ఇలా ఎందుకు ? ఇదంతా పెళ్లి కోసమే అంటున్నారు బాలివుడ్ జనాలు. రణబీర్ తో ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా పెళ్లి చేసుకోని సినిమాలు వదిలేయాలి అన్నది కత్రినా ప్లాన్ అంటున్నారు. అందుకేనా కత్రినా ఇలా ప్రవర్తిస్తోంది ?.
నిహారిక ఎంట్రీపై చరణ్ షాకింగ్ కామెంట్స్
మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్‌గా నిహారిక ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే బుల్లి తెరపై యాంకర్‌గా తన సత్తా చాటిన ఈ మెగా అమ్మాయి త్వరలో వెండి తెరపై తళుక్కుమనేందుకు రెడీ అవుతోంది. మధుర శ్రీధర్ మరియు టీవీ9 సంయుక్తంగా నిర్మించనున్న చిత్రంలో నాగశౌర్యకు జోడీగా హీరోయిన్‌గా నటించనుంది ఇప్పటికే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చింది
కొన్ని రోజుల క్రితం టీవీ9లో నిహారిక సుదీర్ఘ ఇంటర్వ్యూ వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో స్వయంగా నిహారిక తాను సినీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించింది. ఇంత జరుగుతున్న ఈ సమయంలో తాజాగా రామ్ చరణ్ ఈ విషయంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. నిహారిక ఎంట్రీ గురించి మీడియా మిత్రులు చరణ్‌ను ప్రశ్నించిన సమయంలో తనకు ఆ విషయం తెలియదు అని షాక్ ఇచ్చాడు. చరణ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం మెగా ఫ్యాన్స్‌లో చర్చనీయాంశం అవుతున్నాయి. నిహారిక స్వయంగా పెదనాన్న చిరంజీవితో పాటు అన్నయ్యలు చరణ్, వరుణ్‌లు కూడా తన ఎంట్రీకి ఓకే చెప్పారు అని చెప్పుకొచ్చింది. కాని చరణ్ ఈ కామెంట్స్‌తో ఏదో గందరగోళం తెర వెనుక జరుగుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. .
Monday, 12 October 2015
అమ్మాయిలం ఒకరినొకరు లిప్‌కిస్ ఇస్తే తప్పా?
జమైరాజా అనే టివిషో బాగా పాప్యులర్. అందులో నటించే నటి నియాశర్మకు మంచి ఫాలోయింగూ ఉంది. ఇంకా ఆ ఫాలోయింగ్‌ను పెంచుకోవాలనుకుందో, యధాలాపంగానే చేసిందో తెలీదు గాని... ఈ చిన్నది ఓ చిలిపి పని చేసింది. అదేమిటంటే... తన సహనటి అయిన రెహనా మల్హోత్రాను ముద్దాడడం. అదేదో బుగ్గమీదో, చేతిమీదో అయితే చర్చా లేదు రచ్చా లేదు. బహుశా అలా ఉండదనేమో... ఏకంగా నోట్లో నోరు పెట్టి ముద్దు పెట్టేసింది. అంతేకాదు తమ మధ్య ఉన్న అనుబంధానికి గుర్తుగా దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
కొన్ని రోజుల క్రితం నియా, రెహానాలు లిప్ కిస్ ఇచ్చుకుంటున్న ఒక ఫోటో బయటపడి సెన్సేషన్ క్రియేట్ చేసింది. వాళ్లిద్దరి మధ్యా ఉన్న స్నేహం సంగతి పక్కనపెట్టేసిన మీడియా లెస్బియన్ కిస్ అంటూ ప్రచురణలకు, ప్రసారాలకు దిగింది.
మీడియా ఇచ్చిన ఈ ట్యాగ్ సైతం విమర్శలకు వాదోపవాదాలకు తావిచ్చింది. ఇద్దరు ఫ్రెండ్స్ కిస్ ఇచ్చుకుంటే వాళ్లపై లెస్బియన్ అనే ముద్ర వేసేయడమేనా? అంటూ పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఇద్దరు స్వంత వ్యక్తిత్వాలున్న, కెరీర్‌లో రాణిస్తున్న అమ్మాయిలు తమ మధ్య ఉన్న ప్రేమానుబంధాల్ని బహిరంగంగా ప్రదర్శించుకుంటే అందులో తప్పేం ఉందన్నారు.
మొత్తానికి తమ ముద్దు పై చర్చ హద్దులు దాటుతోందని గుర్తించిన నియా ఇది అర్ధం పర్ధం లేని వివాదం అంటూ తేల్చేసింది. మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని దీన్ని భూతద్దంలో చూడొద్దంది. అయినా ముద్దు గొడవ ఆగకపోవడంతో తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి సదరు ఫొటోని డిలీట్ చేసేసింది. తాము లెస్బియన్స్ కాదు అని స్పష్టంగా చెబుతున్నాం మొర్రో అంటూ నియా మొత్తుకుంది. అయితే రెహనా మాత్రం తాజా ప్రకటనలో తీవ్రంగా స్పందించింది.
"నాకు నీతులు చెప్పొద్దు. నాకు నచ్చింది నేను చేస్తాను. నేను నా గాళ్‌ఫ్రెండ్స్‌ను ముద్దెట్టుకుంటాను. నాకు నచ్చినట్టు దుస్తులు ధరిస్తాను. నా సన్నిహితులు, నాకు కావల్సినవారు నా ప్రవర్తన పట్ల సంతోషంగా ఉంటే చాలు. మీరెవరు నా జీవితంలో జోక్యం చేసుకోవడానికి (ఇక్కడో బూతు పదం కూడా ప్రయోగించింది) ఇద్దరు అమ్మాయిలు తమ మధ్య ఉన్న ప్రేమను తమకు నచ్చినట్టు ప్రదర్శించుకోకూడదా? లెస్బియన్ మాత్రమే ఇలాంటి కిస్ ఇస్తుందా? అనుబంధాలను ప్రదర్శించుకోవడం అనేది మనం మర్చిపోతున్నామా? ఇప్పటికీ ఇద్దరమ్మాయిల మధ్య ముద్దు అనేది ప్రపంచానికి ఇంత పెద్ద విషయమా?" అంటూ ప్రశ్నలతో మండిపడింది.
చివరకి తేలుతున్నదేమిటంటే... ఒకప్పుడు స్త్రీ పురుషులు మాత్రమే తాము సన్నిహితంగా ఉంటే దానికి కారణం ఇదంటూ ప్రపంచానికి వివరణ ఇచ్చుకోవలసి వచ్చేది. ఇప్పుడు ఇద్దరు ఆడవాళ్లను సైతం సన్నిహితంగా ఉంటే సందేహంగా చూడాల్సిన పరిస్థితి, వారు వివరణ ఇచ్చుకోవాల్సిన దుస్థితి. వచ్చేసింది.
కళ్యాణ్ రామ్ కోసం బికినీ వేసింది
‘పటాస్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను అందుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా ‘షేర్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. తాజాగా ఆడియో విడుదలైన ఈ చిత్రాన్ని ఇదే నెల చివర్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో హీరోయిన్‌గా సోనాల్ చౌహాన్ నటిస్తోంది ‘లెజెండ్’, ‘పండగ చేస్కో’ చిత్రాలతో సక్సెస్‌లను దక్కించుకున్న ఈ హీరోయిన్ తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్‌తో రొమాన్స్ చేస్తోంది
గత రెండు చిత్రాల్లో తన హాట్ అందాలను ఆరబోసిన సోనాల్ చౌహాన్ ఈ చిత్రంలో మరింతగా తన అందాలను ప్రేక్షకులకు విందు చేయనున్నట్లుగా తెలుస్తోంది. సోనాల్ చౌహాన్ ‘షేర్’ చిత్రంలో బికినీలో కనిపించనుందని చిత్ర యూనిట్ వర్గాల ద్వారా తెలుస్తోంది. పాటలో ఈ అమ్మడు బికినీ వేసిందని తెలుస్తోంది. ‘పండగ చేస్కో’ చిత్రంలో బికినీ షో చేసిన సోనాల్ తాజాగా మరోసారి కళ్యాణ్ రామ్ కోసం ‘షేర్’ చిత్రంలో కూడా బికినీతో తన అందాలు చూపించనుందని తెలుస్తోంది. ఈ అమ్మడి బికినీ అందాలు తప్పకుండా సినిమాకు ప్రధాన ఆకర్షణ అవ్వడం ఖాయం అని సినీ వర్గాల వారు అంటున్నారు. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలగాలని తపిస్తున్న సోనాల్ చౌహాన్ ఈ చిత్రంతో అయినా ఆ క్రేజ్‌ను దక్కించుకుంటుందో చూడాలి. .
Saturday, 10 October 2015
కిరాయి ఇంట్లో ఉంటున్న బ్యూటి
ఇంగ్లీష్ నేల నుంచి ఇక్కడికొచ్చి తన అందంతో అదరగొడుతున్న భామ ఆమి జాక్సన్. రామ్ చరణ్ ఎవడుతో తెలుగు తెరపై తలుక్కున మెరిసి, మళ్ళి మాయమైపోయింది. అటు తమిళ చిత్రాలు, ఇటు హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న ఆమి జాక్సన్ ఇకపై తన దృష్టంతా బాలివుడ్ పై పెట్టాలని భావిస్తోందట ఆమి జాక్సన్ బాలివుడ్ లో కొత్తగా చేసిన మూవీ " సింగ్ ఈజ్ బ్లింగ్ " అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకుడు. సినిమా పెద్దగా ఆడట్లేదు కాని, బాలివుడ్ బాబులను తెగ ఆకర్షించేసింది ఆమి. ప్రస్తుతం అమ్మడు ఓ రెండు కొత్త చిత్రాల కథాచర్చల్లో పాల్గొంటోంది. హిందీలో సెటిల్ అయిపోదామని చూస్తున్న ఆమీ జాక్సన్, ముంబాయిలోని బాంద్రా ఏరియాలో ఒక ఫ్లాట్ రెంట్ కి తీసుకుంది. ఇప్పుడు అక్కడే ఉంటోంది. చెన్నై,లండన్ నుంచి మాటిమాటికి ముంబాయి వెళ్ళేబదులు ముంబాయిలోనే మకాం పెడితే తనకి అన్ని విధాలా సులువుగా ఉంటుందని అమ్మడి ప్లాన్. మరి ఇల్లు కొనుక్కోవాలి కాని కిరాయి ఎందుకు కట్టడం అనుకుంటున్నారా ? రెండు పెద్ద ప్రాజెక్ట్స్ పడితే కొంటుందట. మళ్ళి అవకాశాలు రాకపోతే డబ్బులు ఊరికే ఖర్చుపెట్టినట్టు అవుతుందిగా. మామూలు ముందుచూపు కాదు కదా అమ్మడిది..
అసిన్ తెగ తిరిగేస్తోంది
దక్షిణాది అందం అసిన్ తెగ తిరిగేస్తోంది. ఈ వారం ఓ దేశంలో ఉంటే మరో వారం మరో దేశంలో ఉంటోంది. సినిమాలు మానేసిందిగా , ఖాలిగా ఉంటే బోర్ కొట్టి ఉంటుంది, అందుకే తిరిగుతుందేమో అనుకోకండి అసలు కారణం వేరే ఉంది
మైక్రోమ్యాక్స్ మొబైల్స్ అధినేత రాహుల్ శర్మ తో మూడు ముళ్ళు వేయించుకోబోతున్న అసిన్, పెళ్లి పనుల్లో నిత్యం బిజీ బిజీగా ఉంటోంది. వీళ్ళిద్దరూ ఈ ఏడాది డిసెంబర్ లో పెళ్లి చేసుకోనున్నారు. పెళ్లి కోసం షాపింగ్ ఇప్పుడే మొదలుపెట్టింది అసిన్. మొన్నే లండన్ బయలుదేరింది బట్టలు కొనుక్కోవడానికి. ఓ వారం అక్కడే ఉండి, అక్కడి నుంచి ప్యారిస్ కి వెళ్తుందట. అక్కడషాపింగ్ అయిపోగానే మళ్ళి న్యుయార్క్ లో షాపింగ్ చేస్తుందట. మనం అమీర్ పేట్ లో కొన్ని బట్టలు కొనుక్కొని, అటు నుంచి పంజాగుట్ట కి వెళ్లి , అక్కడ నచ్చకపోతే సికింద్రాబాద్ లో బట్టలు కొన్నంత ఈజీగా అసిన్ ఈ దేశం నుంచి ఆ దేశం అంటూ తిరుగుతోంది. టైం అలాంటిది. కాబోయే శ్రీవారు ఎవరు మరి, వేల కోట్ల అధిపతి !.
మైక్రోమ్యాక్స్ మొబైల్స్ అధినేత రాహుల్ శర్మ తో మూడు ముళ్ళు వేయించుకోబోతున్న అసిన్, పెళ్లి పనుల్లో నిత్యం బిజీ బిజీగా ఉంటోంది. వీళ్ళిద్దరూ ఈ ఏడాది డిసెంబర్ లో పెళ్లి చేసుకోనున్నారు. పెళ్లి కోసం షాపింగ్ ఇప్పుడే మొదలుపెట్టింది అసిన్. మొన్నే లండన్ బయలుదేరింది బట్టలు కొనుక్కోవడానికి. ఓ వారం అక్కడే ఉండి, అక్కడి నుంచి ప్యారిస్ కి వెళ్తుందట. అక్కడషాపింగ్ అయిపోగానే మళ్ళి న్యుయార్క్ లో షాపింగ్ చేస్తుందట. మనం అమీర్ పేట్ లో కొన్ని బట్టలు కొనుక్కొని, అటు నుంచి పంజాగుట్ట కి వెళ్లి , అక్కడ నచ్చకపోతే సికింద్రాబాద్ లో బట్టలు కొన్నంత ఈజీగా అసిన్ ఈ దేశం నుంచి ఆ దేశం అంటూ తిరుగుతోంది. టైం అలాంటిది. కాబోయే శ్రీవారు ఎవరు మరి, వేల కోట్ల అధిపతి !.
Friday, 9 October 2015
సోగ్గాడితో అనుష్క!
కింగ్ నాగార్జున ప్రస్తుతం ‘సోగ్గాడే చిన్ని నాయనో’ చిత్రంలో అనుష్క మెరవనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే నాగార్జున, కార్తీలు కలిసి నటిస్తున్న ‘ఊపిరి’ చిత్రంలో గెస్ట్ రోల్‌లో నటించిన విషయం తెల్సిందే. ఆ చిత్రం తర్వాత మళ్లీ ఇప్పుడు సోగ్గాడి చిత్రంలో ఒక పాటలో కనిపించనున్నట్లుగా తెలుస్తోంది అనుష్కకు టాలీవుడ్‌కు పరిచయం చేసింది నాగార్జున అనే విషయం తెల్సిందే ఆ విశ్వాసంతోనే స్టార్ హీరోయిన్ అయినప్పటికి నాగార్జున నటిస్తున్న చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటిస్తోంది. నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్న ‘సోగ్గాడే చిన్ని నాయనో’ చిత్రంలో రమ్యకృష్ణ మరియు లావణ్య త్రిపాఠిలు హీరోయిన్‌లుగా నటిస్తున్న విషయం తెల్సిందే. వీరిద్దరితో పాటు హాట్ యాంకర్ అనసూయ మరియు హంసా నందినిలు కూడా ఈ చిత్రంలో కనిపించనున్నారు. ఇంత మంది ముద్దుగుమ్మలు ఉండగా సినిమాకు మరింత గ్లామర్‌ను అందేందుకు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాలోని ఒక పాటలో అనుష్కను చూపించనున్నట్లుగా తెలుస్తోంది. అనుష్క ఎంట్రీతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. వచ్చే నెలలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలున్నాయి.
టాప్ లెస్ ఫోటోషూట్ తో రెచ్చిపోయిన తెలుగు భామ
అదితి రావు హైదరి అనే పేరు ఎప్పుడైనా విన్నారా ? హిందీ సినిమాలు చూసే అలవాటు ఉంటె చెప్పాల్సిన పని లేదు కాని హిందీ సినిమాలు చూడని వాళ్ళకైతే చెప్పాల్సిందే. బాలివుడ్ లో చేసింది తక్కువ సినిమాలే అయినా అమ్మడు మాంచి ఫేమస్. సినిమాల కన్నా ఈ భామ చేసే హాట్ హాట్ ఫోటోషూట్ ల వల్లే ఎక్కువగా జనాల నోళ్ళల్లో నానుతూ ఉంటుంది ఈ అమ్మాయి తెలుగు అమ్మాయా కాదా అనుకుంటున్నారా ? మన తెలుగమ్మయే స్వచ్చమైన హైదరాబాది ఈ అదితి రావు హైదరి. మళ్ళి రెచ్చిపోయింది అదితి. తనకు ఇలాంటివే మామూలే అనుకోండి , ఈసారి బికినితో సరిపెట్టుకోకుండా ఏకంగా అర్థనగ్నంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చేసింది. ఇదంతా పెర్నియాస్ పాప అప్ అనే మ్యాగజిన్ కోసం చేసిన ఫోటో షూట్. అన్నట్టు ఇంకో విషయం, ఒక భారతీయ చిత్రంలో అత్యధిక ముద్దు సన్నివేశంలో నటించిన రికార్డు కుడా ఈ అమ్మడి పేరు మీదే ఉంది. "యే సాలి జిందగీ" అనే చిత్రంలో ఏకంగా 17 సార్లు పెదవి ముద్దుల్లో పాల్గొంది ఈ గడుసరి. ఇంత చేస్తున్న అవకాశాలు మాత్రం రావట్లేదు . సొంతగడ్డకు వచ్చి తెలుగు సినిమాల్లో కుడా ఓ రాయి వేస్తే బాగుండు..
Thursday, 8 October 2015
ఎమ్మెల్యే గా రకుల్ ప్రీత్
రకుల్ ప్రీత్ ఏంటీ . ఎమ్మెల్యే ఏంటి, సినిమాల్లో బాగానే సంపాదిస్తోంది కాదా, మళ్ళీ ఈ పొలిటిక్స్ పిచ్చేంటి అనుకుంటున్నారా ! అవును హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ అతి త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతోంది, అయితే నిజజీవితంలో కాదు. అల్లు అర్జున్, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సరైనోడు మూవీలో రకుల్ హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే ఈ మూవీలో రకుల్ రాజకీయ నేపథ్యం ఉన్న పాత్ర పోషించబోతోంది
ఒక నియోజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించే శాసనసభ సభ్యురాలిగా రకుల్ కనిపించబోతుందట. తన వయసుకి తగ్గ పాత్ర కాకపోయినా, ఆ పాత్రలో ఉన్న షేడ్స్ చాలా ఛాలెంజింగ్ గా ఉండటంతో రకుల్ ఈ పాత్ర పోషించేందుకు ఒప్పుకుంది. ఇంతవరకు గ్లామర్ రోల్స్ లోనే కనిపించిన రకుల్ తొలిసారిగా కొత్త క్యారెక్టర్ లో కనిపించనుంది. ఏమేరకు మెప్పిస్తుందో, జనాలు ఎంతవరకు ఆదరిస్తారో వచ్చే ఏడాది చూడాల్సిందే..
హీరోయిన్ సూట్ కేస్ దొంగలించారు
మహేష్ బాబు అతిథి సినిమాలో హీరోయిన్ గా చేసిన అమ్మాయి గుర్తుంది కదా. పేరు అమృత రావు. అమృతారావు విలువైన సూట్ కేస్ జైపూర్ విమానాశ్రయంలో చోరికి గురైంది అని వార్త ఒక నగల యాడ్ షూటింగ్ నిమిత్తం ఆమె జైపూర్ వెళ్ళగా, తాను తెచ్చుకున్న మూడు లగేజీ బ్యాగ్స్ లో ఒకటి మిస్సయిన విషయాన్ని గమనించి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది
ఇందులో సుమారు లక్ష రూపాయల విలువైన వస్తువులున్నాయని తెలిపింది. " పెద్ద నగరాల్లో ఇలాంటి చిన్న చిన్న ఘటనలు మామూలే, విమానాశ్రయ అధికారులు తన సూట్ కేసును తిరిగి అందజేస్తారన్న నమ్మకం నాకుంది, ప్రస్తుతం నేనిక్కడ షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేస్తున్నాను " అని అమృత తెలిపింది. మరోవైపు ఒక ఎయిర్ పోర్టు అధికారి మాట్లాడుతూ " ఈ విమానాశ్రయంలో ఇలాంటి సంఘటన ఇంతకుముందు జరగలేదు. తమ సిబ్బంది చాలా సిన్సియర్ గా, జాగ్రత్తగా విధులు నిర్వహిస్తారు. దీనిపై త్వరిత గతిన విచారణ జరిపి పోయిన సూట్ కేసును ఆమెకు అందజేస్తాము " అని తెలిపారు..
ఇందులో సుమారు లక్ష రూపాయల విలువైన వస్తువులున్నాయని తెలిపింది. " పెద్ద నగరాల్లో ఇలాంటి చిన్న చిన్న ఘటనలు మామూలే, విమానాశ్రయ అధికారులు తన సూట్ కేసును తిరిగి అందజేస్తారన్న నమ్మకం నాకుంది, ప్రస్తుతం నేనిక్కడ షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేస్తున్నాను " అని అమృత తెలిపింది. మరోవైపు ఒక ఎయిర్ పోర్టు అధికారి మాట్లాడుతూ " ఈ విమానాశ్రయంలో ఇలాంటి సంఘటన ఇంతకుముందు జరగలేదు. తమ సిబ్బంది చాలా సిన్సియర్ గా, జాగ్రత్తగా విధులు నిర్వహిస్తారు. దీనిపై త్వరిత గతిన విచారణ జరిపి పోయిన సూట్ కేసును ఆమెకు అందజేస్తాము " అని తెలిపారు..
Tuesday, 6 October 2015
24 గంటలు చరణ్, రకుల్..!
మెగా ఫ్యాన్స్ ‘బ్రూస్‌లీ’ చిత్రం కోసం భారీ అంచనాలు పెట్టుకుని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే. తాజాగా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్బంగా ఆడియోను విడుదల చేసిన విషయం తెల్సిందే. ఆడియో విడుదల సమయానికి షూటింగ్ పూర్తి కాలేదు తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు
చిత్రాన్ని ముందుగా అనుకున్న సమయానికి విడుదల చేయడం కోసం చిత్ర యూనిట్ సభ్యులు ఎంతో కష్టపడి చిత్రాన్ని ముందుగా అనుకున్న సమయానికి పూర్తి చేశారు. గత రెండు రోజులు రామ్ చరణ్ మరియు రకుల్ ప్రీత్ సింగ్‌లు రోజులో 24 గంటలు షూటింగ్‌తోనే గడిపి అందరిని ఆశ్చర్యపర్చారు. చరణ్‌తో పాటు రకుల్ కూడా పడ్డ కష్టంకు తప్పకుండా మంచి ఫలితం వస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. 24 గంటల ఏకథాటి షూటింగ్‌తో బ్యాలన్స్ ఉన్న ఒక్క పాట కూడా పూర్తి అయ్యింది. దాంతో చిత్ర యూనిట్ సభ్యులు ‘బ్రూస్‌లీ’ చిత్రానికి గుమ్మడి కాయ కొట్టారు. ఇక దసరా కానుకగా ఈనెల 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. శ్రీనువైట్ల మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో చిరు గెస్ట్ రోల్‌లో నటిస్తున్న విషయం తెల్సిందే. .
Subscribe to:
Comments (Atom)
















































